AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tank Bund: ఇక మరింత ప్రశాంతంగా, ఆహ్లాదం భరితంగా హైదరాబాద్ ట్యాంక్ బండ్

కాస్త ఉల్లాసం కావాలంటే అక్కడికి వెళ్లాళ్సిందే.. సాయంత్రం సేద తీరాలంటే అక్కడ వాలిపోవాల్సిందే.. అలా.. హైదరాబాద్

Tank Bund: ఇక మరింత ప్రశాంతంగా,  ఆహ్లాదం భరితంగా హైదరాబాద్ ట్యాంక్ బండ్
Tank Bund
Venkata Narayana
|

Updated on: Aug 27, 2021 | 8:50 PM

Share

Hyderabad: కాస్త ఉల్లాసం కావాలంటే అక్కడికి వెళ్లాళ్సిందే.. సాయంత్రం సేద తీరాలంటే అక్కడ వాలిపోవాల్సిందే.. అలా.. హైదరాబాద్ అంటే గుర్తొచ్చేది ముఖ్యంగా ట్యాంక్ బండ్. ఆ ట్యాంక్ బండ్ ఇప్పుడు కొత్త అందాలతో మరింత ఆహ్లాదకరంగా కనువిందు చేయనుంది. ఇందులో భాగంగా పర్యాటకుల కోసం ట్యాంక్ బండ్ రోడ్లపై వాహనాల రద్దీ ఉండకుండా చర్యలు తీసుకుంటున్నారు తెలంగాణ పోలీసులు. ఇకపై ఆదివారం నాడు ట్యాంక్ బండ్ మీదగా వెళ్లే వాహనాలను దారి మళ్లించనున్నారు. ఆదివారం సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు ట్యాంక్ బండ్ మీదకి వాహనాల రాకపోకలను నిలిపివేస్తారు.

అలాగే, ట్యాంక్ బండ్ మీదకి వెళ్లే పర్యాటకుల వాహనాలను కూడా బయటే పార్కింగ్ చేసేలా ఏర్పాట్లు చేయనున్నారు. అయితే, దీని వెనుక చిన్న కథే ఉంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే కేటీఆర్ నెటిజన్లకు టచ్‌లో ఉండటం తెలిసిందే. ఆస్క్ కేటీఆర్ అంటూ ప్రశ్నలకు జవాబిచ్చే సందర్భంలో నెటిజన్లతో జరిగిన ఒక సంభాషణ ఒకటి ఆర్డర్‌గా మారిపోయింది. ట్యాంక్ బండ్ సందర్శకులకు వీకెండ్స్‌లో వాహనాల రాకపోకలు అడ్డుగా మారాయని.. అటూ ఇటూ వెళ్లేందుకు ఫ్యామిలీస్‌ ఇబ్బంది పడుతున్నాయని ఓ నెటిజన్ చేసిన ట్వీట్‌కి మంత్రి కేటీఆర్ పాజిటివ్ గా రియాక్ట్ అయ్యారు.

సదరు నెటిజన్ ఇచ్చిన ఐడియాని మెచ్చిన కేటీఆర్ ట్యాంక్‌ బండ్‌పై ఆదివారం సాయంత్రం 5 గంటల నుంచి ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తే బాగుంటుందని.. సాధ్యాసాధ్యాలను పరిశీలించి ప్రణాళిక రూపొందించాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌కి ట్వీట్ చేశారు. ఇక, కేటీఆర్ నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే స్పందించిన హైదరాబాద్ పోలీస్ ట్యాంక్ బండ్‌పై ట్రాఫిక్ ఆంక్షలు విధించేందుకు సిద్ధమయ్యారు. ఆదివారం సాయంత్రం వేళలో సందర్శకులకు ఇబ్బంది కలగకుండా వాహనాల రాకపోకలను నిషేధించనున్నట్లు తెలిపారు.

దీంతో ఆదివారం సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకూ వాహనాలను నిషేధిస్తున్నట్లు కమిషనర్ అంజనీ కుమార్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ వచ్చే ఆదివారం నుంచే ట్యాంక్ బండ్ మీద ట్రాఫిక్ క్రమబద్దీకరణ అమల్లోకి వస్తుంది.

Read also: Kolusu Parthasarathy: జగన్ దెబ్బకు చంద్రబాబు మతిభ్రమించి ఉన్మాదిలా ప్రవర్తిస్తున్నారు: కొలుసు పార్థసారధి