Corona Vaccination: కీలక ప్రకటన.. ఆ సంస్థ ఉద్యోగులకు వ్యాక్సిన్‌ తప్పని సరి.. లేకపోతే జీతంలో రూ.15వేలు కట్‌!

Corona Vaccination: ప్రస్తుతం కరోనా కాలంలో వ్యా్క్సినేషన్‌ తప్పనిసరి అయిపోయింది. ప్రస్తుతం ప్రభుత్వాలు కూడా వ్యాక్సినేషన్‌ ప్రక్రియను వేగవంతం చేసింది. ప్రతి ఒక్కరు..

Corona Vaccination: కీలక ప్రకటన.. ఆ సంస్థ ఉద్యోగులకు వ్యాక్సిన్‌ తప్పని సరి.. లేకపోతే జీతంలో రూ.15వేలు కట్‌!
Follow us
Subhash Goud

|

Updated on: Aug 27, 2021 | 8:49 PM

Corona Vaccination: ప్రస్తుతం కరోనా కాలంలో వ్యాక్సినేషన్‌ తప్పనిసరి అయిపోయింది. ప్రస్తుతం ప్రభుత్వాలు కూడా వ్యాక్సినేషన్‌ ప్రక్రియను వేగవంతం చేసింది. ప్రతి ఒక్కరు కూడా వ్యాక్సిన్‌ తీసుకోవాలని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఇక ప్రైవేటు సంస్థలు కూడా వారివారి ఉద్యోగస్తులకు వ్యాక్సిన్‌ ఇప్పిస్తున్నాయి. మన దేశంలోని ప్రత్యేకమైన వాతావరణ పరిస్థితులు, ప్రజల జీవన విధానం కారణంగా ఈ వైరస్ ఎక్కువ కాలం ఇక్కడ మనుగడ సాగించలేదని అంతా భావించారు. కానీ పరిస్థితి మారింది. వ్యాక్సిన్ వేసుకున్నా కూడా వైరస్ వచ్చే అవకాశం లేకపోలేదని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్న అనేక మంది వైరస్ భారిన పడ్డారు. అయితే.. వ్యాక్సిన్ వేయించుకోని వారితో పోల్చితే వేయించుకున్న వారిలో వైరస్ ప్రభావం చాలా తక్కువగా కనిపించింది. వ్యాక్సిన్ వేయించుకోవడం స్వచ్ఛందమేనని ప్రభుత్వాలు చెబుతున్నా.. అందరూ తప్పనిసరిగా వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రైళ్లల్లో, విమానాల్లో, ఆలయాలలో ఇలా అనేక చోట్ల వ్యాక్సిన్‌ వేయించుకున్న వారికే అనుమతి ఇస్తున్నారు అధికారులు.

అనేక సంస్థలు సైతం తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలని తమ ఉద్యోగులకు స్పష్టం చేస్తున్నాయి. వ్యాక్సిన్ వేయించుకోకపోతే విధుల్లోకి అనుమతించమని స్పష్టం చేస్తుండటంతో చాలా మంది వ్యాక్సి్‌న్‌ వేయించుకుంటున్నారు. ఇక తాజాగా ప్రముఖ డెల్టా ఎయిర్ లైన్స్ ఇలాంటి ఓ ప్రకటన చేసింది. వ్యాక్సిన్ రెండు డోసులను తప్పనిసరిగా తీసుకోవాలని తన ఉద్యోగులకు సూచించింది. ఒక వేళ ఎవరైనా ఉద్యోగులు కోవిడ్ -19 వ్యాక్సిన్ తీసుకోకపోతే నెలకు వేతనంలో నుంచి రూ.15,000 వసూలు చేస్తామని తెలిపింది డెల్టా ఎయిర్ లైన్స్.

వ్యాక్సిన్ వేయించుకోకపోతే జీతంలో రూ.15 వేలు కట్..

సెప్టెంబర్ 30 తర్వాత వ్యాక్సినేషన్ చేయించుకోకుండా ఎవరైనా ఉద్యోగి కనిపిస్తే, అతని జీతం నిలిపివేయబడుతుందని ఎయిర్‌లైన్ స్పష్టం చేసింది. కంపెనీ ఉద్యోగులంతా తప్పకుండా మాస్కు ధరించాలని తెలిపింది.

ఉద్యోగం తొలగింపు..

అలాగే యునైటెడ్ ఎయిర్‌లైన్స్ సైతం తమ ఉద్యోగులకు వ్యాక్సినేషన్ పై కీలక ప్రకటన చేసింది. తమ ఉద్యోగులంతా సెప్టెంబర్ 27 లోపు టీకాలు వేయించుకోవాలని సూచించింది. సెప్టెంబర్ 27 తర్వాత వ్యాక్సిన్ వేయించుకోని ఉద్యోగులపై చర్యలు తప్పవని హెచ్చరించింది. అవసరమైతే ఉద్యోగాలను కూడా తొలగిస్తామని స్పష్టం చేసింది. అయితే.. రానున్న రోజుల్లో దాదాపు అన్ని కంపెనీలు తమ ఉద్యోగులకు వ్యాక్సినేషన్ తప్పనిసరి చేసే అవకాశం ఉంది.

ఇవీ కూడా చదవండి:

విదేశాలకు వెళ్లే వారు కోవిడ్‌-19 సర్టిఫికేట్‌తో పాస్‌పోర్టును లింక్‌ చేసుకున్నారా..? అయితే ఇలా చేయండి..!

SBI ATM: మీరు కొత్త ఏటీఎం కార్డు పొందాలనుకుంటున్నారా..? రెండు నిమిషాల్లోనే దరఖాస్తు చేసుకోండిలా..!