IND vs ENG: టీమిండియాకు మరో షాక్.. లీడ్స్ టెస్టులో గాయపడిన మరో ఆటగాడు..!
ఇంగ్లండ్ పర్యటనలో భారత జట్టు ఆటగాళ్ల గాయాలతో ఇబ్బంది పడుతోంది. టెస్ట్ సిరీస్ ప్రారంభానికి ముందే శుభ్మన్ గిల్, మయాంక్ అగర్వాల్ గాయపడ్డారు.
IND vs ENG: లీడ్స్ టెస్టులో ఇంగ్లండ్ చేతిలో భారత క్రికెట్ జట్టు ఘోర పరాజయాన్ని చవిచూసింది. జో రూట్ సారథ్యంలోని ఆతిథ్య జట్టు, నాలుగో రోజునే భారత్‌ను ఇన్నింగ్స్ 76 పరుగుల తేడాతో ఓడించింది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్ 1-1తో ఇరుజట్లు సమంగా నిలిచాయి. భారత జట్టు ప్రస్తుతం సెప్టెంబర్ 2 న లండన్‌లో ప్రారంభమయ్యే నాల్గవ టెస్టులో సత్తా చాటేందుకు ఎదురుచూస్తుంది. టీమిండియాకు లీడ్స్‌లో ఓటమితో ఇబ్బంది పడుతుండగా.. మరో షాక్ తగిలింది. టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా ఫిట్‌నెస్ కూడా ఆందోళనకరంగా మారింది. నివేదికల ప్రకారం, జడేజా మోకాలి గాయంతో బాధపడుతున్నాడు. మ్యాచ్ తర్వాత అతన్ని పరీక్షల కోసం లీడ్స్‌లోని ఆసుపత్రికి తరలించారు.
పీటీఐ నివేదిక ప్రకారం, లీడ్స్ టెస్ట్ రెండవ రోజు ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు మోకాలికి గాయమైంది. అయితే, శనివారం రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు జడేజా బౌలింగ్ చేసి కొన్ని ముఖ్యమైన పరుగులు సాధించాడు. అయితే, జట్టు ఓటమి తరువాత, అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ అతను గాయం తీవ్రతను తెలుసుకోవడానికి స్కాన్ కూడా చేసినట్లు తెలుస్తోంది.
గాయం ఉన్నప్పటికీ రవీంద్ర జడేజా చాలా ఓవర్లు బౌలింగ్ చేశాడు. మొదటి ఇన్నింగ్స్‌లో 32 ఓవర్లు బౌలింగ్ చేశాడు. అందులో 2 వికెట్లు కూడా తీసుకున్నాడు. ప్రస్తుతం నివేదికల కోసం మేనేజ్‌మెంట్ వేచి చూస్తోంది. ఆ తర్వాత నాల్గవ టెస్టులో జడేజా ఆడతాడా లేదా తెలుస్తుంది. జడేజా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఆసుపత్రిలో ఉన్న తన ఫొటోను పోస్ట్ చేశాడు. జడేజా నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్‌లో 30 పరుగులు చేసి, జట్టు ఓటమిని తగ్గించేందుకు ప్రయత్నించాడు.
అంతకు ముందు ఇతర భారత ఆటగాళ్లు కూడా.. ఈ పర్యటనలో భారత జట్టు ఆటగాళ్ల గాయాలతో ఇబ్బందులు పడుతోంది. ముందుగా, ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో ఓపెనర్ శుభ్మన్ గిల్ గాయపడ్డాడు. ఈ కారణంగా అతను ఇంగ్లండ్‌తో జరిగే టెస్టు సిరీస్‌కు దూరమయ్యాడు. అదే సమయంలో, నాటింగ్‌హామ్ టెస్టుకు ముందు, మయాంక్ అగర్వాల్ కూడా నెట్ సెషన్‌లో మహ్మద్ సిరాజ్ బౌన్సర్‌తో గాయపడ్డాడు. మొదటి టెస్టుకు దూరమయ్యాడు. అతను ప్రస్తుతం బాగానే ఉన్నాడు.
Ravindra Jadeja has taken to social media to inform that he went for scans on his knee after the end of the 3rd Test #jadeja #ENGvsIND pic.twitter.com/OJgNMPO3qA
— Baidurjo Bhose (@bbhose) August 28, 2021
Also Read: