CM Revanth Reddy: పార్టీ ఫిరాయింపులపై సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఏమన్నారంటే
మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు రచించిన "ఉనిక" పుస్తకావిష్కరణ సభలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. విద్యార్థి దశలో సిద్ధాంతపరమైన భావజాలం లేకపోవడం వల్లే రాజకీయాల్లో పార్టీ ఫిరాయింపులు జరుగుతున్నాయన్నారు. విద్యార్థి జీవితంలో చైతన్యం లేకపోవడం వల్లే ప్రజాజీవితంలోకి వచ్చే వాళ్లు ఏదో ఒక పదవి కావాలని ఆశించి పార్టీలు మారుతున్నారని కామెంట్ చేశారు.
మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు రచించిన “ఉనిక” పుస్తకావిష్కరణ సభలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. విద్యార్థి దశలో సిద్ధాంతపరమైన భావజాలం లేకపోవడం వల్లే రాజకీయాల్లో పార్టీ ఫిరాయింపులు జరుగుతున్నాయన్నారు. విద్యార్థి జీవితంలో చైతన్యం లేకపోవడం వల్లే ప్రజాజీవితంలోకి వచ్చే వాళ్లు ఏదో ఒక పదవి కావాలని ఆశించి పార్టీలు మారుతున్నారని కామెంట్ చేశారు. అధికార, ప్రతిపక్షాలు కలిస్తేనే ప్రభుత్వమని అన్నారు సీఎం రేవంత్. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల్లో లోపాలు ఉంటే ప్రతిపక్షాలు ఎత్తిచూపాలన్నారు. అందుకే విపక్షానికి కూడా ఓ ఫ్లోర్ లీడర్ ఉన్నారని చెప్పారు. కానీ కాలక్రమంలో ఆ స్పూర్తిని కోల్పోయామన్నారు.
ఇది చదవండి: ఫస్ట్ ఫ్లాప్.. ఆ తర్వాత కల్ట్ క్లాసిక్.. 15 రోజుల్లో పూర్తైన ఈ మూవీ ఏంటంటే.?
శాసనసభలో అన్ని అంశాలపై చర్చ జరగాలన్నది తమ విధానమని చెప్పారు. అందుకే తాము అధికారంలోకి వచ్చిన తరువాత ఎప్పుడూ విపక్షాలను సభ నుంచి సస్పెండ్ చేయలేదన్నారు. తమిళనాడులో పార్టీ మధ్య విభేదాలు ఉన్నా.. రాష్ట్రం కోసం అంతా ఒక్కటవుతారన్నారు సీఎం రేవంత్. మనం కూడా సమస్యల పరిష్కారం, అభివృద్ధి కోసం ఒక్కటిగా పని చేయాలని సూచించారు. కేంద్రమంత్రులుగా ఉన్న కిషన్ రెడ్డి, బండి సంజయ్, బీజేపీ నేతలు ఇందుకు సహకరించాలని కోరారు.
ఇది చదవండి: కలలో చనిపోయిన వ్యక్తులు కనిపిస్తే దాని అర్ధం ఏంటో తెల్సా
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి