Telangana: కసాయి తండ్రి ఘాతుకం.. కన్న కూతురిపై గొడ్డలితో దాడి.. పోలీసులను అడ్డుకున్న గ్రామస్థులు!

పెద్దపల్లి జిల్లా మంథని మండలం బట్టుపల్లిలో దారుణం చోటుచేసుకుంది. కన్న కూతురిని ఓ కసాయి తండ్రి కిరాతకంగా గొడ్డలితో నరికి హతమార్చాడు. అనంతరం మరో వ్యక్తిపై దాడి చేశాడు. గ్రామంలో గొడ్డలిపట్టుకుని తిరుగుతున్న హంతకుడిని చూసి..

Telangana: కసాయి తండ్రి ఘాతుకం.. కన్న కూతురిపై గొడ్డలితో దాడి.. పోలీసులను అడ్డుకున్న గ్రామస్థులు!
Telangana Crime
Follow us
Srilakshmi C

|

Updated on: May 11, 2023 | 3:43 PM

పెద్దపల్లి జిల్లా మంథని మండలం బట్టుపల్లిలో దారుణం చోటుచేసుకుంది. కన్న కూతురిని ఓ కసాయి తండ్రి కిరాతకంగా గొడ్డలితో నరికి హతమార్చాడు. అనంతరం మరో వ్యక్తిపై దాడి చేశాడు. గ్రామంలో గొడ్డలిపట్టుకుని తిరుగుతున్న హంతకుడిని చూసి స్థానికులు భయంతో పరుగులు తీశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంథని మండలంలోని బట్టుపల్లి గ్రామంలో నివసముంటున్న గుండ్ల సదానందం అనే వ్యక్తి 11 ఏళ్ల కూతరు రజితను కిరాతకంగా గొడ్డలితో నరికి హత్య చేశాడు. ఆ తర్వాత అదే గొడ్డలితో మరో దుకాణదారుడిపై దాడికి తెగబడ్డాడు. సమాచారం అందుకున్న మంథని పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు.

కాగా నిందితుడు సదానందం గతంలో భార్యను ఉరి వేసి చంపిన కేసులో జైలుకు వెళ్లివచ్చాడు. ఇప్పుడు కూతుర్ని కూడా చంపాడు. దీంతో ఆగ్రహానికి గురైన గ్రామస్థులు సదానందను పోలీసు వాహనంలో తీసుకు వెళుతుండగా అడ్డుకున్నారు. సదానందను తామే శిక్షిస్తామంటూ స్థానికులు పోలీసుల వాహనాన్ని ముళ్ల తీగతో అడ్డుకున్నారు. దీంతో గ్రామస్థుల నుంచి ఆగ్రహావేశాలు వ్యక్తవమయ్యాయి. నిందుతడ్ని తమకు అప్పగించాలని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. గ్రామస్థులకు చెదరగొట్టేందుకు పోలీసులు ప్రయత్నించగా అక్కడి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కాగా నిందితుడు సదానంద కూతుర్ని ఎందుకు చంపాడోనన్న విషయం తెలియాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

ఫీలింగ్స్ సాంగ్ చేయడానికి చాలా భయపడ్డా.. రష్మిక
ఫీలింగ్స్ సాంగ్ చేయడానికి చాలా భయపడ్డా.. రష్మిక
పంట పొలాల్లో కదులుతూ కనిపించిన భారీ ఆకారం.. ఏంటాని చూడగా..!
పంట పొలాల్లో కదులుతూ కనిపించిన భారీ ఆకారం.. ఏంటాని చూడగా..!
ఇంగ్లాండ్‌కు షాక్: గాయం కారణంగా ఛాంపియన్స్ ట్రోఫీకి ఆ స్టార్ దూరం
ఇంగ్లాండ్‌కు షాక్: గాయం కారణంగా ఛాంపియన్స్ ట్రోఫీకి ఆ స్టార్ దూరం
దటీజ్ ఉమెన్ పవర్.. 211 పరుగుల తేడాతో ఘన విజయం
దటీజ్ ఉమెన్ పవర్.. 211 పరుగుల తేడాతో ఘన విజయం
మొదటి మహిళా క్రికెటర్‌గా చరిత్ర సృష్టించిన లేడి గంగూలీ..!
మొదటి మహిళా క్రికెటర్‌గా చరిత్ర సృష్టించిన లేడి గంగూలీ..!
ఏపీలో మాత్రమే మిడ్ నైట్ షోలు వేస్తే మరో తలనొప్పి
ఏపీలో మాత్రమే మిడ్ నైట్ షోలు వేస్తే మరో తలనొప్పి
శివయ్య పూజలో పొరపాటున ఈ పనులు చేయవద్దు.. శని దోషం ఏర్పడుతుంది
శివయ్య పూజలో పొరపాటున ఈ పనులు చేయవద్దు.. శని దోషం ఏర్పడుతుంది
భారత్ చేతిలో ఓటమి తర్వాత ఏడ్చిన పాకిస్తాన్ ఆటగాళ్లు..వీడియో వైరల్
భారత్ చేతిలో ఓటమి తర్వాత ఏడ్చిన పాకిస్తాన్ ఆటగాళ్లు..వీడియో వైరల్
పశ్చిమ గాలుల ప్రభావంతో.. దిశను మార్చుకుంటోన్న తీవ్ర అల్పపీడనం
పశ్చిమ గాలుల ప్రభావంతో.. దిశను మార్చుకుంటోన్న తీవ్ర అల్పపీడనం
పెళ్లి చేస్తామని ఇంటికి పిలిచి.. నమ్మకంగా హతమార్చారు!
పెళ్లి చేస్తామని ఇంటికి పిలిచి.. నమ్మకంగా హతమార్చారు!