ప్రకృతి ప్రసాదించిన అమృతం అవకాడో. దీనితో సలాడ్లు, స్మూతీలు, టోస్ట్‌లు, గ్వాకమోలే వంటి రకరకాల వంటకాలు తయారు చేసుకుని ఆరగించవచ్చు. తక్కువ చక్కెరలు, మంచి కొవ్వులు అధికంగా ఉండటంతో అవకాడో ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది
TV9 Telugu
మృదువైన వెన్నలాంటి గుజ్జుతో ఉండే ఈ పండు ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు అందిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా రెండు వారాల పాటు ప్రతిరోజూ అవకాడో తింటే శరీరంలో కొన్ని మార్పులు కనిపిస్తాయట
TV9 Telugu
అవకాడోలో మోనో అన్‌శాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్‌గా భావించే ఎల్‌డీఎల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. దీంతో గుండె ఆరోగ్యం మెరుగుపడే అవకాశం ఉందని చెబుతున్నారు
TV9 Telugu
ఈ పండులో ఫైబర్‌తోపాటు కొన్ని మొక్కల సమ్మేళనాలు కూడా ఉంటాయి. ఇవి పేగుల్లో మంచి బ్యాక్టీరియా పెరుగుదలకు సహాయపడతాయి. ఫలితంగా జీర్ణక్రియ మెరుగుపడి జీర్ణాశయ ఆరోగ్యానికి మేలు జరుగుతుంది
TV9 Telugu
అవకాడోలో పొటాషియం కూడా అధికంగా ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. అలాగే గుండె సంబంధిత ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా ఉపయోగపడుతుందని చెబుతున్నారు
TV9 Telugu
అంతేకాకుండా ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వుల కలయిక వల్ల అవకాడో ఎక్కువసేపు కడుపు నిండిన భావనను కలిగిస్తుంది. దీంతో అతిగా తినే అలవాటు తగ్గే అవకాశం ఉంటుంది. రోజుకు అర అవకాడో నుంచి ఒక అవకాడో వరకు తీసుకోవడం చాలామందికి సరిపోతుందని సూచిస్తున్నారు
TV9 Telugu
వెన్న, మయోనైస్ లేదా ఎక్కువ క్రీమ్ ఉండే డ్రెస్సింగ్‌లకు బదులుగా అవకాడోను ఉపయోగిస్తే ఆహారంలోని కొవ్వుల నాణ్యత మెరుగుపడుతుందని కూడా నిపుణులు చెబుతున్నారు. కాలేయ ఆరోగ్యానికి మద్దతు ఇచ్చే ఖనిజాలు దీనిలో దండిగా ఉన్నాయి
TV9 Telugu
అవకాడోలో గ్లుటాథయోన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వల్ల కాలేయం హానికర పదార్థాలను బయటకు పంపడంలో సహాయపడుతుందని పేర్కొంటున్నారు. అలాగే ఇందులో విటమిన్ సి, బి9, ఇ లాంటి యాంటీ ఆక్సిడెంట్ విటమిన్లు ఉండటంతో శరీర కణాలను రక్షించడంలో ఉపయోగపడతాయి