AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aarogya Sri: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆరోగ్యశ్రీలోకి కరోనా చికిత్స.!

Aarogya Sri- Covid 19 Treatment: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనాతో వచ్చే వివిధ రకాల వ్యాధులను ఆరోగ్యశ్రీ పధకంలోకి చేర్చింది..

Aarogya Sri: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆరోగ్యశ్రీలోకి కరోనా చికిత్స.!
Telangana
Ravi Kiran
| Edited By: Anil kumar poka|

Updated on: Aug 30, 2021 | 8:57 PM

Share

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీ పధకంలోకి చేర్చింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ అంతర్గత ఉత్తర్వులు జారీ చేసింది. తొలిదశలో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రులకే ఈ పధకాన్ని పరిమితం చేసింది. ఆ తర్వాత దశలవారీగా ప్రైవేటు ఆసుపత్రుల్లో కూడా చికిత్స అందించనున్నారు.

కరోనాకు అందించే చికిత్సలను మొత్తం 17 రకాలుగా ప్రభుత్వం విభజించింది. ఇదిలా ఉంటే కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్(ఏబీ) పదకంలోకి కరోనా చికిత్సను అందుబాటులోకి తీసుకురాగా.. తాజాగా తెలంగాణ ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ పధకాన్ని అమలు చేస్తోంది. దీనితో ఆరోగ్యశ్రీలోకి కరోనా చేర్చినట్లు వైద్యశాఖ వర్గాలు వెల్లడించాయి. దీనితో ఇకపై కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్‌తో కలిపి ఆరోగ్యశ్రీ పధకం అమలవుతుంది.

ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రులకే ఈ పధకం పరిమితం చేయడంతో అర్హులైన కరోనా రోగులకు అయ్యే ఖర్చులను ప్రభుత్వం నేరుగా ఆయా సర్కార్ ఆసుపత్రులకు అందజేయనుంది. మరోవైపు ఆరోగ్య శ్రీ పధకం కింద రూ. 2 లక్షల వరకు కవరేజీ.. ఆయుష్మాన్ భారత్ కింద రూ. 5 లక్షల వరకు కవరేజీ ఉన్న సంగతి తెలిసిందే. వైరస్‌లతో వచ్చే అన్ని రకాల జ్వరాలకు.. అలాగే స్వైన్‌ఫ్లూ వైద్యాన్ని కూడా ఆరోగ్యశ్రీలోకి చేరుస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

కరోనాతో వచ్చే వివిధ రకాల వ్యాధులకు ప్యాకేజీల వారీ చికిత్సను అందించాలని తెలంగాణ సర్కార్ నిర్ణయం తీసుకుంది. జనరల్‌ మెడిసిన్, పీడియాట్రిక్స్, పల్మనాలజీ, క్రిటికల్‌ కేర్‌ కేటగిరీల్లో ప్యాకేజీల కింద వైద్య సేవలు అందుతాయి. కాగా, ఆరోగ్యశ్రీ పధకం కింద ఇప్పటివరకు 949 వ్యాధులకు చికిత్స అందుతుండగా.. తాజాగా ఆ జాబితాలోకి కరోనా సంబంధిత వ్యాధులు, స్వైన్ ఫ్లూను ప్రభుత్వం చేర్చింది. ఆరోగ్యశ్రీ పధకం కింద కరోనా చికిత్స పెద్దలతో పాటు పిల్లలకు కూడా అందనుంది.

Read Also: కివి పండ్లను వీరు అస్సలు తినకూడదు.. తింటే ఎలా పరిస్థితులు ఎదురవుతాయంటే..

RGV: 40 ఏళ్ల క్రితం ఇలాంటి అమ్మాయి కనిపించి ఉంటే.. నేను ఇప్పుడు ఇలా ఉండేవాడిని కాదు. ఆర్‌జీవీ వ్యాఖ్యలు.

ఈ ఫోటోలో సింహం ఎక్కడుందో కనిపెట్టండి.! కళ్లకు పని చెప్పండి.. గుర్తించండి!

500 స్ట్రైక్‌రేట్‌తో బ్యాటింగ్.. 20 ఓవర్ల మ్యాచ్.. కేవలం 39 బంతుల్లోనే ఫలితం.. తుఫాన్ సృష్టించిన ఓపెనర్ ఎవరంటే?

నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేయండి!
ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేయండి!
అందంలో తల్లిని మించిపోయిందిగా..
అందంలో తల్లిని మించిపోయిందిగా..
బీచ్‌లో పరువాల విందు.. బాలయ్య నటి అదిరిపోయే ఫొటోస్
బీచ్‌లో పరువాల విందు.. బాలయ్య నటి అదిరిపోయే ఫొటోస్
శిక్షణ ఇచ్చిన గురువుకే పంగనామం పెట్టాలనుకున్నాడు.. చివరకు..
శిక్షణ ఇచ్చిన గురువుకే పంగనామం పెట్టాలనుకున్నాడు.. చివరకు..