Neeraj Chopra: పాకిస్తానీయుల హృదయాలను గెలిచిన నీరజ్ చోప్రా.. నిజమైన ఛాంపియన్ మీరేనంటూ పొగడ్తలు.. ఎందుకో తెలుసా?
ఎటువంటి కారణం లేకుండా అసలు విషయం తెలియకుండా ఈ విషయాన్ని మరింతగా పెద్దదిగా చేయవద్దని నీరజ్ విజ్ఞప్తి చేశాడు.
Neeraj Chopra: టోక్యో ఒలింపిక్స్‌లో భారతదేశానికి ఏకైక బంగారు పతకం అందించిన భారత అథ్లెట్ నీరజ్ చోప్రా.. ఈసారి పాకిస్తాన్ క్రీడాభిమానుల హృదయాలను గెలుచుకున్నాడు. ఒలింపిక్స్‌లో జావెలిన్‌త్రో ఫైనల్‌కు ముందు నీరజ్ తన జావెలిన్‌ను పొందలేకపోయాడు. కారణం, అది పాకిస్తాన్ అథ్లెట్ అర్షద్ నదీమ్ చేతిలో ఉండిపోయింది. దీంతో సోషల్ మీడియాతోపాటు మీడియాలోనూ పాకిస్తాన్ అథ్లెట్ అర్షద్‌ను ఏకిపారేశారు. అలాగే పాకిస్తాన్ అథ్లెట్ నీరజ్‌ను వేధించాలనుకున్నాడని కామెంట్లతో విమర్శలు గుప్పించారు. ఇది గత మూడు రోజులుగా బాగా తీవ్రం కావడంతో.. ఎట్టకేలకు నీరజ్ దీనిపై సోషల్ మీడియలో ఓ వీడియోను విడుదల చేశాడు. అసలు విషయం తెలియకుండా ఎవరినీ టార్గెట్ చేయవద్దని ప్రజలను కోరారు. అర్షద్ ఎలాంటి తప్పు చేయలేదని ఆయన అన్నారు.
‘ఫైనల్ ప్రారంభానికి ముందు నేను నా జావెలిన్ కోసం వెతుకుతున్నాను. కానీ, నా జావెలిన్ పాకిస్తాన్ ఆటగాడు అర్షద్ నదీమ్ చేతిలో చూశాను. బ్రదర్ ఇది నా జావెలిన్ అని అర్షద్‌కి చెప్పాను. వెంటనే అతను తిరిగి ఇచ్చేశాడు’ అని నీరజ్ తెలిపాడు. నీరజ్ ఎటువంటి కారణం లేకుండా ఈ విషయాన్ని మరింతగా పెద్దదిగి చేయవద్దని నీరజ్ విజ్ఞప్తి చేశాడు. అందరి జావెలిన్‌లు ఒకచోటే పెట్టాం. వీటిని ఎవరైనా వాడుకోవచ్చు. ఇందులో తప్పేమీ లేదు. కాబట్టి అర్షద్ ఎలాంటి తప్పు చేయలేదు. ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయాలని కోరాడు.
నీరజ్ విడుదల చేసిన ఈ వీడియోపై పాకిస్తాన్ వార్తా పత్రిక ‘డాన్ న్యూస్’ స్పోర్ట్స్ హెడ్ అబ్దుల్ గఫర్ ట్వీట్ చేశారు. “నీరజ్ వీడియోకి ధన్యవాదాలు. మీరు నిజమైన ఛాంపియన్. అందుకే అర్షద్ నదీమ్ మిమ్మల్ని చాలా అభినందిస్తున్నారు. ఇప్పుడు మీపై పాకిస్తాన్‌లో మరింత గౌరవం పెరగిందని” అని వెల్లడించారు. పాకిస్తాన్ మల్టీ మీడియా జర్నలిస్ట్ షిరాజ్ హుస్సేన్ కూడా నీరజ్‌ను ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. అలాగే పాకిస్థాన్‌లోని సాధారణ క్రీడా ప్రేమికులు కూడా నీరజ్‌ని ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో కామెంట్లు చేశారు. నీరజ్ క్రీడా నైపుణ్యాన్ని గౌరవించే నిజమైన ఛాంపియన్ అంటూ అభివర్ణించారు.
मेरी आप सभी से विनती है की मेरे comments को अपने गंदे एजेंडा को आगे बढ़ाने का माध्यम न बनाए। Sports हम सबको एकजूट होकर साथ रहना सिखाता हैं और कमेंट करने से पहले खेल के रूल्स जानना जरूरी होता है ?? pic.twitter.com/RLv96FZTd2
— Neeraj Chopra (@Neeraj_chopra1) August 26, 2021
Neeraj thank you for this Video , You are a true Champion, That’s why @Arshadnadeem76 admire you and earned your respect https://t.co/cmzv2fFs1G
— Abdul Ghaffar (Replay, Dawn News) (@GhaffarDawnNews) August 26, 2021
Love and respect ❤️ https://t.co/CcfhNe6zOk
— Shiraz Hassan (@ShirazHassan) August 26, 2021
Also Read:
PV Sindhu: పీవీ సింధుకు సినీ ప్రముఖుల సన్మానం.. వీడియోను షేర్ చేసిన చిరంజీవి
IND vs ENG: మూడో టెస్టులో కోహ్లీ సేన పరాజయం.. ఇన్నింగ్స్ 76 పరుగులతో ఇంగ్లండ్ ఘన విజయం..!