AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gruha Yoga: కుజ బలంతో వారికి గృహ యోగం.. ! ఇందులో మీ రాశి ఉందా..?

మేష రాశిలో కుజుడి స్వస్థాన సంచారం కారణంగా కొన్ని రాశుల వారికి ఆస్తి, సంపద, సొంత ఇంటి యోగాలు బలపడనున్నాయి. ముఖ్యంగా మేషం, మిథునం, కర్కాటకం, తుల, మకరం, మీన రాశుల వారు జూన్ 20లోగా స్థిరాస్తులు సంపాదించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కుజుడి అనుకూల ప్రభావంతో ఆర్థిక స్థిరత్వం, ఆస్తి లాభాలు కలగనున్నాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.

TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 15, 2026 | 5:24 PM

Share
మేష రాశిలో రాశ్యధిపతి కుజుడు ప్రవేశించడం వల్ల కొన్ని రాశులకు అనేక విధాలుగా శుభ యోగాలు కలగబోతున్నాయి. సాధారణంగా ఏ రాశికైనా కుజుడు అనుకూలంగా ఉన్న పక్షంలో ఆ రాశివారికి స్థిరాస్తులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఆస్తిపాస్తులు ఎక్కువగా సమకూర్చుకోవడం జరుగుతుంది. కుజుడి స్వస్థాన సంచారం మేషం, మిథునం, కర్కాటకం, తుల, మకరం, మీన రాశుల వారికి అనుకూలంగా ఉన్నందువల్ల ఆ రాశుల వారు జూన్ 20 లోగా తప్పకుండా ఆస్తిపాస్తులు సంపాదించుకోవడానికి అవకాశం ఉంది. సొంత ఇంటి యోగం కూడా కలుగుతుంది.

1 / 7
మేషం: ఈ రాశిలో రాశ్యధిపతి కుజుడు సంచారం చేస్తున్నందువల్ల తప్పకుండా సొంత ఇంటి కల నెరవేరుతుంది. ఇల్లు కట్టుకునే అవకాశం ఎక్కువగా ఉంది. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమై ఆస్తి లాభం, భూలాభం కలుగుతాయి. ఆస్తి ఒప్పందాలు, ఆర్థిక ఒప్పందాలు కుదురుతాయి. ఖరీదైన ప్రాంతంలో స్థలం కొనే అవకాశం ఉంటుంది. రవి, గురువులు కూడా కుజుడికి అనుకూల స్థానాల్లో ఉన్నందు వల్ల ప్రభుత్వం నుంచి కూడా ఇల్లు లేదా స్థలం లభించే అవకాశం ఉంది.

2 / 7
మిథునం: ఈ రాశికి లాభ స్థానంలో లాభ స్థానాధిపతి కుజుడి సంచారం వల్ల ఈ రాశివారికి వారసత్వ సంపద సంక్రమించే అవకాశం ఉంది. తండ్రి వైపు నుంచి ఆస్తి లాభం, భూలాభం కలుగుతుంది. సొంత ఇంటి ఆలోచన తప్పకుండా నెరవేరుతుంది. కొద్ది ప్రయత్నంతో ఈ రాశివారికి స్థిరాస్తులు బాగా వృద్ధి చెందుతాయి. ఆశించిన ప్రదేశంలో ఫ్లాట్ అమరే అవకాశం ఉంది. రవి కూడా బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ప్రభుత్వపరంగా కూడా ఇల్లు గానీ, స్థలం గానీ లభించే అవకాశం ఉంటుంది.

3 / 7
కర్కాటకం: ఈ రాశివారికి దశమ స్థానంలో కుజుడి సంచారం వల్ల సిరిసంపదలు బాగా వృద్ధి చెందుతాయి. ఆస్తిపాస్తులు సంక్రమిస్తాయి. ఆస్తుల విలువ బాగా పెరుగుతుంది. రియల్ ఎస్టేట్ కూడా బాగా లాభిస్తుంది. కొద్ది ప్రయత్నంతో తప్పకుండా గృహ యోగం పడుతుంది. పని చేస్తున్న సంస్థ ద్వారా కూడా గృహ యోగం కలిగే అవకాశం ఉంది. అనుకోకుండా ప్రభుత్వపరంగా సహాయ సహ కారాలు లభించే సూచనలున్నాయి. ఆశించిన స్థాయిలో ఆర్థిక సహాయం అందే అవకాశం ఉంది.

4 / 7
తుల: ధనాధిపతి, భూ కారకుడు అయిన కుజుడు సప్తమ స్థానంలో ఉన్నందువల్ల జీవిత భాగస్వామి తరఫు నుంచి ఆకస్మిక గృహ లాభానికి, ఆస్తి లాభానికి అవకాశం ఉంది. వీరికి త్వరలో గృహ యోగం పట్టే అవకాశం ఉంది. ఇల్లు కొనుక్కోవడానికి ఆర్థికంగా ఇబ్బందులేమీ ఉండకపోవచ్చు. తల్లితండ్రులు, కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఇండిపెండెంట్ ఇల్లు లేదా ఫ్లాట్ కొనుక్కోవడానికి ఇది చాలా అనుకూల సమయం. ఆస్తిపాస్తుల విలువ పెరుగుతుంది.

5 / 7
మకరం: ఈ రాశికి నాలుగవ స్థానంలో, అంటే గృహ, వాహన, ఆస్తిపాస్తులకు సంబంధించిన స్థానంలో కుజుడు సంచారం చేస్తున్నందువల్ల అతి త్వరలో తప్పకుండా గృహ యోగం పట్టే అవకాశం ఉంది. ఇల్లు గానీ, ఫ్లాట్ గానీ, స్థలం గానీ అమరే అవకాశం ఉంది. ఉద్యోగపరంగా గృహ సౌకర్యం ఏర్పడడానికి కూడా అవకాశం ఉంది. కొద్ది ప్రయత్నంతో ఆర్థిక సహాయం కూడా లభిస్తుంది. తల్లి వైపు నుంచి ఆస్తిపాస్తులు లభిస్తాయి. ఆస్తి వివాదం బాగా అనుకూలంగా పరిష్కారం అవుతుంది.

6 / 7
మీనం: ఈ రాశికి ధన భాగ్యాధిపతిగా అత్యంత శుభుడైన కుజుడు ధన స్థానంలో సంచారం చేయడం వల్ల జూన్ 20లోగా ఈ రాశివారి ఆస్తిపాస్తులు వృద్ధి చెందే అవకాశం ఉంది. కొద్ది ప్రయత్నంతో గృహ యోగం పట్టే సూచనలున్నాయి. ఆస్తి వివాదం పరిష్కారమై విలువైన ఆస్తి చేతికి వస్తుంది. సకాలంలో ఆర్థిక సహాయం కూడా లభిస్తుంది. ఇల్లు లేదా ఫ్లాట్ కొనడానికి ఇది బాగా అనుకూల సమయం. ఉద్యోగపరంగా సహాయం లభించే అవకాశం ఉంది. ఆస్తిపాస్తుల విలువ పెరుగుతుంది.

7 / 7
Follow Us