Telangana: తెల్లారి పొలం పనులకు వెళ్లిన రైతు.. ఎదురుగా కనిపించిన సీన్ చూసేసరికి
నక్క గ్రామం లో హల్చల్ చేసింది. కనబడిన వ్యక్తుల పై దాడి చేసింది. స్థానికులు పరుగులు తీశారు.నలుగురు పై దాడి చేయడం తో ఆసుపత్రి పాలయ్యారు. ఇంతకీ ఆ వివరాలు ఏంటో ఈ స్టోరీ తెలుసుకుందామా మరి.! లేట్ ఎందుకు ఓ లుక్కేయండి
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం మద్దికుంట గ్రామంలో నలుగురు వ్యక్తులపై నక్క దాడి చేయడంతో ఒక్కసారిగా గ్రామస్తులు ఉలిక్కిపడ్డారు. జిల్లాలో కుక్కలు, చిరుతలు, ఎలుగుబంట్లు దాడి చేయడం తరుచూ వార్తల్లో చూస్తాం కానీ మొదటిసారిగా నక్క హల్చల్ చేయడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.
ఇది చదవండి: ఫస్ట్ ఫ్లాప్.. ఆ తర్వాత కల్ట్ క్లాసిక్.. 15 రోజుల్లో పూర్తైన ఈ మూవీ ఏంటంటే.?
వివరాల్లోకి వెళితే.. తెల్లవారుజామున ఇంటి ముందు వాకిలి ఊడుస్తున్న క్రమంలో ఒక్కసారిగా రాధమ్మ అనే మహిళపై ఆకస్మికంగా దాడి చేసి మొహంపై తీవ్రంగా గాయపరిచి చెట్ల పొదల్లోకి వెళ్ళింది. అదే దారిలో పొలం పనులు వెళుతుండగా సత్తయ్య (40), తెర్లుమద్ది కిషన్ (32) మరో వ్యక్తిపై నక్క దాడి చేసి గాయపరిచింది. గ్రామంలో ఏం జరుగుతుందని తెలిసే లోపల గాయపరచడంతో ఆందోళనకు గురైయ్యారు. అక్కడే ఉన్న గ్రామస్తులు, యువకులు తేరుకుని నక్కను పట్టుకునేందుకు చాలా కష్టపడ్డారు. ఎట్టకేలకు నక్కను పట్టుకుని కట్టెలతో కొట్టడంతో గాయపడి స్పృహ తప్పి పడిపోయింది. గ్రామం పక్కనే అడవి ఉందని ఇంకా ఎన్ని నక్కలు ఉన్నాయో అవి ఎక్కడి నుంచి దాడి చేస్తాయో అని గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. ఇలాంటి ఘటనలు జరగకుండా అటవీ శాఖ అధికారులు చూడాలని గ్రామస్తులు కోరారు. పండుగ పూట విషాదం నెలకొంది. మరిన్ని నక్కలు ఉంటాయని స్థానికులు భయపడుతున్నారు.
ఇది చదవండి: కలలో చనిపోయిన వ్యక్తులు కనిపిస్తే దాని అర్ధం ఏంటో తెల్సా
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి