అతను చాలా టాలెంటెడ్.. సరైన పాత్రలు వస్తే స్టార్ హీరో అవుతాడు..
టాలీవుడ్ లో తన నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు రాజీవ్ కనకాల. విలన్ గా, హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించారు రాజీవ్ కనకాల. ఎన్నో విలక్షణమైన పాత్రలు చేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు రాజీవ్ కనకాల..

ప్రముఖ నటుడు రాజీవ్ కనకాల గతంలో ఒక ఇంటర్వ్యూలో ఓ హీరో గురించి, కెరీర్ భవిష్యత్తు, సినీ పరిశ్రమలో మారుతున్న పోకడలు, తన తండ్రి, దిగ్గజ నటుడు, దర్శకుడు దేవదాస్ కనకాల సినీ ప్రస్థానం గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ సినిమాలతో తనకు సుదీర్ఘ అనుబంధం ఉందని, ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించానని తెలిపారు. స్టూడెంట్ నెంబర్ వన్ నుంచి, జనతా గ్యారేజ్, ఆర్ఆర్ఆర్ వంటి ఎన్నో చిత్రాలలో నటించానని రాజీవ్ తెలిపారు. ఇండస్ట్రీలో తన సన్నిహిత స్నేహితులలో తరుణ్, మనోజ్, శివ బాలాజీ ఉన్నారని ఆయన పేర్కొన్నారు. తరుణ్ గురించి మాట్లాడుతూ.. అతను మళ్ళీ సినిమాల్లోకి వచ్చి అద్భుతాలు చేయగలడని రాజీవ్ కనకాల అన్నారు. సరైన పాత్రలను, ముఖ్యంగా హీరోయిజం ఉన్న విభిన్న పాత్రలను ఎంచుకుంటే తరుణ్ ఖచ్చితంగా విజయవంతమవుతాడని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇది కూడా చదవండి : నువ్వొద్దు.. నీ పాటలొద్దు..! బాలసుబ్రహ్మణ్యంతో గొడవపడ్డ ఒకే ఒక్క హీరో.. చివరకు ఏం జరిగిందంటే
ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌ల రాకతో సినీ పరిశ్రమలో గణనీయమైన మార్పులు వచ్చాయని, ఇది నటులకు కొత్త మార్గాలను తెరుస్తోందని రాజీవ్ స్పష్టం చేశారు. గతంలో హీరో పాత్రలకే పరిమితమైన లేదా కొన్ని ఆబ్లిగేషన్స్‌తో ఉన్న నటులు ఇప్పుడు ఓటీటీ ద్వారా ఇండివిడ్యువల్ ప్రాజెక్టులలో రాణిస్తున్నారని అన్నారు. నటుడు శ్రీరామ్ ఇప్పుడు సైడ్ క్యారెక్టర్లు చేయకుండా, ఓటీటీ వల్ల అనేక ప్రాజెక్టులలో హీరోగా అవకాశాలు పొందుతున్నారని అన్నారు రాజీవ్. తరుణ్ కూడా ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకొని తిరిగి సినీ రంగంలో కీలక పాత్ర పోషించగలడని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తన తండ్రి, దివంగత దేవదాస్ కనకాల ప్రస్థానాన్ని రాజీవ్ వివరించారు.
ఇది కూడా చదవండి : OTT Movie : IMDB 7.4 రేటింగ్.. వణికిస్తున్న థ్రిల్లర్ మూవీ.. ఏకంగా ఆరు ఓటీటీల్లో
పూణే ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో చదువుకున్న దేవదాస్ కనకాల, సౌత్ ఇండియాలో తొలి శిక్షణ పొందిన నటులలో ఒకరని తెలిపారు. సినీ రంగంలో అవకాశాల కోసం చెన్నైకి వెళ్ళినప్పుడు, అక్కడ లాబీయింగ్ కారణంగా ఆశించిన గుర్తింపు రాలేదని పేర్కొన్నారు. బుద్ధిమంతుడు, కాలం మారింది వంటి కొన్ని చిత్రాలలో నటించినప్పటికీ, నిలదొక్కుకోవడానికి కష్టపడ్డారని చెప్పారు. ఈ క్రమంలోనే, సాంగ్ అండ్ డ్రామా డివిజన్‌లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందని, దాంతో హైదరాబాద్‌కు మారిపోయారని రాజీవ్ వివరించారు. అక్కడ తన తల్లితో కలిసి పనిచేసి, ప్రేమించి పెళ్లి చేసుకున్నారని తెలిపారు. అయితే, ప్రభుత్వ ఉద్యోగంలో స్థిరపడినా, సినిమాపై ఉన్న ప్రేమతో దానిని వదిలిపెట్టి సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ స్థాపించిన ఇన్‌స్టిట్యూట్‌లో చేరారని రాజీవ్ తెలిపారు.
ఇది కూడా చదవండి : Siddarth: నా సినిమాలకు నంది అవార్డులు వచ్చాయి.. కానీ నన్ను పట్టించుకోలేదు..
View this post on Instagram




