Sachin: ఆటలను అలవాటుగా మార్చుకోండి.. నేషనల్ స్పోర్ట్స్ డే రోజున సచిన్ ఆసక్తికర ట్వీట్..
National Sports Day: క్రీడలు మనిషికి మానసిక ఆరోగ్యంతో పాటు శారీరక ఆరోగ్యాన్ని కూడా అందిస్తుందనడంలో ఎలాంటి అతిశయోక్తిలేదు. అందుకే స్కూల్ స్థాయి...
National Sports Day: క్రీడలు మనిషికి మానసిక ఆరోగ్యంతో పాటు శారీరక ఆరోగ్యాన్ని కూడా అందిస్తుందనడంలో ఎలాంటి అతిశయోక్తిలేదు. అందుకే స్కూల్ స్థాయి నుంచి పిల్లలకు ఆటలను ఓ భాగం చేస్తుంటారు. అంతేకాకుండా క్రీడలకు ఉన్న ప్రాముఖ్యతను చాటి చెబుతూ ప్రభుత్వాలు సైతం పలు కార్యక్రమాలను నిర్వహిస్తుంటుంది. ఇందులో భాగంగానే కేంద్రం ప్రతీ ఏటా ఆగస్టు 29ని జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుతుంది. హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్ చంద్ జయంతిని పురస్కరించుకొని ఈ రోజును నేషనల్ స్పోర్ట్స్ డేగా నిర్వహిస్తుంటారు. ఇందులో భాగంగానే ఆదివారం కూడా దేశ వ్యాప్తంగా స్పోర్ట్స్ డే సెలబ్రేషన్స్ జరిగాయి. పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా స్పోర్ట్స్ డే శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇందులో భాగంగానే క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ కూడా యువతకు సందేశం ఇచ్చాడు.
మీతో పాటు పక్కవారిని కూడా…
నేషనల్ స్పోర్ట్స్ డేను పురస్కరించుకొని ట్విట్టర్ వేదికగా స్పందించిన లిటిల్ మాస్టర్.. ‘ఎలాంటి కష్ట సమయాల్లోనైనా క్రీడలు నమ్మకాన్ని, సంతోషాన్ని ఇస్తాయి. ఈ రోజు జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఆటలను ప్రతీ ఒక్కరూ అలవాటుగా మార్చుకోండి. మీతో పాటు మీ పక్కన ఉన్న వారిని కూడా సంతోషంగా ఉంచండి’ అంటూ క్యాప్షన్ జోడించాడు. దీంతో పాటు టెండూల్కర్ పలు సందర్భాల్లో చిన్న పిల్లలతో క్రికెట్ ఆడిన వీడియోను షేర్ చేశాడు.
సచిన్ ట్వీట్..
Sport brings hope and joy even in the most challenging circumstances. This #NationalSportsDay, make playing a habit. Keep ourselves and those around us happy. pic.twitter.com/LUMF2N4wUx
— Sachin Tendulkar (@sachin_rt) August 29, 2021
Also Read: Paralympic: పారాలింపిక్స్‌లో భారత్ ఖాతాలో మరో పతకం.. రజతం సొంతం చేసుకున్న నిషాద్ కుమార్.
Nominee: బ్యాంకు ఖాతా.. వివిధ పథకాల్లో నామినీ పేరు ఎందుకు చేర్చాలి..? నమోదు చేయకపోతే ఏమవుతుంది..?