Telangana: సీన్ చూసి యాక్సిడెంట్ జరిగిందనుకునేరు.. అసలు మ్యాటర్ తెలిస్తే బిత్తరపోతారు
ఎక్కడికక్కడ నిఘా నేత్రాలు ఏర్పాటయ్యాయి. తెలంగాణ రాష్ట్రమంతా డ్రగ్స్ ఫ్రీ న్యూ ఇయర్ వేడుకలు జరిగేలా పోలీసు యంత్రాంగం కఠిన చర్యలు తీసుకుంది. అయితేనేం మాకేం పట్టింపు అంటూ.. కొందరు కేటుగాళ్లు యదేచ్చగా మాదకద్రవ్యాలు, గంజాయిని రాష్ట్ర సరిహద్దులు దాటించాలని చూశారు.
వార్నింగ్‌లు ఇచ్చినా.. కేసులు పెడుతున్నా.. ఆఖరికి జైళ్లకూ పంపుతున్నా.. కేటుగాళ్లు మారడం లేదు.! ఎప్పటికప్పుడు క్రియేటివిటీకి పదునుపెట్టి.. మాదకద్రవ్యాలను, గంజాయిని రాష్ట్ర సరిహద్దులు దాటిస్తున్నారు. ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా.. మాకేం పట్టింపు అంటూ వ్యవహరిస్తున్నారు ఈ అక్రమార్కులు. తాజాగా ఇలాంటి తరహ ఘటన ఒకటి తెలంగాణలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. న్యూఇయర్ వేడుకల్లో డ్రగ్స్, గంజాయిపై సరఫరాను అరికట్టేందుకు రాష్ట్ర పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడిక్కడ చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి.. డ్రగ్స్, గంజాయి ముఠాలకు చెక్‌పెట్టేలా నార్కోటిక్, ఎక్సైజ్, SOT పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలోనే జోగుళాంబ గద్వాల్ జిల్లాలోని పుల్లూరు టోల్ ప్లాజా వద్ద పోలీసుల తనిఖీల్లో 18.5 గ్రాముల గంజాయి లభ్యమైంది. బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు వస్తున్న ఏడుగురు యువకుల వద్ద ఉన్న ఈ గంజాయిని సీజ్ చేసిన పోలీసులు.. వారిని అదుపులోకి తీసుకున్నారు. సదరు యువకుల రక్తనమూనాలను సేకరించి టెస్టులకు పంపించారు పోలీసులు. కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి