AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Business Ideas: మీరు టీ షర్ట్ ప్రింటింగ్ బిజినెస్ చేయాలని అనుకుంటున్నారా..? లాభం ఎంతో తెలిస్తే షాకవుతారు..

Business Ideas: డబ్బులు సంపాదించేందుకు మార్కెట్లో బోలెడన్నీ బిజినెస్‌లు ఉన్నాయి. పెట్టుబడి పెట్టేదాని బట్టి బిజినెస్‌ను ఎంచుకుంటే మంచి లాభాలు పొందవచ్చు...

Business Ideas: మీరు టీ షర్ట్ ప్రింటింగ్ బిజినెస్ చేయాలని అనుకుంటున్నారా..? లాభం ఎంతో తెలిస్తే షాకవుతారు..
Subhash Goud
|

Updated on: Aug 29, 2021 | 5:07 PM

Share

Business Ideas: డబ్బులు సంపాదించేందుకు మార్కెట్లో బోలెడన్నీ బిజినెస్‌లు ఉన్నాయి. పెట్టుబడి పెట్టేదాని బట్టి బిజినెస్‌ను ఎంచుకుంటే మంచి లాభాలు పొందవచ్చు. ఇక ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరూ టీషర్టులు వేసుకోవడం సర్వ సాధారణమైంది. తక్కువ పెట్టుబడితో టీషర్ట్‌లపై ఫ్యాబ్రిక్‌ పెయింటింగ్స్‌ వేయడం ఒక చిన్నపాటి బిజినెస్‌గా మారింది. ముఖ్యంగా సినిమా ప్రమోషన్‌ కోసం, ఆడియో రిలీజ్‌ ఫంక్షన్‌ కోసం, కార్పొరేట్‌ ప్రమోషన్స్ కోసం, స్పోర్ట్స్‌ కోసం, పొలిటికల్‌ ర్యాలీలు, 5కె, 2కె రన్‌, గణేష్ ఉత్సవాల ఊరేగింపులు, ఇలాంటి అన్ని కార్యక్రమాల్లో టీ షర్ట్స్‌ ఆర్డర్లు ఎక్కువగా వస్తున్నాయి. మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉన్నటువంటి టీషర్ట్స్‌పై ఫ్రింట్‌ చేసే మిషన్‌ రూ.12 వేల నుండి రూ.18 వేల లోపు మాత్రమే ఖర్చు అవుతుంది. పెద్ద ఎత్తున టీషర్ట్‌లు ఆర్డర్‌ వస్తే రూ.75 వేల నుండి రూ.లక్ష విలువ కలిగి ఉన్న మిషన్‌ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. కేవలం టీషర్ట్‌లపైనే కాకుండా ప్లేట్లపై, మగ్స్‌, టోపీలపై కూడా ప్రింటింగ్‌ వేయడానికి ఆర్డర్లు తెచ్చుకుంటే మరింత ఆదాయం వస్తుంది. అలాగే సెల్‌ఫోన్‌ కవర్లపై, గిఫ్ట్‌ ఆర్టికల్స్‌పై కూడా ఫ్రింటిగ్స్‌ చేసే అవకాశం ఉంది. మహిళలు ఇంటి వద్ద ఉండి ఉపాధి పొందే మార్గం ఇది.

గూగుల్‌లో సెర్చ్‌..

మార్కెటింగ్‌ కోసం ఆన్‌లైన్‌లో సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్లను ఆశ్రయించవచ్చు. గూగుల్‌ సెర్చ్‌లో ఇండియామార్ట్‌ వెబ్‌సైట్‌లో క్లిక్‌ చేస్తే సెర్చిబార్‌లో టీషర్ట్‌ ఫ్రింటింగ్‌ మిషన్లు అవి ఎక్కడ దొరుకుతాయి వాటి ధర ఎంత తదితర వివరాలు లభిస్తాయి.

లాభం పొందడం ఎలా..?

► ఈ బిజినెస్‌లో ప్రతి నెల రూ.25 వేల నుంచి రూ. లక్ష వరకూ సంపాదించుకోవచ్చు.

► టీ షర్ట్ ప్రింటింగ్ కోసం టెఫ్లాన్ షీట్ ఖరీదు రూ.400, సబ్లిమేషన్ టేప్ ఖరీదు రూ. 200

► ప్రింటింగ్ మెషీన్ ధర్ రూ. 13వేల నుంచి ప్రారంభమవుతుంది.

► సబ్లిమేషన్ ప్రింటింగ్ ఇంక్ ధర రూ. 2000 ఉంటుంది.

► టీషర్ట్స్ ధర రూ. 30 నుంచి రూ.150 మధ్య క్వాలిటీని బట్టి బల్క్‌గా లభిస్తుంటాయి.

► మొత్తం పెట్టుబడి రూ. 50 వేల లోపే ఉంటుంది.

► ప్రింటింగ్ అయిన తర్వాత టీషర్ట్ విలువ. మార్కెట్లో రూ.250 నుంచి రూ.500 వరకూ పలుకుతుంది.

► మార్కెట్ లో టీషర్టు అమ్మకాలను ఆన్‌లైన్‌ ద్వారాను, లేదా ఆఫ్‌లైన్‌ ద్వారా చేసుకోవచ్చు.

► ఒక్కో టీషర్ట్ మీద ప్రింటింగ్ వేసిన తర్వాత పెద్ద ఎత్తున లాభాలు వస్తాయి.

ఉదాహరణకు ఒక ప్లేన్ టీషర్టు విలువ రూ. 100 ఉంటే దాన్ని ప్రింట్ వేసిన తర్వాత మార్కెట్లో రూ.200 వరకు పలుకుతుంది. అంటే డబుల్ లాభం వస్తుంది. ఈ లెక్కన వంద టీషర్టులను విలువ రూ.10 వేలు అయితే వాటిని ప్రింట్ చేసి మార్కెట్లో అమ్మితే రూ.20 వేలు మీకు వస్తాయి. అంటే మీ లాభం సుమారు రూ. 10 వేలు వరకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇతరత్రా ఖర్చులు తీసివేసినా.. కనీసం రూ. 8 వేలు మీకు మిగిలే అవకాశం ఉంది. ఈ లెక్కన నెలకు కనీసం రూ. 50 వేల నుంచి రూ.1 లక్ష దాకా ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. ఒక విషయం ఏంటంటే మీకు మార్కెట్లో మంచి పరిచయాలు ఉండి.. ఆర్డర్లు ఎక్కువగా తెచ్చుకోగలిగితే మంచి ఆదాయం వస్తుంది. ఇక వ్యాపార రంగంలో మంచి టిప్స్‌ ఏంటంటే.. ఈవెంట్ మేనేజ్ మెంట్ ఒప్పందం కుదుర్చొని ముందస్తు బల్క్ ఆర్డర్స్ తెచ్చుకొని ప్రింట్స్ వేసి ఇస్తే మీకు కంటిన్యూగా ఆదాయం వస్తుంది.

ఇవీ కూడా చదవండి:

Digital Rupee: ఆర్థిక రంగంలో స‌రికొత్త మార్పులకు శ్రీ‌కారం.. త్వరలో డిజిటల్ రూపీ: ఆర్బీఐ గవర్నర్ కీలక వ్యాఖ్యలు

Maruti Suzuki: మీరు కొత్త కారు కొనాల‌నుకుంటున్నారా..? అయితే రుణం పొంద‌డం చాలా సుల‌భం..!

Follow Us
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?