Paralympic: పారాలింపిక్స్‌లో భారత్ ఖాతాలో మరో పతకం.. రజతం సొంతం చేసుకున్న నిషాద్ కుమార్.
Paralympic: టోక్యో వేదికగా జరుగుతోన్న పారాలింపిక్స్‌లో భారత్ ఖాతాలో మరో పతకం వచ్చే చేరింది. పురుషుల హైజంప్ పోటీలో భారత అథ్లెట్ నిషాద్ కుమార్...
Paralympic: టోక్యో వేదికగా జరుగుతోన్న పారాలింపిక్స్‌లో భారత్ ఖాతాలో మరో పతకం వచ్చే చేరింది. పురుషుల హైజంప్ పోటీలో భారత అథ్లెట్ నిషాద్ కుమార్ రజత పతకం సాధించాడు. ఈ పోటీలో నిషాద్ రెండో స్థానంలో నిలిచాడు. 2.06 మీటర్ల ఎత్తు జంప్ చేసిన నిషాద్ పతకం సొంతం చేసుకున్నాడు.
భారత్‌కు ఆదివారం ఇది రెండో పతకం కావడం విశేషం. నిషాద్ కంటే ముందు మహిళల టేబుల్ టెన్నిస్ విభాగంలో భారత్ తరఫున పాల్గొన్న భవీనా పటేల్ రజత పతకాన్ని సొంతం చేసుకున్నారు. దీంతో పారాలింపిక్స్‌లో ఒకేరోజు రెండు పతకాలు భారత్ ఖాతాలో చేరాయి.
A JUMP TO #SILVER! ?
Asian record holder Nishad Kumar jumps 2.06m in Men’s High Jump T47 Final to earn #IND‘s second medal of the day – setting another new Asian record along the way! ?#Tokyo2020 #Paralympics #ParaAthletics @nishad_hj pic.twitter.com/t3M5VZdL68
— #Tokyo2020 for India (@Tokyo2020hi) August 29, 2021
అభినందనలు తెలిపిన మోదీ..
పారాలింపిక్స్‌లో రజత పతకాన్ని సొంతం చేసుకున్న అథ్లెట్ నిషాద్ కుమార్‌పై ప్రధాని నరేంద్రమోదీ ప్రశంసల జల్లు కురిపించారు. ఈ సందర్భంగా మోదీ ట్వీట్ చేస్తూ.. ‘టోక్యో నుంచి ఎంతో సంతోషకరంగా వార్త వచ్చింది. మెన్స్ హై జంప్ టీ47 విభాగంలో నిషాద్ కుమార్ రజతం సొంతం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. నిషాద్ అద్భుత నైపుణ్యం ఉన్న మంచి అథ్లెట్’ అంటూ పేర్కొన్నారు.
More joyful news comes from Tokyo! Absolutely delighted that Nishad Kumar wins the Silver medal in Men’s High Jump T47. He is a remarkable athlete with outstanding skills and tenacity. Congratulations to him. #Paralympics
— Narendra Modi (@narendramodi) August 29, 2021