Telangana: యాక్షన్ బట్టి రియాక్షన్.. రేవంత్ vs మల్లారెడ్డి ఎపిసోడ్‌పై కేటీఆర్ హాట్ కామెంట్స్..

Telangana: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వర్సెస్ మంత్రి మల్లారెడ్డి ఇష్యూపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రీ కేటీఆర్ స్పందించారు. ఈ వ్యవహారంపై..

Telangana: యాక్షన్ బట్టి రియాక్షన్.. రేవంత్ vs మల్లారెడ్డి ఎపిసోడ్‌పై కేటీఆర్ హాట్ కామెంట్స్..
Ktr
Follow us
Shiva Prajapati

|

Updated on: Aug 27, 2021 | 7:27 PM

Telangana: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వర్సెస్ మంత్రి మల్లారెడ్డి ఇష్యూపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రీ కేటీఆర్ స్పందించారు. ఈ వ్యవహారంపై హాట్ హాట్ కామెంట్స్ చేశారు. శుక్రవారం నాడు తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన కేటీఆర్.. కొందరు వ్యక్తులు గత ఏడేళ్ల నుంచి తమ నాయకుడు కేసీఆర్‌పై నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి అని కూడా ఆలోచించకుండా బట్టేబాజ్ అని, ఏవేవో పరుష వ్యాఖ్యలు చేస్తున్నారని నిప్పులు చెరిగారు. వారి మాటలు హద్దులు దాటడంతోనే మంత్రి మల్లారెడ్డి స్పందించారని అన్నారు. అవతలి వ్యక్తుల మాటలను బట్టే మల్లారెడ్డి రియాక్ట్ అయ్యారని, యాక్షన్ ను బట్టి రియాక్షన్ ఉంటుందని ఉద్ఘాటించారు.

ఇదే సమయంలో రేవంత్ రెడ్డిపై మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. డబ్బుల సంచులతో పట్టుబడిన వ్యక్తిని పార్టీకి అధ్యక్షుడు చేశారు.. ఆయన మాట తీరు ఎలా ఉందో ఆయన్ను ఎందుకు ప్రశ్నంచరని అన్నారు. మంత్రి మల్లారెడ్డి వయసుకు కూడా గౌరవం ఇవ్వకుండా చెత్త మాటలు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. ‘‘ఈ చిలక మనదే.. పలుకులు మాత్రం వేరే వ్యక్తివి. కాంగ్రెస్ పార్టీని చంద్రబాబు తీసేసుకున్నాడు.’’ అంటూ రేవంత్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. మంత్రి మల్లారెడ్డి సవాల్‌పై రేవంత్ రెడ్డి స్పందించాలన్నారు. రేవంత్ రెడ్డికి నిజంగా దమ్ముంటే రాజీనామా చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

మహారాష్ట్రలో ముఖ్యమంత్రిని దూషించిన కేంద్ర మంత్రిని జైల్లో వేశారని, తాము కూడా అలాగే చెయ్యాలా? అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. నోరు ఉంది కదా అని ఎలా పడితే అలా మాట్లాడుతున్నారని, ఇక సహించేది లేదని స్పష్టంచేశారు. ఓపిక ఓపిక అని అనుకుంటూ ఏడేళ్లుగా ఓపిక పడుతున్నామని, ఇకపై నోటికి వచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమని అన్నారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ తీరును కూడా తూర్పారబట్టారు మంత్రి కేటీఆర్. ప్రజలు సుభిక్షంగా ఉంటే విపక్షాలకు ఏం రోగం అంటూ ఘాటైన వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. ‘‘బండి సంజయ్‌ ఏం బాధ వచ్చిందని యాత్ర చేస్తున్నావ్.. ప్రజలకు చెప్పు.. పెట్రోల్ ధర పెరిగిందని పాదయాత్ర చేస్తున్నావా?.. దేశ ఆస్తులను అమ్మడానికి యాత్ర చేస్తున్నావా? సిగ్గులేకుండా యాత్రం చేస్తున్నావు. ప్రజా సంగ్రామ యాత్ర దేనికోసం? దేశ జీడీపీ బంగ్లాదేశ్ జీడీపీ కంటే తక్కువకు పడిపోయింది అని చెప్పడానికి యాత్ర చేస్తున్నావా? యాత్రలో భాగంగా ప్రభుత్వ ఆస్తులను గుర్తించి కేంద్రం చే అమ్మించడానికి ప్రయత్నిస్తున్నావా? బండి సంజయ్‌ని అడుగుతున్నాను. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ప్రధాని చెప్పాడు దానికి సమాధానం చెప్పు. ఏం మొహం పెట్టుకుని ప్రజల్లోకి వెళ్తున్నారు. ఊరు ఊరు తిరిగి మేం చేసిన అభివృద్ధిని చూడు సంజయ్. ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పు. నీ యాత్రలో భాగంగా ఏడేళ్లలో తెలంగాణకు ఏం చేశావో చెప్పు.. నీ పార్టీకి ఎందుకు ఓటు వేయాలో చెప్పు.’’ అంటూ తనదైన శైలిలో దుమ్ము దులిపేశారు.

KTR Twitter:

Also read:

Ap Corona Cases: ఏపీలో స్వల్పంగా తగ్గిన కరోనా పాజిటివ్ కేసులు.. ఆ జిల్లాలో మాత్రం ఇప్పటికీ..

Crime News: కట్నపు జ్వాలలో సమిధై పోయిన నవ వధువు.. పూర్తి వివరాలు తెలిస్తే గుండె రగిలిపోవడం ఖాయం..

Telangana News: వెంచర్ కోసం కొట్లాట.. అమ్మలేదని ఒకరు.. కొనుగోలు చేశామని మరొకరు.. పూర్తి వివరాలు మీకోసం..