IND vs ENG: ఈ యంగ్ బ్యాట్స్‌మెన్ పేలవ ఆటతీరుపై నెటిజన్ల మండిపాటు.. ఆయన్ను తీసుకోండంటూ టీమిండియాకు రిక్వెస్ట్

Venkata Chari

Venkata Chari |

Updated on: Aug 29, 2021 | 7:46 AM

రిషబ్ బ్యాటింగ్ ప్రదర్శనతో నిరాశ చెందిన భారత అభిమానులు.. సోషల్ మీడియాలో కామెంట్లతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాలుగో మ్యాచులో..

IND vs ENG: ఈ యంగ్ బ్యాట్స్‌మెన్ పేలవ ఆటతీరుపై నెటిజన్ల మండిపాటు.. ఆయన్ను తీసుకోండంటూ టీమిండియాకు రిక్వెస్ట్
Wriddiman Saha Vs Rishabh Pant

Wriddiman Saha vs Rishabh Pant: హెడింగ్లీ, లీడ్స్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టెస్టులో భారత్ ఇన్నింగ్స్ 76 పరుగుల తేడాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే. దీంతో వెంటనే, వృద్ధిమాన్ సాహా పేరు ట్విట్టర్‌లో ట్రెండింగ్‌లో నిలిచింది కారణం ఏంటంటే.. రిషబ్ బ్యాటింగ్ ప్రదర్శనతో నిరాశ చెందిన భారత అభిమానులు.. ఈ యంగ్ వికెట్ కీపర్‌ను టార్గెట్ చేసి మరీ సోషల్ మీడియాలో బాగా ట్రోల్ చేశారు. రిషబ్ పంత్ ప్లేసులో సాహాను తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు.

ఎంఎస్ ధోని తరువాత.. ఆంగ్లేయులతో జరిగిన ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఢిల్లీ క్రికెటర్ పంత్ బ్యాట్‌ పరుగులు సాధించడంలో తీవ్రంగా ఇబ్బంది పడుతోంది. ఐదు ఇన్నింగ్స్‌లలో, 17.40 సగటుతో కేవలం 87 పరుగులు మాత్రమే సాధించాడు. ఎంఎస్ ధోనీ టెస్ట్ క్రికెట్ నుంచి నిష్క్రమించినప్పటి నుంచి, సాహా భారతదేశం కోసం స్టంప్‌ల వెనుక ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. కీపింగ్‌లో రాణిస్తున్నా.. బ్యాటింగ్‌లో మాత్రం అంతగా ఆకట్టుకోలేకపోయాడు.

సాహా ప్లేస్‌కు ఎసరు పెట్టిన్ పంత్.. సాహా గతేడాది చివరిలో జరిగిన మొదటి ఆస్ట్రేలియా-ఇండియా టెస్ట్ తర్వాత ప్లేయింగ్ XIలో చోటు దక్కించుకోలేకపోయాడు. ఈ సమయంలోనే యంగ్ బ్యాట్స్‌మెన్, కీపర్ రిషబ్ పంత్ బ్యాట్‌తో ఆకట్టుకున్నాడు. టీమిండియాలో తన స్థానాన్ని మరింత మెరుగుపరుచుకోవడం కోసం కీపింగ్ బాధ్యతలు తీసుకుని ఆకట్టుకున్నాడు. దీంతో సాహా ప్లేస్‌లో పంత్ చేరిపోయాడు.

సాహా టెస్ట్ కెరీర్.. ప్రస్తుతం పంత్ ఇంగ్లండ్‌లో బ్యాట్‌తో పరుగులు సాధించలేకపోతున్నాడు. దీంతో అభిమానులు తిరిగి సాహాను కోరుకుంటున్నారు. సాహా ఇప్పటి వరకు 38 టెస్టులు ఆడాడు. 29.09సగటుతో 1251 పరుగులు చేశాడు. ఐదు అర్ధ సెంచరీలతో పాటు మూడు సెంచరీలు కూడా సాధించాడు.

ఇది బౌలర్ల విజయం.. మరోవైపు “ఇది బౌలర్లు సాధించిన అద్భుతమైన విజయం. ఇద్దరు సీనియర్లు.. ముగ్గురు కొత్త కుర్రాళ్లు టీమిండియాను ఒత్తిడిలో నెట్టారు. వరుసగా వికెట్లు తీస్తూ.. భారత్‌ను తెగ ఇబ్బంది పెట్టారు. మేము ఇలాంటి ప్రదర్శన చేయగల సామర్థ్యం ఉందని మాకు తెలుసు. జట్టులో ఎంతో ప్రతిభ కలిగిన ఆటగాళ్లు ఉన్నారు. మేము కొత్త బంతితో టీమిండియాను నియంత్రించగలిగాం ” అని రూట్ వివరించారు.

సెంచరీలతో దూకుడు పెంచిన రూట్.. ఈ టెస్టు సిరీస్‌ ముందు వరకు రూట్ తన స్వదేశంలో ఒక్క సెంచరీ కూడా నమోదు చేయలేదు. ప్రస్తుతం భారత్‌తో సిరీస్‌లో అద్భుతంగా బ్యాటింగ్ చేస్తు సెంచరీలతో రికార్డుల దుమ్ము దులిపేస్తున్నాడు.

Also Read: ENG vs IND: నాన్-స్ట్రైకర్ ఎండ్‌లో టీమిండియా కీపర్ షాడో బ్యాటింగ్.. బౌలర్‌ని కూడా పట్టించుకోలే..! అసలేం జరిగిందంటే?

Neeraj Chopra: పాకిస్తానీయుల హృదయాలను గెలిచిన నీరజ్ చోప్రా.. నిజమైన ఛాంపియన్‌ మీరేనంటూ పొగడ్తలు.. ఎందుకో తెలుసా?

IND vs ENG: మూడో టెస్టులో కోహ్లీ సేన పరాజయం.. ఇన్నింగ్స్ 76 పరుగులతో ఇంగ్లండ్ ఘన విజయం..!

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu