Paralympics: పారాలింపిక్స్‌లో భారత్‌కు పతకం.. టేబుల్ టెన్నిస్‌లో రజితం సాధించిన భవీనాబెన్..
పారాలింపిక్స్‌లో భారత్‌కు పతకం వచ్చింది. టేబుల్ టెన్నిస్ విభాగంలో భవీనాబెన్ రజిత పతకాన్ని సాధించింది. చైనా క్రీడాకారిణి యింగ్..
టోక్యోలో జరుగుతోన్న పారాలింపిక్స్‌లో టేబుల్ టెన్నిస్ స్టార్ ప్లేయర్ భవీనాబెన్ పటేల్ చరిత్ర సృష్టించింది. తద్వారా భారత్‌కు తొలి పతకం అందించింది. స్వర్ణ పతకం పోరులో భాగంగా ప్రపంచ నెంబర్‌వన్ చైనా క్రీడాకారిణి యింగ్ జావోతో ఫైనల్ మ్యాచ్ ఆడిన భవీనాబెన్.. 0-3 తేడాతో ఓటమిపాలైంది. దీనితో ఆమె రజిత పతకంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. టోర్నీ మొదటి నుంచి భవీనాబెన్.. అద్భుతంగా రాణిస్తూ త్రివర్ణ పతకాన్ని రెపరెపలాడించింది. కాగా, పారాలింపిక్స్ టేబుల్ టెన్నిస్ విభాగంలో భారత్‌కు ఇదే తొలి పతకం కావడం గమనార్హం.
గుజరాత్‌కు చెందిన భవీనాబెన్ తొలిసారి 2016 రియో పారాలింపిక్స్‌కు ఎంపికైంది. అయితే ఆమె సాంకేతిక కారణాల వల్ల ఆ పోటీల్లో పాల్గొనకలేకపోయినప్పటికీ.. పట్టుదలను మాత్రం వీడలేదు. టోక్యో పారాలింపిక్స్‌లోకి అడుగుపెట్టింది. మొదటి మ్యాచ్ నుంచి తన స్థాయికి మించిన ప్రదర్శన కనబరిచింది. మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన భవీనా పోలియో కారణంగా చిన్నప్పటి నుంచి చక్రాల కుర్చీకే పరిమితమైంది. ఆ సమయంలో కుటుంబం అండగా నిలిచింది. ఆమెను ప్రోత్సహించింది. 2004లో భవీనా తండ్రి ఆమెను అహ్మదాబాద్‌లోని బ్లైండ్ పీపుల్స్ అసోసియేషన్‌లో చేర్పించడంతో టేబుల్ టెన్నిస్ కెరీర్‌కు అంకురార్పణ జరిగింది. వైక్యలం ఉందని బాధపడకుండా.. పట్టుదలతో శ్రమించింది.. జాతీయ ఛాంపియన్‌గా నిలిచింది. పారాలింపిక్స్‌లో పతకం గెలిచిన రెండో భారత మహిళా అథ్లెట్‌గా రికార్డు సృష్టించింది.
ఇవి చదవండి:
SILVER FOR BHAVINA ?#BhavinaPatel goes down fighting to the World No.1 – China’s Zhou Ying in the Class 4 finals!
?? 0 – 3 ??#TableTennis | #Tokyo2020 | #Paralympics pic.twitter.com/qAlx7AYvNl
— Badminton India (@BadmintonIndia) August 29, 2021