Virat Kohli-MS Dhoni: పేలవ రికార్డులో ఎంఎస్ ధోనికి చేరువైన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. ఎందులోనో తెలుసా?

విరాట్ కోహ్లీ భారతదేశంలో అత్యంత విజయవంతమైన టెస్ట్ కెప్టెన్‌లలో ఒకరు. కోహ్లీ ఈ విషయంలో ధోనీతో సహా చాలా మంది భారత గొప్ప కెప్టెన్‌ల రికార్డులను బద్దలు కొట్టాడు. కానీ, ఓటమి విషయంలో కూడా..

Virat Kohli-MS Dhoni: పేలవ రికార్డులో ఎంఎస్ ధోనికి చేరువైన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. ఎందులోనో తెలుసా?
Virat Kohli
Follow us
Venkata Chari

|

Updated on: Aug 29, 2021 | 9:22 AM

Virat Kohli-MS Dhoni: ఇంగ్లండ్‌తో జరిగిన లీడ్స్ టెస్ట్‌లో, కేవలం రెండు సెషన్‌లు టీమిండియా భవితవ్యాన్ని నిర్ణయించాయి. మొదటి రోజు మొదటి సెషన్‌లో, భారత జట్టు ఇన్నింగ్స్ తక్కువ స్కోర్‌కే ఆలౌట్‌ అయింది. నాలుగోవ రోజు మొదటి సెషన్‌లో మరింత ఘోరంగా తడబడింది. భారత్ ఇన్నింగ్స్ 76 పరుగుల తేడాతో ఓడిపోయింది. దీంతో ఇంగ్లండ్ ఐదు టెస్టుల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. మూడో టెస్టులో నాల్గవ రోజు భారత్‌పై విజయాన్ని నమోదు చేసింది. ఈ టెస్టుతో పాటు, విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో, భారత జట్టు విదేశీ గడ్డపై మరో ఘోర పరాజయాన్ని ఎదుర్కోవలసి వచ్చింది. భారత కెప్టెన్ పేలవ రికార్డుకు చాలా దగ్గరయ్యాడు.

లార్డ్స్ టెస్టులో గొప్ప విజయాన్ని నమోదు చేసి సిరీస్‌లో ఆధిక్యంలో నిలిచిన భారత్, అలాంటి పరిస్థితుల్లో లీడ్స్ టెస్టులో మెరుగ్గా రాణిస్తుందని అంతా భావించారు. కానీ, అది జరగలేదు. లీడ్స్‌లో ఇంగ్లండ్ టీం తిరిగి పుంజుకుని బరిలో నిలిచింది. కోహ్లీ కెప్టెన్సీలో ఇంగ్లండ్‌పై ఇంగ్లండ్‌లో భారత్‌కు ఇది ఐదో ఓటమి. మరోవైపు దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా దేశాలపై భారత్‌ తీరును పరిశీలిస్తే.. ఇంగ్లండ్‌లో జరిగే టెస్ట్ మ్యాచ్‌లలో, ఓటమి విషయంలో విరాట్ కోహ్లీ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీతో సమానంగా ఉండబోతున్నాడు.

మరో మ్యాచ్‌లో ఓడితే ధోని సరసన.. ధోని కెప్టెన్సీలో, టీమిండియా ఈ దేశాలలో 23 టెస్ట్ మ్యాచ్‌లు ఆడింది. ఇందులో కేవలం 3 సార్లు మాత్రమే గెలిచింది. 14 సార్లు ఓడిపోయింది. 6 మ్యాచ్‌లు డ్రా అయ్యాయి. అదే సమయంలో, కోహ్లీ కెప్టెన్సీలో, ఈ దేశాలలో అత్యధికంగా 5 టెస్టుల్లో భారత్ విజయం సాధించింది. భారత జట్టు 21 మ్యాచ్‌లలో 5 విజయాలు నమోదు చేసింది. 13 సార్లు ఓడిపోయింది. కెప్టెన్సీలో ధోనీ రికార్డులను బద్దలు కొట్టిన కోహ్లీ, ఓటమిలో ధోని పేలవ రికార్డుకు చేరువయ్యాడు.

కోహ్లీ అత్యంత విజయవంతమైన కెప్టెన్.. కోహ్లీ టీమిండియా తరుపున అత్యంత విజయవంతమైన టెస్ట్ కెప్టెన్. అతని నాయకత్వంలో భారత్ 37 మ్యాచ్‌లు గెలిచింది. ప్రస్తుతం, రెండు టెస్ట్ మ్యాచ్‌లు మిగిలి ఉండగానే సిరీస్ 1-1తో సమంగా నిలిచింది. సిరీస్‌లోని నాల్గవ టెస్ట్ మ్యాచ్ లండన్‌లోని ఓవల్ మైదానంలో సెప్టెంబర్ 2 నుంచి ప్రారంభమవుతుంది. ఆ మ్యాచ్‌లో విజయం సాధించడం ద్వారా సిరీస్‌లో ఆధిక్యాన్ని తిరిగి పొందేందుకు భారత జట్టు ప్రయత్నిస్తుంది.

Also Read:

IND vs ENG: లీడ్స్‌లో భారత్‌కు భారీ నష్టం.. పాయింట్ల పట్టికలో తొలిస్థానం హుష్‌కాకి.. తక్కువ పాయింట్లతో అగ్రస్థానం చేరుకున్న జట్టేదో తెలుసా?

Paralympics: పారాలింపిక్స్‌లో భారత్‌కు పతకం.. టేబుల్ టెన్నిస్‌లో రజితం సాధించిన భవీనాబెన్..

IND vs ENG: టీమిండియాకు మరో షాక్.. లీడ్స్ టెస్టులో గాయపడిన మరో ఆటగాడు..!