AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

First Love: తొలిప్రేమ జ్ఞాపకాలు మది గదిలో భద్రం.. ఎప్పటికీ మరచిపోరు అంటున్న సైకాలజిస్టులు.. కారణం ఏమిటంటే..

First Love: తొలి పిలుపు, తొలి వలపు, తొలి ప్రేమ, తొలి పలుకు ఇలా ఎప్పుడూ మొదటి సారి జనియించె ఫీలింగ్స్ ఎప్పుడూ మధురమే.. అమ్మని మనం జీవితంలో ఎన్ని సార్లు అమ్మా అని పిలిచినా ..

First Love: తొలిప్రేమ జ్ఞాపకాలు మది గదిలో భద్రం.. ఎప్పటికీ మరచిపోరు అంటున్న సైకాలజిస్టులు.. కారణం ఏమిటంటే..
First Love
Surya Kala
|

Updated on: Aug 29, 2021 | 11:51 AM

Share

First Love: తొలి పిలుపు, తొలి వలపు, తొలి ప్రేమ, తొలి పలుకు ఇలా ఎప్పుడూ మొదటి సారి జనియించె ఫీలింగ్స్ ఎప్పుడూ మధురమే.. అమ్మని మనం జీవితంలో ఎన్ని సార్లు అమ్మా అని పిలిచినా మొదటిసారిగా వచ్చిరాని మాటలతో ముద్దుముద్దుగా పిలిచే అమ్మా అన్న పిలుపు ఆమెను పులకరింపజేస్తుంది. అమ్మా అన్న మాటతో పరవశం పొందుతుంది. ఇక మనిషి జీవితంలో ఎప్పుడు ఎలా ఎటువంటి పరిస్థితుల్లో ప్రేమ ఎవరిమదిని తాకుతుందో ఎవరికీ తెలియదు.. ప్రేమ మాటల్లో చెప్పలేని భావం.. అది కేవలం అనుభవించాలంతే.. అందుకే ప్రేమ గురించి ఎవరైనా చెప్పమంటే.. అది ఎలా ఉంటుంది అని చెప్పలేం.. ప్రేమ గురించి తెలియాలంటే జస్ట్ ప్రేమించాలంతే.. అంతకు ఇంకో దారి లేదు.

అయితే ప్రేమ అంటే ఏమిటి..? ప్రేమ ఎన్నిసార్లు పుడుతుందంటూ కొంతమంది ప్రశ్నిస్తారు. నిజానికి కొంతమందేమో ప్రేమ ఒక్కసారే పుడుతుంది. ఒక్కరి మీదే పుడుతుంది అంటారు. మరికొందరేమో ప్రేమ ఎవ్వరి మీదైనా ఎప్పుడైనా ఎన్నిసార్లైనా పుట్టవచ్చు అని చెబుతారు. ఇంకొందరు.. ప్రేమ ఎన్నిసార్లు పుట్టినా ఎంత మందిని ప్రేమించినా.. తొలిప్రేమ మాత్రం ప్రత్యేకంగా అంటారు.

జీవితంలో ఎంతో మందిని ప్రేమించినా కూడా తొలిప్రేమ గుర్తులు మది గదిలో పదిలంగా ఉంటాయి. తొలిప్రేమ కాలం నాటి అనుభూతులు అనుక్షణం నీడలా వెంటాడుతూనే ఉంటాయి. ఎంతో మందిని ఎన్నిసార్లు ప్రేమించినా.. తొలిప్రేమ తాలూకూ తియ్యదనం కనులముందు కదలాడుతూనే ఉంటుంది. అసలు తొలిప్రేమను మర్చిపోకపోవడానికి కారణాలేంటి? చూద్దాం..

మొదటిసారి ప్రేమలో పడ్డప్పుడు ఎంతో ఎక్సైట్మెంట్ ఉంటుంది. అమోఘమైన భావుకత్వం కనిపిస్తుంది. ఆ మొదటి ప్రేమలో పడిన సమయంలో కలిగిన అనుభూతి మళ్ళీ మళ్ళీ రాదు. మొదటి ప్రేమలో అమాయకత్వం ఉంటుంది. ఆ అమాయకత్వం అవతలి వారిపై తీవ్రమైన ప్రేమను పెంచుతుంది. యవ్వనంలో పుట్టిన తొలిప్రేమ గుర్తుచేసుకున్నప్పుడల్లా మధురమైన భావాలు తలెత్తుతాయి. అందుకే ఏ చిన్న కష్టం వచ్చినా దుఃఖం కలిగినా వెంటనే తొలిప్రేమని గుర్తు చేసుకున్నారు. ఇంకా చెప్పాలంటే ఎక్కువ సార్లు తలచుకుంటూ ఉంటారు. తొలిప్రేమ అకస్మాత్తుగా ఆగిపోతుంది. మీరు ప్రేమించినవారిని పెళ్లి చేసుకోవడానికి అనేక అడ్డంకులు ఏర్పడి ఉంటాయి. యవ్వనంలో కెరీర్ పై దృష్టి పెట్టడం.. పై చదువుల కోసం ఇతర దేశాలకి వెళ్ళడమో, కెరీర్ కారణాలు వంటి అనేక కారణాలతో తొలిప్రేమ కు గుడ్ బై చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కానీ అప్పటి జ్ఞాపకాలు మదిని గదిలో పదికాలాల పాటు భద్రంగా ఉంటాయని కొన్ని అధ్యయనాల ద్వారా తెలుస్తోంది.

Also Read: Sucess Story: నాడు ఇంటింటికి తిరిగి చీరలు అమ్ముకున్న వ్యక్తి.. నేడు ఏడాదికి 50 కోట్ల టర్నోవర్‌తో బిజినెస్..