ENG vs IND: నాన్-స్ట్రైకర్ ఎండ్‌లో టీమిండియా కీపర్ షాడో బ్యాటింగ్.. బౌలర్‌ని కూడా పట్టించుకోలే..! అసలేం జరిగిందంటే?

Rishabh Pant: భారత వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్ మైదానంలో సందడి చేస్తూనే ఉంటాడు. పదేపదే అతను వికెట్ల వెనుక నుంచి ఏదో ఒకటి మాట్లాడుతూ వార్తల్లో నిలుస్తుంటాడు.

ENG vs IND: నాన్-స్ట్రైకర్ ఎండ్‌లో టీమిండియా కీపర్ షాడో బ్యాటింగ్.. బౌలర్‌ని కూడా పట్టించుకోలే..! అసలేం జరిగిందంటే?
Rishab Pant
Follow us
Venkata Chari

|

Updated on: Aug 28, 2021 | 8:37 PM

Rishabh Pant: భారత వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్ మైదానంలో సందడి చేస్తూనే ఉంటాడు. పదేపదే అతను వికెట్ల వెనుక నుంచి ఏదో ఒకటి మాట్లాడుతూ వార్తల్లో నిలుస్తుంటాడు. రిషబ్ ఫన్నీ వ్యాఖ్యలతో అతని సహచరులను అలరిస్తూనే ఉంటాడు. అతను మైదానంలోని పరిస్థితులతో సంబంధం లేకుండా అతడి బ్యాటింగ్‌కు ప్రసిద్ధి చెందాడు. అతడి బ్యాటింగ్ విధానంతో ఎన్నోసార్లు విమర్శలకు కూడా గురయ్యాడు. నేడు ముగిసిన హెడింగ్లీ టెస్టులో నాల్గవ రోజు, అతను రెండో కొత్త బంతితో బ్యాటింగ్ చేసేందుకు సిద్ధమయ్యాడు. కానీ, వెంటనే పెవిలియన్ చేరాడు. చెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, అజింక్యా రహానే లాంటి దిగ్గజాలు బంతిని స్వింగ్ చేయడంలో పలు ఇబ్బందులు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే.

నాలుగో రోజు త్వరగా వికెట్లు కోల్పోయి టీమిండియా ఓటమిని కొని తెచ్చుకుంది. ఈ మ్యాచులో భారత్ ఇన్నింగ్స్ 76 పరుగుల తేడాతో ఓడిపోయింది. అయితే, ఈమ్యాచులో మరోసారి వార్తల్లో నిలిచాడు. నాన్-స్ట్రైకర్ ఎండింగ్‌లో షాడో బ్యాటింగ్ చేస్తూ కెమెరా కంట చిక్కాడు. దీంతో సోషల్ మీడియాలో రిషబ్ పంత్‌పై భారత అభిమానులు పలు రకాల కామెంట్లు చేస్తున్నారు. జేమ్స్ ఆండర్సన్ బౌలింగ్ చేసేందుకు సిద్ధమయ్యాడు. క్రీజులో రహానె ఉన్నాడు. అయితే నాన్ స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న రిషబ్ పంత్.. బౌలర్‌ను గమనించకుండా షాడో బ్యాటింగ్ చేస్తున్నాడ. అండర్సన్ డెలవరీ చేయగా హడావిడిగా లైన్‌లోకి వచ్చి చేరాడు.

మరోసారి నిరాశ పరిచిన పంత్.. రిషబ్ పంత్ రెండో ఇన్నింగ్స్‌లోనూ నిరాశ పరిచాడు. కేవలం ఒక పరుగు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. ఆస్ట్రేలియా పర్యటన, ఇంగ్లండ్‌తో జరిగిన స్వదేశీ సిరీస్‌లో సత్తా చాటిన తరువాత కీలకమైన ఇంగ్లండ్ సిరీస్‌లో మాత్రం రాణించలేక పోతున్నాడు. ఇప్పటివరకు ఐదు ఇన్నింగ్స్‌లలో కేవలం 87 పరుగులు మాత్రమే సాధించాడు.

ఇన్నింగ్స్‌ 76 పరుగుల తేడాతో ఓటమి.. మ్యాచ్ విషయానికి వస్తే.. మూడో టెస్టులో టీమిండియా ఓటమి పాలైంది. నాలుగో రోజు ఉదయం సెషన్‌లో వరుసగా వికెట్లు కోల్పోయి.. పరాజయం పాలైంది. దీంతో ఇంగ్లండ్ టీం ఇన్నింగ్స్ 76 పరుగులతో విజయం సాధించింది. దీంతో ఐదు టెస్టుల సిరీస్‌లో ఇరు జట్లు 1-1తో సమంగా నిలిచాయి. ఇరు జట్ల మధ్య నాలుగో టెస్ట్‌ సెప్టెంబర్‌ 2 నుంచి ప్రారంభంకానుంది. 7 వికెట్లు తీసిని రాబిన్ సన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎన్నికయ్యాడు. టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో 278 పరుగులకు ఆలౌట్ అయింది. పుజారా(91), కోహ్లీ(55), రహానె(10), రిషభ్‌ పంత్‌(1), షమీ(6), ఇషాంత్ శర్మ(2), సిరాజ్(0) వరుసగా పెవిలియన్‌కు క్యూ కట్టారు. జడేజా (30) ఒక్కడే కొద్ది సేపు బౌండరీలతో అలరించాడు.

Also Read:

Neeraj Chopra: పాకిస్తానీయుల హృదయాలను గెలిచిన నీరజ్ చోప్రా.. నిజమైన ఛాంపియన్‌ మీరేనంటూ పొగడ్తలు.. ఎందుకో తెలుసా?

IND vs ENG: మూడో టెస్టులో కోహ్లీ సేన పరాజయం.. ఇన్నింగ్స్ 76 పరుగులతో ఇంగ్లండ్ ఘన విజయం..!

IND Vs ENG: ఈసారి ఇండియాకి.. రోహిత్‌ శర్మ అవుట్‌ అయ్యాడు.. కోహ్లీ ప్లేస్‌లో ‘జార్వో’ మళ్లీ వచ్చేశాడు..