Nominee: బ్యాంకు ఖాతా.. వివిధ పథకాల్లో నామినీ పేరు ఎందుకు చేర్చాలి..? నమోదు చేయకపోతే ఏమవుతుంది..?

Nominee: మీరు ఏదైనా బ్యాంకు ఖాతా తీసినా.. వివిధ పథకాల్లో పెట్టుబడులు పెట్టినా.. లేక జీవిత బీమా, ఈపీఎఫ్‌ తదితరాలలో నామినీ పేరు నమోదు చేయడం తప్పనిసరి..

Nominee: బ్యాంకు ఖాతా.. వివిధ పథకాల్లో నామినీ పేరు ఎందుకు చేర్చాలి..? నమోదు చేయకపోతే ఏమవుతుంది..?
Follow us
Subhash Goud

|

Updated on: Aug 29, 2021 | 5:43 PM

Nominee: మీరు ఏదైనా బ్యాంకు ఖాతా తీసినా.. వివిధ పథకాల్లో పెట్టుబడులు పెట్టినా.. లేక జీవిత బీమా, ఈపీఎఫ్‌ తదితరాలలో నామినీ పేరు నమోదు చేయడం తప్పనిసరి. అయితే.. చాలామంది ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోరు. అన్నీ సవ్యంగా ఉన్నప్పుడు ఏ ఇబ్బందీ రాదు కానీ.. పెట్టుబడిదారుడికి అనుకోనిది ఏదైనా జరిగిన సమయంలో కుటుంబ సభ్యులు ఆ మొత్తాన్ని వెనక్కి తీసుకోవడానికి అనేక ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుంది.

వాస్తవానికి నామినీ.. చట్టబద్ధమైన వారసులు వేర్వేరు. పెట్టుబడులు వారసులందరికీ చేరేందుకు.. నామినీ ఒక వారధి మాత్రమే. అంటే.. పెట్టుబడిదారుడికి ఏదైనా జరిగినప్పుడు అతని తరఫున వారసులకు వాటిని బదిలీ చేసే వ్యక్తి అన్నమాట. అందుకే నామినీగా సొంత వారినే కాదు.. బయట వారినీ నియమించుకునే అవకాశం ఉంది.

యజమాని మరణించిన సందర్భంలో..

పెట్టుబడుల విషయంలో అసలు యజమాని మరణించిన సందర్భంలో.. వాటిని అతని వారసులకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా అందించేందుకు నామినీ తోడ్పడతారు. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, మ్యూచువల్‌ ఫండ్లు, డీమ్యాట్‌ ఖాతా, చిన్న మొత్తాల పొదుపు, బ్యాంకు ఖాతాలు, జీవిత బీమా పాలసీలు.. ఇలా ప్రతి చోటా నామినీ పేరు తప్పనిసరి.

ఒకవేళ ఒక ఖాతాదారుడు నామినీ పేరు రాయలేదనుకుందాం.. ఆ ఖాతాదారుడికి ఏదైనా జరిగినప్పుడు బ్యాంకు సంబంధిత వ్యక్తి వారసుల కోసం చూస్తుంది. వారు వచ్చిన తర్వాత వారసత్వ ధ్రువీకరణను కోరుతుంది. లేదా వీలునామా అవసరమని చెప్పవచ్చు. ఇవన్నీ పూర్తయ్యేనాటికి ఎంతో సమయం పడుతుంది. ఆర్‌బీఐ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. బ్యాంకు ఖాతాల్లో ఎవరూ పట్టించుకోని సొమ్ము దాదాపు రూ.25,000 కోట్ల వరకూ ఉంది. ఈ మొత్తం అంతా నామినీ వివరాలు సరిగా లేకపోవడమే కారణం.

నామినీ పేరును మార్చుకోవచ్చు..

ఒక వ్యక్తి వీలునామా రాసినప్పుడు.. నామినీ.. ఆ మేరకు వారసులకు ఆస్తులను అందించాల్సి ఉంటుంది. అంతేకానీ, నామినీగా పేరు రాసినంత మాత్రాన మొత్తం అతనికి/ఆమెకే చెందదు. నామినీ పేరును ఎప్పుడు కావాలంటే అప్పుడు మార్చుకోవచ్చు.

నామినీలు ఎంత మంది ఉండవచ్చు..

బ్యాంకు ఖాతాలో ఒకరిని నామినీగా పేర్కొనవచ్చు. అలాగే ఉమ్మడి ఖాతా ఉంటే.. ఒకరి కంటే ఎక్కువ నామినీలు ఉండవచ్చు. జీవిత బీమా పాలసీల్లో ఎంతమంది నామినీలనైనా పేర్కొనవచ్చు. పాలసీ విలువలో ఎవరికి ఎంత శాతం చెందాలన్నది వివరించాలి. ఈపీఎఫ్‌లోనూ ఇలాంటి వెసులుబాటు ఉంటుంది. డీమ్యాట్‌ ఖాతాలోనూ ఒకరికంటే ఎక్కువ నామినీలుగా ఉండేందుకు అవకాశం ఉంది.

ఇవీ కూడా చదవండి:

Business Ideas: మీరు టీ షర్ట్ ప్రింటింగ్ బిజినెస్ చేయాలని అనుకుంటున్నారా..? లాభం ఎంతో తెలిస్తే షాకవుతారు..

Maruti Suzuki: మీరు కొత్త కారు కొనాల‌నుకుంటున్నారా..? అయితే రుణం పొంద‌డం చాలా సుల‌భం..!

మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్