Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

500 స్ట్రైక్‌రేట్‌తో బ్యాటింగ్.. 20 ఓవర్ల మ్యాచ్.. కేవలం 39 బంతుల్లోనే ఫలితం.. తుఫాన్ సృష్టించిన ఓపెనర్ ఎవరంటే?

CPL 2021: పేట్రియాట్స్ మ్యాచ్‌లో ఓపెనర్ 29 ఏళ్ల లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మన్ ఎవిన్ లూయిస్ కేవలం 39 బంతుల్లో 74 నిమిషాల్లో ఆటను ముగించాడు.

500 స్ట్రైక్‌రేట్‌తో బ్యాటింగ్.. 20 ఓవర్ల మ్యాచ్.. కేవలం 39 బంతుల్లోనే ఫలితం.. తుఫాన్ సృష్టించిన ఓపెనర్ ఎవరంటే?
Cpl
Follow us
Venkata Chari

|

Updated on: Aug 29, 2021 | 7:57 PM

CPL 2021: బ్యాట్‌తో విధ్వసం సృష్టించే బలమైన ఆటగాళ్లు ఉన్న జట్టును ఎవరూ ఓడించలేరు. తమదైన రోజున మైదానంలో అలజడి నెలకొల్పి, ప్రతర్థులను చీల్చి చెండాతుంటారు. మంచి బౌలర్లకు కూడా చుక్కలు చూపిస్తుంటారు. కరేబియన్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్‌లో ఇలాంటి సందర్భమొకటి జరిగింది. గయానా అమెజాన్ వారియర్స్ వర్సెస్ నెవిస్ పేట్రియాట్స్ మధ్య మ్యాచ్‌లో ఇలా జరిగింది. ఇరు జట్లు తమ తొలి మ్యాచ్‌లో విజయం సాధించాయి. అటువంటి పరిస్థితిలో, మొదటి ఓటమిని చూడాలని ఎవరూ కోరుకోలేదు. కానీ, ఈ క్రికెట్ మ్యాచ్‌లో గయానా వారియర్స్ జట్టు పేట్రియాట్స్ చేతిలో ఓడిపోయింది. పేట్రియాట్స్ మ్యాచ్‌లో ఓపెనర్ 29 ఏళ్ల లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మన్ ఎవిన్ లూయిస్ కేవలం 39 బంతుల్లో 74 నిమిషాల్లో ఆటను ముగించాడు.

తొలి మ్యాచ్‌లో గయానా వారియర్స్ జట్టు బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. గయానా ఇన్నింగ్స్ అంత గొప్పగా ఏం సాగలేదు. ఆ జట్టు క్రమంగా వికెట్లు కోల్పోతూ కనీసం 150 పరుగుల మార్కును దాటలేదు. మరోవైపు, పేట్రియాట్స్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి, 146 పరుగులకే తోక ముడిచేలా చేశారు. డొమినిక్ డ్రేక్స్ అత్యధికంగా 3 వికెట్లు తీసుకోగా, పాకిస్తానీ ఫవాద్ అహ్మద్ 2 వికెట్లు పడగొట్టాడు.

లూయిస్ 39 బంతుల్లో.. పేట్రియాట్స్ జట్టు 147 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగింది. వారు 20 ఓవర్లలో టార్గెట్‌ను పూర్తి చేయాల్సి ఉంది. ఈ లక్ష్యాన్ని ఛేజ్ చేస్తూ వికెట్ కోల్పోకుండా 113 పరుగులు సాధించింది. ఓపెనర్లు ఎవిన్ లూయిస్, డెవోన్ థామస్ పేట్రియాట్స్‌కు ఘనమైన ఆరంభాన్ని అందించారు. థామస్ 54 బంతుల్లో 55 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అదే సమయంలో, లూయిస్ కేవలం 39 బంతుల్లో 62 పరుగులు చేశాడు. ఎవిన్ లూయిస్ తన ఇన్నింగ్స్‌లో 4 ఫోర్లు, 5 సిక్సర్లు కొట్టాడు. అంటే అతను కేవలం 9 బంతుల్లోనే 500 స్ట్రైక్ రేట్ వద్ద 46 పరుగులు చేశాడు. ఫలితంగా పేట్రియాట్స్ వరుసగా రెండో మ్యాచ్ గెలిచి టోర్నమెంట్‌లో తిరుగులేని ఆధిక్యాన్ని కొనసాగించింది. వారు గయానా వారియర్స్‌ని 8 వికెట్ల తేడాతో ఓడించి, సీపీఎల్ 2021 పాయింట్ల జాబితాలో 2 మ్యాచ్‌లలో 2 విజయాలతో అగ్రస్థానాన్ని చేరుకున్నారు.

Also Read: INDW vs AUSW: కోవిడ్ -19 కారణంగా షెడ్యూల్‌లో మార్పు.. మొదటి మ్యాచ్ ఎప్పుడంటే..?

Viral Video: పతకం గెలిచిన ఆనందంలో డాన్స్ చేసిన భారత అథ్లెట్.. ఆమె స్టెప్పులకు ఫిదా అవుతోన్న నెటిజన్లు..!

Sachin: ఆటలను అలవాటుగా మార్చుకోండి.. నేషనల్‌ స్పోర్ట్స్‌ డే రోజున సచిన్‌ ఆసక్తికర ట్వీట్‌..

పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..