Veeramachaneni: డయాబెటిక్ డైట్ విషయంలో వీరమాచనేనికి విజ్ఞాన్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్
విజ్ఞాన్ రత్తయ్య డాక్టరేట్ ఇస్తామనగానే ఆయనపై ఉన్న గౌరవంతో.. డాక్టరేట్ తీసుకునేందుకు ఒప్పుకున్నామన్నారు వీరమాచనేని
Veeramachaneni Ramakrishna: విజ్ఞాన్ రత్తయ్య డాక్టరేట్ ఇస్తామనగానే ఆయనపై ఉన్న గౌరవంతో.. డాక్టరేట్ తీసుకునేందుకు ఒప్పుకున్నామన్నారు వీరమాచనేని రామకృష్ణ. గతంలో డాక్టరేట్ ఎంతో మంది ఇస్తామంటే తీసుకోలేదన్నారు. విజ్ఞన్ రత్తయ్య విద్యాసంస్థల ఎనిమిదో స్నాతకోత్సవం సందర్భంగా.. వీరమాచనేని రామకృష్ణకు, సోనమ్ వాగుక్ కు విజ్ఞాన్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్లను ప్రధానం చేసింది. డయాబెటిస్‌కు అలోపతి ద్వారా ఒక్కరికి కూడా తగ్గించలేకపోయారని విఆర్కే డైల్ ద్వారా అనేక మందికి డయాబెటిస్ తగ్గించినట్లు ఈ సందర్భంగా విఆర్ చెప్పారు.
తన బరువు తగ్గించుకోవడానికి స్వయంగా రాసుకున్న.. డైట్ షెడ్యూల్ ద్వారా డయాబెటిస్ తగ్గించవచ్చని రుజువు చేసానన్నారు వీరమాచినేని. తనకు గౌరవ డాక్టరేట్ ఇచ్చినందుకు విజ్ఞాన్ రత్తయ్య అనేక విమర్శలను ఎదుర్కొవాల్సి ఉంటుందని ఆయన ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. కరోనా కోసం వ్యాక్సిన్, వ్యాక్సిన్ అంటూ అందరూ అ బాటే పట్టారని.. చాలా తక్కువ మందికే ఊపిరితిత్తులపై ప్రభావం చూపుతుందని, దాని కోసం మందు కనుక్కుంటే సరిపోతుందన్నారు వీరమాచనేని.
నిజాన్ని ఒప్పుకునే ధైర్యం లేని వాళ్లే .. నాపై విమర్శలు చేస్తారని వీరమాచనేని రామకృష్ణ ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. అమెరికా నుండి అనకాపల్లి వరకూ విఆర్కే డైట్ అనుసరిస్తున్నారన్నారు. తాను ఇప్పటికే అనేక సార్లు ఛాలెంజ్ చేశానని.. ఎవరైనా ఛానల్ లో డిబేట్ పెట్టినా ఇప్పటికీ సిద్దంగా ఉన్నానన్నారు. డాక్టరేట్ గ్రహీత వీరమాచనేని రామకృష్ణ.
Read also: Tank Bund: ఇక మరింత ప్రశాంతంగా, ఆహ్లాదం భరితంగా హైదరాబాద్ ట్యాంక్ బండ్