AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ashes Series: యాషెస్ సిరీస్‌కు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా..? అసలు ఆగస్టు 29న ఇంగ్లండ్‌లో ఏం జరిగింది..!

England Vs Australia: ఇంగ్లండ్, ఆస్ట్రేలియా టీంల మధ్య ఆడిన టెస్ట్ సిరీస్‌కు యాషెస్ సిరీస్ అని పేరు పెట్టారు. అసలు ఈ పేరు వెనుక కథ గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు.

Ashes Series: యాషెస్ సిరీస్‌కు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా..? అసలు ఆగస్టు 29న ఇంగ్లండ్‌లో ఏం జరిగింది..!
Ashes
Venkata Chari
|

Updated on: Aug 29, 2021 | 9:59 AM

Share

Ashes Series: క్రికెట్ చరిత్రలో భారత్ పాకిస్తాన్ తర్వాత అందరూ ఆసక్తి చూపే సిరీస్ అంటే ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ మధ్య జరిగే యాషెస్ సిరీస్. క్రికెట్ పితామహులుగా పిలువబడే ఈ ఇరుజట్లు ప్రతి ఏడాది సిరీస్లో భాగంగా ఐదు టెస్టులు ఆడతాయి. ప్రతి ఏడాది జరిగే ఈ సిరీస్ తొలిసారి ఎప్పుడు జరిగిందో తెలుసా? అసలు ఈ సిరీస్కు యాషెస్ అని పేరు ఎందుకు వచ్చిందో తెలుసా? యాషెస్ సిరీస్ ఈ రోజున అంటే ఆగస్టు 29న ప్రారంభమైంది. ఇంగ్లండ్ వర్సెస్ ఆస్ట్రేలియా సిరీస్‌కు యాషెస్ అని పేరు పెట్టారు. యాస్ అంటే బూడిద అని అర్థం. దీని మూలాలు తెలుసుకోవాలంటే..1882 లో ఈ రెండు దేశాల మధ్య ఆడిన ఓ ఉత్తేజకరమైన మ్యాచ్‌తో ముడిపడి ఉన్నాయి. ఈ సమయంలో చాలా మ్యాచ్‌లు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లో మాత్రమే జరిగాయి. ఊహించని ఒక మ్యాచ్ ఫలితం కారణంగా ఈ సిరీస్‌కు యాషెస్ అని పేరు పెట్టారు.

ఓవల్‌లో జరిగిన ఈ మ్యాచ్ క్రికెట్ ప్రపంచంలో అత్యంత ఆసక్తికరమైన మ్యాచ్‌లలో ఒకటిగా పరిగణించారు. ఇంగ్లండ్ విజయానికి కేవలం 85 పరుగులు మాత్రమే కావాలి. అప్పటికి ఇంగ్లండ్ టీం స్కోరు రెండు వికెట్లకు 51 పరుగులు. అయితే, అనూహ్యంగా ఆస్ట్రేలియా ఏడు వికెట్ల తేడాతో విజయాన్ని సాధించింది. ఇంగ్లండ్‌లో ఆస్ట్రేలియాకు ఇది తొలి విజయం. ఆగస్టు 29 న ఇంగ్లండ్ ఓడిపోయింది. ఈ ఓటమి ఇంగ్లండ్ మీడియాను తాకింది. ఇంగ్లండ్‌లోని ప్రతీ వార్తాపత్రిక ఇంగ్లండ్ టీంను దారుణంగా విమర్శిస్తూ వ్యాసాలు ప్రచురించాయి.

ఇంగ్లండ్ మీడియా ఓ సంతాప సందేశం.. ఈ ఓటమి తరువాత, స్పోర్టింగ్ టైమ్స్ ఇంగ్లీష్ క్రికెట్ కోసం ఒక సంతాప సందేశాన్ని ప్రచురించింది. “ఇంగ్లీష్ క్రికెట్ చనిపోయింది. 29 ఆగస్టు 1882, ఓవల్‌లో ఇంగ్లండ్ టీం అంత్యక్రియల తర్వాత వచ్చిన బూడిదను (యాషెస్) ఆస్ట్రేలియా తీసుకెళ్లింది.. ” అంటూ రాసుకొచ్చింది. ఈ తరువాత ఏడాది ఇంగ్లండ్ జట్టు ఆస్ట్రేలియా వెళ్లినప్పుడు, ఆంగ్ల మీడియా ‘యాషెస్‌ను తిరిగి తీసుకరావాలంటూ’ వార్తలు ప్రచురించాయి. ఇక అక్కడి నుంచి ఈ రెండు దేశాల టెస్ట్ జట్లు ముఖాముఖిగా తలపడే ఆ సిరీస్‌కు యాషెస్ అని పేరు పెట్టారు. యాషెస్ కోసం ఒక ప్రత్యేక రకం ట్రోఫీని తయారు చేశారు. దీనిలో మొప్పలను కాల్చిన తర్వాత బూడిదను ఉంచుతారు. ఈ ట్రోఫీని యూఆర్‌ఎన్ అని కూడా పిలుస్తారు, ఇది బూడిద కలిగిన పాత్ర. నేటికీ ఈ సంప్రదాయం కొనసాగుతోంది.

యాషెస్ డిసెంబర్‌లో జరగనుంది.. ఈఏడాది యాషెస్ సిరీస్ డిసెంబర్ 8 నుంచి జనవరి 18 వరకు జరగనుంది. ఈసారి ఆస్ట్రేలియా దీనికి ఆతిథ్యమిస్తుంది. ఇంగ్లండ్‌లో చివరిసారిగా యాషెస్ సిరీస్ 2019లో జరిగింది. ఆ సిరీస్‌లో, టిమ్ పైన్ నేతృత్వంలోని ఆస్ట్రేలియా జట్టు యాషెస్ ట్రోఫీని గెలుచుకుంది. ఈ యాషెస్ సిరీస్ నుంచి బాల్ ట్యాంపరింగ్ వివాదం తర్వాత స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్ టెస్ట్ క్రికెట్‌కు తిరిగి వచ్చారు. ఈ సిరీస్‌లో స్మిత్ బలమైన ప్రదర్శన చేశాడు.

Also Read: Virat Kohli-MS Dhoni: పేలవ రికార్డులో ఎంఎస్ ధోనికి చేరువైన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. ఎందులోనో తెలుసా?

IND vs ENG: లీడ్స్‌లో భారత్‌కు భారీ నష్టం.. పాయింట్ల పట్టికలో తొలిస్థానం హుష్‌కాకి.. తక్కువ పాయింట్లతో అగ్రస్థానం చేరుకున్న జట్టేదో తెలుసా?

IND vs ENG: టీమిండియాకు మరో షాక్.. లీడ్స్ టెస్టులో గాయపడిన మరో ఆటగాడు..!