AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TV9 CBC 2026: అట్టహాసంగా టీవీ9 నెట్‌వర్క్ కార్పొరేట్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్.. తదుపరి రౌండ్‌కు 32 టీంలు..

TV9 Corporate Badminton Championship 2026: కార్పొరేట్ ఉద్యోగుల పని ఒత్తిడిని తగ్గించి, వారిలో శారీరక దృఢత్వాన్ని, జట్టు సమన్వయాన్ని పెంపొందించడానికి ఇటువంటి క్రీడలు ఎంతో దోహదపడతాయి. గూగుల్ ఇన్‌ఫినిట్స్, క్వాంటెల్లి సొల్యూషన్స్, మనుహ టెక్నాలజీస్, నెట్‌ప్లే స్పోర్ట్స్ వంటి జట్లు తమ తొలి మ్యాచ్‌ల్లో అద్భుత విజయాలను నమోదు చేశాయి. కొన్ని జట్లు వాకోవర్ ద్వారా తదుపరి దశకు చేరుకోగా, మరికొన్ని జట్లు చివరి నిమిషం వరకు పోరాడి గెలుపొందాయి.

TV9 CBC 2026: అట్టహాసంగా టీవీ9 నెట్‌వర్క్ కార్పొరేట్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్.. తదుపరి రౌండ్‌కు 32 టీంలు..
Tv9 Corporate Badminton Championship 2026
Venkata Chari
|

Updated on: May 15, 2026 | 9:15 PM

Share

TV9 Corporate Badminton Championship 2026: హైదరాబాద్ నగరంలోని ప్రముఖ పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీ వేదికగా టీవీ9 నెట్‌వర్క్ కార్పొరేట్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ సీజన్-2 శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. మూడు రోజుల పాటు జరిగే ఈ మెగా టోర్నీలో దిగ్గజ ఐటీ, కార్పొరేట్ సంస్థల ప్రతినిధులు తమ ప్రతిభను చాటుకునేందుకు సిద్ధమయ్యారు. క్రీడా స్ఫూర్తిని పెంపొందించే లక్ష్యంతో నిర్వహిస్తున్న ఈ పోటీలు నగర క్రీడాభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

ఉత్సాహంగా సాగుతున్న తొలిరోజు పోటీలు..

తెలంగాణ బ్యాడ్మింటన్ అసోసియేషన్ సహకారంతో నిర్వహిస్తున్న ఈ టోర్నీలో మే 15వ తేదీన తొలిరోజు మ్యాచ్‌లు అత్యంత ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. పురుషుల సింగిల్స్, మహిళల సింగిల్స్, మిక్స్డ్ డబుల్స్ విభాగాల్లో క్రీడాకారులు తలపడుతున్నారు. ముఖ్యంగా పురుషుల సింగిల్స్ విభాగంలో జరిగిన రౌండ్ ఆఫ్ 128 మ్యాచ్‌ల్లో క్రీడాకారులు నువ్వా-నేనా అన్నట్లుగా పోటీ పడ్డారు. కొన్ని మ్యాచ్‌లు హోరాహోరీగా సాగి మూడు సెట్ల వరకు వెళ్లడం విశేషం.

మెన్ టీమ్ ఈవెంట్: 32 జట్ల మధ్య పోరు..

ఈ సీజన్‌లో ప్రధాన ఆకర్షణగా నిలిచిన మెన్ టీమ్ ఈవెంట్ కోసం మొత్తం 32 జట్లు ఎంపికయ్యాయి. ఈ జట్లను వివిధ గ్రూపులుగా విభజించి రౌండ్ రాబిన్ పద్ధతిలో పోటీలు నిర్వహిస్తున్నారు. మైక్రోసాఫ్ట్, గూగుల్, ఇన్ఫోసిస్, టీసీఎస్, అమెజాన్, డెలాయిట్ వంటి దిగ్గజ సంస్థల జట్లు ఈ పోటీల్లో తలపడుతున్నాయి. గ్రూప్ దశలో విజయం సాధించి నాకౌట్ దశకు చేరుకోవడమే లక్ష్యంగా జట్లు వ్యూహ ప్రతివ్యూహాలతో బరిలోకి దిగాయి.

ప్రముఖ సంస్థల భాగస్వామ్యం..

కార్పొరేట్ ఉద్యోగుల పని ఒత్తిడిని తగ్గించి, వారిలో శారీరక దృఢత్వాన్ని, జట్టు సమన్వయాన్ని పెంపొందించడానికి ఇటువంటి క్రీడలు ఎంతో దోహదపడతాయి. గూగుల్ ఇన్‌ఫినిట్స్, క్వాంటెల్లి సొల్యూషన్స్, మనుహ టెక్నాలజీస్, నెట్‌ప్లే స్పోర్ట్స్ వంటి జట్లు తమ తొలి మ్యాచ్‌ల్లో అద్భుత విజయాలను నమోదు చేశాయి. కొన్ని జట్లు వాకోవర్ ద్వారా తదుపరి దశకు చేరుకోగా, మరికొన్ని జట్లు చివరి నిమిషం వరకు పోరాడి గెలుపొందాయి.

ముగింపు వేడుకలు, బహుమతులు..

మే 17వ తేదీ వరకు సాగే ఈ ఛాంపియన్‌షిప్‌లో తుది విజేతలను నిర్ణయించేందుకు ఫైనల్ మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. విజేతలకు ఆకర్షణీయమైన బహుమతులతో పాటు ట్రోఫీలను అందజేస్తారు. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన పుల్లెల గోపీచంద్ అకాడమీ కోర్టులపై ఆడటం తమకు ఒక గొప్ప అనుభూతిని ఇస్తోందని క్రీడాకారులు ఈ సందర్భంగా సంతోషం వ్యక్తం చేశారు. టీవీ9 నెట్‌వర్క్ నిర్వహిస్తున్న ఈ వినూత్న ప్రయత్నం పట్ల కార్పొరేట్ వర్గాల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us