AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సంక్రాంతి స్పెషల్ ఈ రాజస్థానీ స్వీట్.. ఇప్పుడు మిస్ అయితే మళ్లీ ఏడాది తర్వాతే

సంక్రాంతి వచ్చిందంటే చాలు..నిజామాబాద్‌లోని రాజస్థానీ స్వీట్ షాపులకు తాడికి మొదలవుతుంది. పండగకు వారం ముందు నుంచి గంజ్ మార్కెట్ కళకళలాడుతుంది. పండగపూట పిండివంటల తయారీకి అవసరమయ్యే సామాగ్రి కొనేందుకు ప్రజలు మార్కెట్‌కు వెళ్తారు. కానీ నిజామాబాద్‌లో మాత్రం.. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

సంక్రాంతి స్పెషల్ ఈ రాజస్థానీ స్వీట్.. ఇప్పుడు మిస్ అయితే మళ్లీ ఏడాది తర్వాతే
Ghevar Sweet
Ravi Kiran
|

Updated on: Jan 12, 2025 | 2:53 PM

Share

సంక్రాంతి వచ్చిందంటే చాలు..నిజామాబాద్‌లోని రాజస్థానీ స్వీట్ షాపులకు తాడికి మొదలవుతుంది. పండగకు వారం ముందు నుంచి గంజ్ మార్కెట్ కళకళలాడుతుంది. పండగపూట పిండివంటల తయారీకి అవసరమయ్యే సామాగ్రి కొనేందుకు ప్రజలు మార్కెట్‌కు వెళ్తారు. కానీ నిజామాబాద్‌లో మాత్రం.. ప్రత్యేక స్వీట్‌ను ఆస్వాదించేందుకు వస్తుంటారు. కేవలం సంక్రాంతి పండుగ సమయంలోనే ఈ స్వీట్‌..షాపుల్లో దొరుకుతుంది. ఆ స్వీట్‌ పేరే ఘేవర్‌. ఈ మిఠాయి రుచి చూసేందుకు..ప్రజలు ఆసక్తి చూపుతుంటారు.

ఇది చదవండి: కలలో చనిపోయిన వ్యక్తులు కనిపిస్తే దాని అర్ధం ఏంటో తెల్సా

ఈ ఘేవర్‌..రాజస్థానీ సాంప్రదాయ వంటకం. ఆ రాష్ట్రానికి చెందిన వ్యాపారులు..ఈ స్వీట్‌ను 40 ఏళ్ల క్రితం నిజామాబాద్‌ వాసులకు పరిచయం చేశారు. మొదట్లో వీటి అమ్మకాలు అంతంతమాత్రమే ఉండేవి. క్రమంగా ఈ స్వీట్‌ స్థానికంగా ఫేమస్‌ అయింది. జిల్లాలోని ఇతర ప్రాంతల నుంచి సైతం ఘేవర్ స్వీట్ కోసం వస్తున్నారంటే దీని పాపులారిటీ అర్ధం చేసుకోవచ్చు. సాధారణ ఘేవర్‌తో పాటు మలై ఘేవర్, షుగర్‌లెస్ ఘేవర్‌ను కూడా తయారు చేస్తున్నారు..ఇక్కడి వ్యాపారులు. సలసల మరిగే నూనెలో..ప్రత్యేకంగా తయారుచేసిన పెంకపై ఈ ఘేవర్‌ను తయారు చేస్తారు. ఈ స్వీట్‌ తయారీలో పాలతో పాటు గొధుమపిండి, మైదాలను ఉపయోగిస్తారు. వేడి వేడి ఘేవర్‌ను ఆస్వాదించేందుకు ఎంతో మంది ఇష్టపడతారు. అయితే నగరంలో ఎన్నో తయారీ కేంద్రాలు ఉన్నప్పటికీ..రాజు ఘేవర్‌కు ప్రత్యేకత ఉంది.

ఇవి కూడా చదవండి

నిజామాబాద్‌కు ఈ స్వీట్‌ను పరిచయం చేసింది వీరి పూర్వీకులే. నిజామాబాద్‌లో సంక్రాంతి సమయంలో మాత్రమే లభ్యమయ్యే ఘేవర్‌.. చుట్టుపక్కల జిల్లాల్లో కూడా ఫేమస్‌ అయింది. తాము తయారు చేసిన స్వీట్‌ను..శుభకార్యాల్లో సైతం ఉపయోగిస్తుండడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు..వ్యాపారులు. అందుకే అన్ని వర్గాలకు అందుబాటులో ఉండేలా ఈ స్వీట్ ధరలకు ఉంచామని చెబుతున్నారు. పండుగ సీజన్‌ అయిపోగానే ఈ స్వీట్ తయారీని ఆపేస్తారు. దీంతో ఘేవర్ స్వీట్ తినాలంటే మళ్లీ సంక్రాంతి వరకు వేచిచూడాల్సిందే. అందుకే ఇందూరు వాసులకు ఈ ఘేవర్‌ స్వీట్‌ అంటే అంత ఇష్టం.

ఇది చదవండి: ఫస్ట్ ఫ్లాప్.. ఆ తర్వాత కల్ట్ క్లాసిక్.. 15 రోజుల్లో పూర్తైన ఈ మూవీ ఏంటంటే.?

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి