SBI ATM: మీరు కొత్త ఏటీఎం కార్డు పొందాలనుకుంటున్నారా..? రెండు నిమిషాల్లోనే దరఖాస్తు చేసుకోండిలా..!
SBI ATM: ప్రస్తుతం బ్యాంకు ఖాతాలున్న వారికి ఏటీఎం కార్డు ముఖ్యమైనది. ప్రస్తుతమున్న టెక్నాలజీ కారణంగా చాలా మంది బ్యాంకులకు వెళ్లి విత్‌డ్రా చేయడం లేదు. ఏటీఎంల..
SBI ATM: ప్రస్తుతం బ్యాంకు ఖాతాలున్న వారికి ఏటీఎం కార్డు ముఖ్యమైనది. ప్రస్తుతమున్న టెక్నాలజీ కారణంగా చాలా మంది బ్యాంకులకు వెళ్లి విత్‌డ్రా చేయడం లేదు. ఏటీఎంల ద్వారా డబ్బులు డ్రా చేసుకుంటున్నారు. మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)లో ఖాతా ఉండి ఏటీఎం కార్డు లేకపోయినా.. లేక ఉండి కూడా పోగొట్టుకోవడం, విరిగిపోవడం లాంటివి జరిగితే ఎలాంటి టెన్షన్ పడనక్కరలేదు. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో కూడా దరఖాస్తు చేసుకుంటే మీ అడ్రస్‌కు పంపిస్తారు. అలాగే కస్టమర్‌కేర్ నెంబర్‌కు ఫోన్ చేయడం ద్వారా కూడా ఈ పని పూర్తి చేసుకోవచ్చు. మరీ కార్డు లేనివారు, ఒక వేళ పోగొట్టుకున్న కార్డును తిరిగి పొందాలంటే బ్యాంకుకు వెళ్లకుండానే మీరు దరఖాస్తు చేసుకుని తెప్పించుకోవచ్చు. ఈ స్టేప్‌ను అనుసరిస్తే కొత్త కార్డు వచ్చేస్తుంది. కేవలం రెండు నిమిషాల్లోనే దరఖాస్తు చేసుకోవచ్చు.
కార్డు కోసం దరఖాస్తు చేసుకోవడం ఎలా..?
ముందుగా మీరు ఎస్‌బీఐ (SBI) ఇంటర్నెట్ బ్యాంకింగ్ లాగిన్ కావాలి. తర్వాత ఏటీఎం కార్డ్‌కు సంబంధించిన సేవలను ఎంపిక చేసుకోవాలి. రిక్వెస్ట్ ఏటీఎం/డెబిట్ కార్డుపై క్లిక్ చేయాలి. అక్కడ పూర్తి వివరాలు నమోదు చేసిన తర్వాత మీ మొబైల్‌కు ఓటీపీ (OTP) వస్తుంది. తర్వాత ఓటీపీని ఎంటర్ చేయాలి. దీంతో ఖాతాదారుడు ఎస్‌బీఐ ఏటీఎం కార్డు గురించి వివరాలు వస్తాయి. దీంతో కార్డు మీ అడ్రస్‌కు చేరుతుంది. అలాగే మీరు బ్యాంకుకు వెళ్లి కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఇక ఏటీఎం కార్డు కోసం కస్టమర్ కేర్ నెంబర్‌కు ఫోన్ చేసిన కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అంతేకాదు.. మీరు ఎస్‌బీఐ యోనో యాప్ నుంచి కూడా కొత్త ఏటీఎం కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. యాప్‌లో అన్ని ఆన్‌లైన్ సేవలు కనిపిస్తాయి. ఇక్కడ డెబిట్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఏటీఎం/డేబిట్ కార్డు బాక్స్‌పై క్లిక్ చేయాలి. కొత్త ఏటీఎం కార్డు కోసం దరఖాస్తు చేయడానికి మీరు రిక్వెస్ట్ న్యూ/రీప్లేస్‌మెంట్‌పై క్లిక్ చేయాలి. అప్పుడు అవసరమైన వివరాలు నమోదు చేయడం ద్వారా మీరు కార్డు పొందవచ్చు.
కార్డు ఇంటికి రాకపోతే ఏం చేయాలి..?
కొత్త డెబిట్ కార్డు కోసం దరఖాస్తు చేసిన తర్వాత బ్యాంక్ ద్వారా ఇండియా పోస్టు ద్వారా మీ రిజిస్టర్ అడ్రస్‌కు కార్డు పంపిస్తారు. అయితే చిరునామా సరిగ్గా లేకపోవడం లేక దొరక్కపోడం, ఇతర కారణాలతో చాలా సార్లు ఏటీఎం కార్డులు తిరిగి బ్యాంకుకు వెళ్లిపోతాయి. ఒక వేళ మీరు కార్డు పొందకపోతే మీరు బ్యాంకుకు వెళ్లి కూడా కార్డును సులభంగా పొందవచ్చు. ఆ సమయంలో మీరు కేవైసీ పత్రాలు తీసుకెళ్లాల్సి ఉంటుంది.