AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: ఇంతమంది తాగుబోతులు దొరికారా.? డ్రంకన్ డ్రైవ్‌లో ఎన్ని కేసులు నమోదయ్యాయంటే

చార్‌సౌ షహర్‌. మన భాగ్యనగరానికున్న పేరు. కానీ ఒక్క రాత్రిలో డ్రంకెన్‌ డ్రైవ్‌ల కేసులు మాత్రం హజార్‌ మార్క్‌ దాటేశాయి. న్యూఇయర్‌కు స్వాగతం పలుకుతూ, హైదరాబాద్‌లో మద్యం ఏరులై పారింది. పెగ్గు పెగ్గుకీ పెరిగిన మత్తు, ఎలా రికార్డ్‌ అయిందో, రికార్డు స్థాయిలో వచ్చిన ఈ డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసులే చెబుతున్నాయి.

Hyderabad: ఇంతమంది తాగుబోతులు దొరికారా.? డ్రంకన్ డ్రైవ్‌లో ఎన్ని కేసులు నమోదయ్యాయంటే
Drunk And Drive
Ravi Kiran
|

Updated on: Jan 01, 2025 | 8:27 AM

Share

ఎన్ని వార్నింగ్‌లు ఇచ్చినా.. తాగుబోతులు తీరు మారడం లేదు. పీకలదాకా తాగుడు.. రోడ్డెక్కి తిరుగుడు.. అసలే 31st.. చాలా స్ట్రిక్ట్‌గా ఉంటామని పోలీస్‌ బాబాయ్‌లు పదేపదే హెచ్చరించినా లైట్ తీసుకున్న బ్యాచ్‌ తీరా కేసు పడేసరికి కిక్కు దిగి బోరుమంటున్నారు..! మన ఏరియాలో డ్రంకెన్‌ డ్రైవ్‌ ఉండదనో.. పోలీసోళ్లుంటే ఏదో సందులోంచి ఎస్కేప్‌ అవ్వొచ్చనో బ్లైండ్‌గా ఫిక్సైపోయి.. బండెక్కి హల్‌ చేసినోళ్లు ఇప్పుడు అడ్డంగా బుక్కయ్యారు. ఒకరా ఇద్దరా అర్థరాత్రి దాదాపు 11వందల 84 మందిపై కేసులు పడ్డాయ్‌.

వివరాల్లోకి వెళ్తే.. న్యూఇయర్‌ సందర్భంగా పోలీసులు విధించిన ఆంక్షల్ని మందుబాబులు లెక్కచేయలేదు. హైదరాబాద్‌లో ఎప్పటిలాగానే రెచ్చిపోయారు డ్రంకెన్‌ డ్రైవర్స్‌. రాత్రి పోలీసుల నిర్వహించిన తనిఖీల్లో ఏకంగా 1184 డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. ఇక జోన్‌ల వారిగా చూస్తే.. ఈస్ట్‌ జోన్‌లో అత్యధికంగా 236 కేసులు నమోదయ్యాయి. సౌత్‌ ఈస్ట్ జోన్‌లో 192, వెస్ట్ జోన్‌లో 179 కేసులు.. సౌత్‌ వెస్ట్ జోన్‌లో 179, నార్త్‌ జోన్‌లో 177, సెంట్రల్‌ జోన్‌లో 102 కేసులు నమోదు కావడం జరిగింది.

పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలలో ఓ వ్యక్తికి నిర్వహించిన టెస్ట్‌లో రీడింగ్ 550 పాయింట్స్ చూపించింది. అంటే అతను ఏ స్థాయిలో తాగాడో మనకు అర్థం అవుతుంది. నాంపల్లిలో కొందరు ఆటోవాలాలు హంగామా సృష్టించారు. ఫుల్‌గా తాగి రోడ్లపై హల్‌చల్ చేశారు. రోడ్డుపై వెళ్తున్న వారిని భయబ్రాంతులకు గురిచేశారు. బహదూర్‌పురాలో ఓ మందుబాబు వీరంగం సృష్టించాడు. తన బైక్‌ ఇవ్వాలంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. అటు మీర్‌చౌక్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్‌ తనిఖీలు నిర్వహించిన పోలీసులు.. మందు తాగి దొరికిన వారి వాహనాలు సీజ్ చేశారు. కొందరు మద్యం మత్తులో పోలీసులపై తిరగబడ్డారు. హయత్‌నగర్‌లో జరిగిన న్యూఇయర్‌ వేడుకల్లో రెండు వర్గాలుగా విడిపోయి తన్నుకున్నారు యువకులు. మరోవైపు నగరవ్యాప్తంగా అన్ని చోట్ల తనిఖీలు నిర్వహించారు పోలీసులు. మద్యం సేవించి రోడ్డెక్కిన మందుబాబులు.. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు పరుగులు తీశారు. డ్రంకెన్ డ్రైవ్ టెస్ట్‌కు నిరాకరించిన ఓ మందుబాబు పరుగుల తీశాడు. అతన్ని వెంటపడి పట్టుకున్నారు పోలీసులు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి