Hyderabad Rains: హైదరాబాద్‌లో ఒక్కసారిగా మారిన వాతావరణం.. పలు చోట్ల భారీ వర్షం..
హైదరాబాద్‌లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉదయం నుంచి మాడు పగిలే ఎండ వచ్చింది. ఈ క్రమంలో మధ్యాహ్నం నుంచి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో వర్షం కురిసింది.చందానగర్, మియాపూర్, కూకట్‌పల్లి, పటాన్‌చెరు..
హైదరాబాద్‌లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉదయం నుంచి మాడు పగిలే ఎండ వచ్చింది. ఈ క్రమంలో మధ్యాహ్నం నుంచి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో వర్షం కురిసింది.చందానగర్, మియాపూర్, కూకట్‌పల్లి, పటాన్‌చెరు.. నానక్‌రామ్‌గూడ, శేరిలింగంపల్లి పరిసర ప్రాంతాల్లో ఈదురుగాలులు, ఉరుములతో కూడిన భారీ వాన పడింది. కుండపోతగా కురుస్తున్న వర్షంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వర్షం నీటిలో రోడ్లన్నీ జలమయమయ్యాయి.. పలు చోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఒక్కసారిగా వర్షం కురవడంతో పాదచారులు, వాహనదారులు మెట్రో పిల్లర్ల కిందకు చేరారు. అయితే, ఈ రోజు పలు ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో మరో తుఫాన్ ముంచుకురాబోతోంది. ఈ అల్పపీడనం క్రమేణ బలపడి తుఫాన్‌గా మారనుంది. దీంతో 90 కి.మీ. వేగంతో కన్యాకుమారి, బంగాళాఖాతం ఆగ్నేయ మధ్య ప్రాంతాల్లో గాలులు వీస్తాయన్నారు..తుఫాన్ హెచ్చరకలతో రైతుల్లో ఆందోళన మొదలైంది..ఇప్పటికే అకాల వర్షాలు అంతుపట్టని వాతావరణంతో అన్నదాతలు తీవ్రంగా నష్టపోయారు.
ఆరుగాలం శ్రమించి పండించిన పంట కళ్ల ముందే వర్షార్పణం అయిపోతుంటే అన్నదాతలు కంట నీరు ఆగడం లేదు..ఇప్పటికే కుదలేన తెలుగు రాష్ట్రాల రైతులకు ఐఎండిఏ మరో తుఫాన్ హెచ్చరికలు చేయడం గుండెల్లో గుబులు మొదలైంది.