AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

INDW vs AUSW: కోవిడ్ -19 కారణంగా షెడ్యూల్‌లో మార్పు.. మొదటి మ్యాచ్ ఎప్పుడంటే..?

India Women Tour Of Australia: వచ్చే నెల నుంచి భారత మహిళల క్రికెట్ జట్టు ఆస్ట్రేలియా పర్యటన ప్రారంభం కానుంది. అయితే పర్యటన ప్రారంభానికి ముందు..

INDW vs AUSW: కోవిడ్ -19 కారణంగా షెడ్యూల్‌లో మార్పు.. మొదటి మ్యాచ్ ఎప్పుడంటే..?
Indw Vs Ausw
Venkata Chari
|

Updated on: Aug 29, 2021 | 7:50 PM

Share

India Women Tour Of Australia: వచ్చే నెల నుంచి భారత మహిళల క్రికెట్ జట్టు ఆస్ట్రేలియా పర్యటన ప్రారంభం కానుంది. అయితే పర్యటన ప్రారంభానికి ముందు, సిరీస్ షెడ్యూల్‌లో కొన్ని ముఖ్యమైన మార్పులు చేశారు. వాస్తవానికి, అంతకుముందు భారత మహిళల క్రికెట్ జట్టు ఆస్ట్రేలియా పర్యటనలో తన మొదటి మ్యాచ్‌ను సెప్టెంబర్ 19న ఆడాల్సి ఉంది. కానీ, ప్రస్తుతం అది రెండు రోజుల ఆలస్యంతో 21 సెప్టెంబర్ నుంచి జరగనుంది. అలాగే, సిరీస్‌లోని అన్ని మ్యాచ్‌లు క్వీన్స్‌లాండ్‌లోనే జరగనున్నాయి.

ఆడాల్సిన మ్యాచ్‌లు.. ఈ పర్యటన వన్డే సిరీస్‌తో ప్రారంభం కావాల్సి ఉంది. సిరీస్‌లో మొదటి మ్యాచ్ నార్త్ సిడ్నీలో జరగాల్సి ఉంది. కానీ, ప్రస్తుతం మాకేలో ఆడతారు. అదే సమయంలో, రెండవ, మూడవ వన్డే కూడా మెల్‌బోర్న్‌కు బదులుగా నార్త్ సిడ్నీలో జరుగనుంది. రెండు జట్ల మధ్య ఒకే పింక్ బాల్ టెస్ట్ సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 3 వరకు జరగాల్సి ఉంది. ఈ మ్యాచ్ తేదీలో ఎలాంటి మార్పు లేదు. కానీ, ప్రస్తుతం పెర్త్‌లోని డబ్ల్యూఏసీఏ క్రికెట్ గ్రౌండ్‌కు బదులుగా కర్రాలోని మెట్రికాన్ స్టేడియంలో మ్యాచ్ జరగనుంది. మూడు టీ 20 మ్యాచ్‌లు కూడా ఒకే మైదానంలో జరగనున్నాయి.

కోవిడ్ -19 కారణంగా మార్పులు.. ఆస్ట్రేలియాలో కోవిడ్ -19 ఆంక్షల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే, దీనికి సంబంధించి క్రికెట్ ఆస్ట్రేలియా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

14 రోజుల పాటు నిర్బంధం.. భారత జట్టు ఆగస్టు 29న ఆస్ట్రేలియాకు వెళ్లి దుబాయ్ మీదుగా బ్రిస్బేన్ చేరుకుంటుంది. ఆ తర్వాత జట్టు 14 రోజుల పాటు క్వారంటైన్ నియమాలను పాటించాల్సి ఉంటుంది. జట్టు నిర్బంధం సెప్టెంబర్ 13తో ముగుస్తుంది. సెప్టెంబర్ 18న టీమ్ బ్రిస్బేన్ మైదానానికి చేరుకుని ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది.

నివేదికల ప్రకారం, క్వీన్స్‌ల్యాండ్ ప్రభుత్వం నుంచి అనుమతి తుది అనుమతి ఇంకా పొందాల్సి ఉంది. క్వీన్స్‌లాండ్‌కు చెందిన ఆస్ట్రేలియా ఆటగాళ్లు వచ్చే వారం నాటికి వచ్చే అవకాశం ఉంది. అదే సమయంలో, మెల్‌బోర్న్, సిడ్నీ నుంచి వచ్చే క్రీడాకారులు, సహాయక సిబ్బంది క్వారంటైన్‌లో ఉండాల్సి ఉంది.

Also Read: Viral Video: పతకం గెలిచిన ఆనందంలో డాన్స్ చేసిన భారత అథ్లెట్.. ఆమె స్టెప్పులకు ఫిదా అవుతోన్న నెటిజన్లు..!

Sachin: ఆటలను అలవాటుగా మార్చుకోండి.. నేషనల్‌ స్పోర్ట్స్‌ డే రోజున సచిన్‌ ఆసక్తికర ట్వీట్‌..

Paralympic: పారాలింపిక్స్‌లో భారత్‌ ఖాతాలో మరో పతకం.. రజతం సొంతం చేసుకున్న నిషాద్‌ కుమార్‌.