AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

LIC Jeewan Amar: ఎల్ఐసి జీవన్ అమర్ పాలసీ..! తక్కువ ప్రీమియంతో ఎక్కువ లాభాలు..

LIC Jeewan Amar: ప్రముఖ ఇన్సూరెన్స్ సంస్థ ఎల్‌ఐసీ వినియోగదారుల కోసం ఎన్నో పాలసీలను ప్రవేశపెట్టింది. ఇందులో పెట్టుబడి

LIC Jeewan Amar: ఎల్ఐసి జీవన్ అమర్ పాలసీ..! తక్కువ ప్రీమియంతో ఎక్కువ లాభాలు..
Lic Jeewan Amar
uppula Raju
|

Updated on: Aug 29, 2021 | 11:48 AM

Share

LIC Jeewan Amar: ప్రముఖ ఇన్సూరెన్స్ సంస్థ ఎల్‌ఐసీ వినియోగదారుల కోసం ఎన్నో పాలసీలను ప్రవేశపెట్టింది. ఇందులో పెట్టుబడి పెట్టడం మంచి నిర్ణయం అవుతుంది. లాభాలు, ప్రయోజనాలు, భద్రత గురించి చూసుకుంటే దేశంలో దీని కంటే మంచి సంస్థ మరొకటి లేదు. చాలామంది LIC ప్లాన్‌లు ఖరీదైనవి వాటిని కొనడం కష్టమని అనుకుంటారు కానీ అది అబద్ధం. ఇందులో అన్ని వర్గాలవారికి సరిపోయే పాలసీలు ఉన్నాయి. తాజాగా LIC జీవన్ అమర్ పాలసీలో మీరు తక్కువ పెట్టుబడి ఎక్కువ ప్రయోజనాలను చూస్తారు. ఆగస్టు 2019లో LIC ఈ పాలసీని ప్రారంభించింది.

ఇది 2 రకాల ప్రయోజనాలను కలిగి ఉంటుంది. మొదటి ప్రయోజన స్థాయి భీమా మొత్తం రెండోది పెరుగుతున్న హామీ మొత్తం. మీరు రెండింటిలో దేనినైనా ఎంచుకోవచ్చు. మీరు ఈ ప్లాన్‌ను LIC ఏజెంట్ ద్వారా తీసుకోవచ్చు. జీవన్ అమర్ ఒక టర్మ్ ప్లాన్ పాలసీ. బీమా మొత్తాన్ని ఒకే మొత్తంలో చెల్లించడానికి లేదా వాయిదాలలో చెల్లించడానికి ఆప్షన్‌ ఇందులో ఉంది. ధూమపానం చేయని మహిళలకు ప్రీమియం మినహాయింపు కూడా ఉంటుంది. ఈ ప్లాన్‌ను 5 సంవత్సరాల, 10 సంవత్సరాల, 15 సంవత్సరాల సులభ వాయిదాలలో చెల్లించవచ్చు. LIC జీవన్ అమర్ ప్లాన్ కింద కనీస హామీ మొత్తం 25 లక్షలు. ఈ ప్లాన్‌లో మీరు రైడర్ ఎంపిక ప్రయోజనాన్ని కూడా పొందవచ్చు.

పాలసీ ఫీచర్లు 1. 18-65 సంవత్సరాల వయస్సు గల వ్యక్తులు మాత్రమే జీవన్ అమర్ ప్లాన్ తీసుకోవచ్చు. 2. పాలసీ వ్యవధి 10 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల వరకు ఉంటుంది. 3. పాలసీ గరిష్ట వయోపరిమితి 80 సంవత్సరాలు. 4. ధూమపానం చేయనివారు, మహిళలు ప్రీమియం నుంచి మినహాయిస్తారు 5. రెగ్యులర్ ప్రీమియం కింద సరెండర్ విలువ అందుబాటులో లేదు. 6. సింగిల్ ప్రీమియంతో కూడా పాలసీ అందుబాటులో ఉంటుంది. 7. అదే సమయంలో కొన్ని నిబంధనలు, షరతులు వర్తిస్తాయి..

ప్రీమియం చెల్లింపు ఎంపికలు 1. జీవన్ అమర్ ప్లాన్‌లో మూడు ప్రీమియం చెల్లింపు ఆప్షన్స్‌ ఇస్తారు 2. సింగిల్ ప్రీమియం, రెగ్యులర్ ప్రీమియం, లిమిటెడ్ ప్రీమియం 3. ప్రీమియం చెల్లించడానికి గరిష్ట వయస్సు 70 సంవత్సరాలు. 4. రెగ్యులర్, లిమిటెడ్ ప్రీమియం ఎంపిక కింద కనీస ప్రీమియం వాయిదా రూ.3000 గా నిర్ణయించారు. 5. సింగిల్ ప్రీమియం ఎంపిక కింద కనీస ప్రీమియం వాయిదాలు రూ.30,000.

Vizag: పెళ్లైన మూడు రోజులకే ప్రెగ్నెంట్ .. కూపీ లాగగా నిజాలు తెలిసి విస్తుపోయిన పోలీసులు

Coronavirus: తీవ్రమైన కరోనా ఇన్ఫెక్షన్ శరీరానికి ఎక్కువ యాంటీ బాడీస్ అందిస్తుంది.. తాజా పరిశోధనల్లో వెల్లడి!

Sucess Story: నాడు ఇంటింటికి తిరిగి చీరలు అమ్ముకున్న వ్యక్తి.. నేడు ఏడాదికి 50 కోట్ల టర్నోవర్‌తో బిజినెస్..