Tokyo Paralympics: భారత్‌కు రజతం అందించిన భవినాపై రాష్ట్రపతి, ప్రధాని, ఇతర క్రీడాకారులు ప్రశంసల వర్షం

Tokyo Paralympics 2020: జపాన్ రాజధాని టోక్యో వేదికగా జరుగుతున్న పారా ఒలంపిక్స్‌లో భారత టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి భవీనాబెన్ చరిత్ర సృష్టించారు. టేబుల్ టెన్నిస్‌ విభాగంలో భారత్ కు..

Tokyo Paralympics: భారత్‌కు రజతం అందించిన భవినాపై రాష్ట్రపతి, ప్రధాని, ఇతర క్రీడాకారులు ప్రశంసల వర్షం
Bhavinaben Patel
Follow us
Surya Kala

|

Updated on: Aug 29, 2021 | 12:12 PM

Tokyo Paralympics 2020: జపాన్ రాజధాని టోక్యో వేదికగా జరుగుతున్న పారా ఒలంపిక్స్‌లో భారత టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి భవీనాబెన్ చరిత్ర సృష్టించారు. టేబుల్ టెన్నిస్‌ విభాగంలో భారత్ కు మెడల్ సాధించిపెట్టిన తొలి క్రీడాకారిణిగా భవీనాబెన్‌ రికార్డ్ సృష్టించారు. భావినాబెన్ ఫైనల్‌లోకి దూసుకెళ్లి భారత తొలి ప్యాడ్లర్‌గా నిలిచారు. పసిడి కోసం జరిగిన ఫైనల్ పోటీల్లో చైనాకు చెందిన వరల్డ్ నంబర్ వన్ క్రీడాకారిణి యింగ్​ ఝోతో తలపడ్డారు. మొదటి సెట్ లో యంగ్ కి గట్టిపోటీనిచ్చారు. తర్వాత వెనుకంజ వేయడంతో భావినా యింగ్​ ఝో చేతిలో 0-3 తేడాతో పరాజయం పాలయ్యారు. దీంతో భవీనాబెన్‌ రజతంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

టేబుల్ టెన్నిస్ విభాగం మహిళల సింగిల్స్ క్లాస్ 4 పోటీల్లో రజత పతకం సాధించిన భవీనా పటేల్‌పై ప్రశంసలవెల్లువ కురుస్తుంది. రాష్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని మోదీ, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ఇతర క్రీడాకారులు సోషల్ మీడియా వేదికగా క్రీడాకారిణి భవీనా బెన్‌కు అభినందనలు తెలియజేస్తున్నారు. భవీనా బెన్ జీవితం యువత క్రీడలలోకి వచ్చేందుకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందన్నారు.

భవీనా పటేల్ చరిత్ర సృష్టించారు. భారత్‌కు అత్యంత ప్రతిష్టాత్మక రజత పతకం తీసుకువచ్చారు. ఆమె జీవితం యువతను మార్గదర్శకమని ప్రధాని మోడీ ప్రశంసించారు. ఇక భవానీ విజయం దేశానికి గర్వకారణం అంటూ రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ కూడా భవీనాకు అభినందనలు తెలియజేశారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా భవీనాకు అభినందనలు తెలిపారు. ఇక, క్రీడాకారులు వీరేంద్ర సెహ్వాగ్, పీటీ ఉష.. తదితరులు భవీనాబెన్‌కు సోషల్ మీడియా అభినందనలు తెలిపారు.

Also Read: First Love: తొలిప్రేమ జ్ఞాపకాలు మది గదిలో భద్రం.. ఎప్పటికీ మరచిపోరు అంటున్న సైకాలజిస్టులు.. కారణం ఏమిటంటే..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!