Vande Bharat Express: సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్.. తెలుగు రాష్ట్రాల ప్రయాణీకులకు గుడ్‌న్యూస్..
సికింద్రాబాద్-తిరుపతి మధ్య వందేభారత్ ఎక్స్‌ప్రెస్ పరుగులు పెడుతోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ రైలులో 8 కోచ్‌లు ఉండగా.. ఆ సంఖ్య 16కు పెరుగుతోంది.
సికింద్రాబాద్-తిరుపతి మధ్య వందేభారత్ ఎక్స్‌ప్రెస్ పరుగులు పెడుతోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ రైలులో 8 కోచ్‌లు ఉండగా.. ఆ సంఖ్య 16కు పెరుగుతోంది. ఈ వందేభారత్ రైలుకు ప్రయాణీకుల నుంచి మంచి స్పందన రావడంతో.. ప్రస్తుతం ఉన్న కోచ్‌ల సంఖ్యకు అదనంగా మరిన్ని కోచ్‌లు చేర్చాలని పలు డిమాండ్స్ వస్తుండటంతో.. తాజాగా దీనిపై రైల్వే శాఖ కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు ఇదే విషయాన్ని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి ప్రస్తావిస్తూ ఓ ట్వీట్ చేశారు. కోచ్‌ల సంఖ్య పెంచేందుకు అనుమతిచ్చినందుకు గానూ ప్రధాని మోదీ, కేంద్ర రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు ధన్యవాదాలు తెలిపారు.
ఇదిలా ఉంటే.. ప్రస్తుతం సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ ఎక్స్‌ప్రెస్ 8 బోగీలతో నడుస్తోంది. ఎగ్జిక్యూటివ్ చైర్‌కారులో 52 సీట్లు, చైర్ కారులో 478 సీట్లు వెరిసి మొత్తంగా 530 సీట్లు ఉన్నాయి. ఏప్రిల్‌లో ఈ ట్రైన్ ఆక్యుపెన్సీ 131 శాతంగా నమోదు కాగా.. మేలో ఈ 10 రోజుల్లో అది కాస్తా 134 శాతంగా నమోదైంది. ఇక తిరుపతి నుంచి వచ్చే వందేభారత్ రైలుకు అయితే ఏప్రిల్‌లో 136 శాతం, మేలో 137 శాతం అక్యుపెన్సీ నమోదైంది. కాగా, కోచ్‌ల సంఖ్యను 16గా చేస్తుండటంతో సీట్ల సంఖ్య 530 నుంచి 1036కి పెరగనుంది.
యాత్రికులు&ప్రయాణికుల నుండి పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా సికింద్రాబాద్ – తిరుపతి మధ్యన తిరుగుతున్న వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలును ప్రస్తుతం ఉన్న 8 కోచ్ ల నుండి 16 కోచ్ లకు పెంచటానికి అంగీకరించిన PM శ్రీ @narendramodi గారికి, రైల్వేశాఖ మంత్రి శ్రీ @AshwiniVaishnaw గారికి కృతజ్ఞతలు. pic.twitter.com/FhKD07K5MX
— G Kishan Reddy (@kishanreddybjp) May 9, 2023