AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఒక్కసారి ఈ బైక్‌పై ఉన్న చలాన్లు చెక్ చేయండి భయ్యా.. మ్యాడ్ అయిపోతారు అంతే..

277 సార్లు రూల్స్ బ్రేక్ చేశాడు ఈ బైక్ ఓనర్. అందులో ఎక్కువ హెల్మెట్ ధరించకపోవడం వల్లే. ఫైన్స్ అన్నీ కలిపి ఏకంగా రూ. 79,845 జరిమానా కట్టాల్సి ఉంది. దీంతో పోలీసులు బైక్ సీజ్ చేశారు. ఈ చలాన్లు 2019, జూన్ 8 నుంచి 2024, డిసెంబర్ 25 వరకు నమోదయ్యాయి.

Telangana: ఒక్కసారి ఈ బైక్‌పై ఉన్న చలాన్లు చెక్ చేయండి భయ్యా.. మ్యాడ్ అయిపోతారు అంతే..
277 Pending Traffic Challan
G Sampath Kumar
| Edited By: Ram Naramaneni|

Updated on: Oct 12, 2025 | 8:37 AM

Share

ట్రాఫిక్ రూల్స్ పెట్టేది ప్రయాణికుల భద్రత కోసం. కానీ కొంతమందికి రూల్స్ అతిక్రమించడం ఓ సరదా అయిపోయింది. అందుకే పోలీసులు ఎక్కడికక్కడ కెమెరాలు పెట్టి రూల్స్ అతిక్రమించేవారి బెండు తీస్తున్నారు. పోలీసులకు చిక్కితే పెండింగ్ చలాన్లు కడితేనే వదిలేస్తున్నారు. లేదంటే బండ్లు సీజ్ చేస్తున్నారు. అయితే తాజాగా ఓ బైక్‌పై ఉన్న పెండింగ్ చలాన్లు చూసి పొలీసులే నివ్వెరపోయిన పరిస్థితి. అతడి బైక్ మీద 277 ట్రాఫిక్ చలాన్లు పెండింగ్ ఉండటం గమనార్హం. ఆ చలాన్లు మొత్తం కలిపి అతను రూ. 79,845 చెల్లించాల్సి ఉంది.  ఈ చలాన్ల రాయుడు కరీంనగర్ పోలీసులకు చిక్కాడు. ఐదు సంవత్సరాల వ్యవధిలో అతనిపై ఈ చలాన్లు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. 277 పెండింగ్ చలాన్లు ఉన్న హీరో యునికార్న్ మోటార్ సైకిల్ (TS 02 EX 1395) ను సీజ్ చేసి పీఎస్‌కు తరలించారు. ఈ చలాన్లు 2019, జూన్ 8 నుంచి 2024, డిసెంబర్ 25 వరకు.. కరీంనగర్, పరిసర ప్రాంతాలలో నమోదయినట్లు పోలీసులు తెలిపారు. గోదాం గడ్డకు చెందిన అబ్దుల్ ఖయ్యూమ్ ఆ బైక్‌ ఓనర్ అని తెలిపారు. అతడు ఆర్ఎంపీ ప్రాక్టీషనర్.

కాగా  హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్ల 254 సార్లు అతనికి చలాన్ పడింది. కరోనా సమయంలో ఫేస్ మాస్క్ ధరించకపోవడం, ట్రిపుల్ రైడింగ్, ఫోన్ వాడుతూ డ్రైవ్ చేయడం, డ్రైవింగ్ లైసెన్స్ లేకపోవడంతో పాటు సరైన నంబర్ ప్లేట్ లేకపోవడం.. అలానే జిగ్ జాగ్ డ్రైవింగ్ వంటి కారణాలతో మిగిలిన చలాన్లు నమోదయ్యాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి. 

ఈ సింపుల్‌ ట్రిక్‌తో.. గుడ్డు కుళ్లిపోయిందో.. లేదో తెలుసుకోండి!
ఈ సింపుల్‌ ట్రిక్‌తో.. గుడ్డు కుళ్లిపోయిందో.. లేదో తెలుసుకోండి!
ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న 10 మంది స్టార్లు ఎవరో తెలుసా!
ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న 10 మంది స్టార్లు ఎవరో తెలుసా!
నేను ఇప్పుడు తెలంగాణ వాన్ని: వెంకయ్య నాయుడు
నేను ఇప్పుడు తెలంగాణ వాన్ని: వెంకయ్య నాయుడు
అమ్మాయికి మొగుడు... అత్తకు యముడు... ఏకంగా గొంతు కోసి..
అమ్మాయికి మొగుడు... అత్తకు యముడు... ఏకంగా గొంతు కోసి..
గురు, శుక్రుల అనుకూలత.. ఆ రాశుల వారికి హద్దుల్లేని సంపద ఖాయం..!
గురు, శుక్రుల అనుకూలత.. ఆ రాశుల వారికి హద్దుల్లేని సంపద ఖాయం..!
మెస్సీ వచ్చిన ఆ రోజు కోల్‌కతా స్టేడియంలో ఏం జరిగింది ?
మెస్సీ వచ్చిన ఆ రోజు కోల్‌కతా స్టేడియంలో ఏం జరిగింది ?
కొత్త ఏడాది ఈ రాశుల వారి కుటుంబాల్లో భారీగా శుభ కార్యాలు..!
కొత్త ఏడాది ఈ రాశుల వారి కుటుంబాల్లో భారీగా శుభ కార్యాలు..!
రైతన్నలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా ఇంటికే యూరియా!
రైతన్నలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా ఇంటికే యూరియా!
టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా
టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా
సమాధులే ఇంటి దేవతలు.. ఏపీలోని ఈ వింత గ్రామం గురించి మీకు తెలుసా
సమాధులే ఇంటి దేవతలు.. ఏపీలోని ఈ వింత గ్రామం గురించి మీకు తెలుసా