IRCTC: రైల్వే ప్రయాణీకులకు కొత్త రూల్స్.. ఇకపై ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేయాలంటే అది తప్పనిసరి..
మీరు వేరే ఊరు ఎక్కడికైనా టూర్ ప్లాన్ చేసుకున్నారా.? ఐఆర్‌సీటీసీ ద్వారా రైల్వే టికెట్లను బుక్ చేయాలని అనుకుంటున్నారా.? అయితే కొత్తగా..
మీరు వేరే ఊరు ఎక్కడికైనా వెళ్లాలనుకుంటున్నారా.? లేదా ఏదైనా టూర్ ప్లాన్ చేశారా.? ఇందుకోసం ఐఆర్‌సీటీసీ ద్వారా రైల్వే టికెట్లను బుక్ చేయాలని అనుకుంటున్నారా.? అయితే కొత్తగా అమలులోకి వచ్చిన రూల్స్ గురించి తెలుసుకోండి. లేదంటే ఇబ్బంది పడతారు. ఐఆర్‌సీటీసీ కొత్తగా వెరిఫికేషన్ ప్రక్రియను అమల్లోకి తీసుకువచ్చింది. ఈ ప్రక్రియ పూర్తయితేనే ఆన్‌లైన్‌లో టికెట్లను బుక్ చేసుకోవడం సాధ్యపడుతుంది.
IRCTC కొత్త నిబంధన ప్రకారం.. ప్రయాణీకులు ఆన్‌లైన్ ద్వారా రైలు టికెట్లను బుక్ చేయాలనుకుంటే.. తమ మొబైల్ నెంబర్, ఈ-మెయిల్ ఐడీలను ధృవీకరించాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి కాకపోతే.. ఆన్‌లైన్‌లో టికెట్ బుకింగ్ సాధ్యపడదు. ఇక రైల్వే కౌంటర్ల ద్వారా టికెట్లను బుక్ చేసుకున్నవారికి, సాధారణ టికెట్లు తీసుకున్న పాసింజర్స్‌కు ఈ రూల్ వర్తించదు. కేవలం ఈ-టికెట్లను బుక్ చేసుకున్నవారు మాత్రమే ఈ ప్రక్రియను ఖచ్చితంగా పూర్తి చేయాల్సి ఉంటుంది.
IRCTC ద్వారా టికెట్ బుకింగ్ ప్రక్రియ ఎలాగంటే.!
1. మొదటిగా ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి 2. ఆ తర్వాత లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్ ద్వారా సైన్-ఇన్ అవ్వండి 3. మీ మొబైల్ నెంబర్, ఈ-మెయిల్ ఐడీ వెరిఫికేషన్ పూర్తయిన తర్వాతే IRCTC అకౌంట్ లాగిన్ కాగలరు. 4. తద్వారా మీరు సులభంగా మీ గమ్యస్థానానికి టికెట్ బుక్ చేసుకోవచ్చు.