Telangana News: వెంచర్ కోసం కొట్లాట.. అమ్మలేదని ఒకరు.. కొనుగోలు చేశామని మరొకరు.. పూర్తి వివరాలు మీకోసం..
Telangana News: మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల పట్టణ శివారులోని ఓ వెంచర్‌లో ప్లాట్లు కొన్న యజమానులకు.. పూర్వపు భూ యజమానులకు మధ్య ఘర్షణ జరిగింది.
Telangana News: మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల పట్టణ శివారులోని ఓ వెంచర్‌లో ప్లాట్లు కొన్న యజమానులకు.. పూర్వపు భూ యజమానులకు మధ్య ఘర్షణ జరిగింది. ఒకరిపై మరొకరు దాడులకు పాల్పడ్డారు. ప్లాట్ల కొనుగోలు చేసిన వారు, గతంలో అదే భూమిని విక్రయించిన కుటుంబ సభ్యులు పరస్పరం దాడులకు దిగారు. పోలీసులు పక్కనే ఉన్నా.. పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకెళితే.. జడ్చర్ల పట్టణ శివారులో మహబూబ్ నగర్ రోడ్డుకు సమీపంలో ఉన్న 67 ఎకరాల్లో 1990లో మూడు వేంచర్లు ఏర్పాటు చేశారు. 1,460 ప్లాట్లను విక్రయించడంతో 1996లో ప్లాట్లు కొనుగోలు చేసిన వారికి రిజిష్ట్రేషన్లు కూడా చేశారు. ఆ తర్వాత భూముల ధరలు పెరగడంతో ఆ భూమి తాము విక్రయించలేదంటూ భూమి యజమానులు వ్యవసాయం చేయడం మొదలుపెట్టారు.
దీంతో ప్లాట్లు కొనుగోలు చేసిన వారు కోర్టును ఆశ్రయించారు. కోర్టు తీర్పు ప్లాట్ల యజమానులకు అనుకూలంగా వచ్చింది. తాము కొనుగోలు చేసిన ప్లాట్లను పోలీసుల సహాయంతో తమ ఆధీనంలోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. గత మూడు రోజులుగా ఈ ప్లాట్లకు సంబంధించి గొడవలు జరిగుతున్నాయి. ఈ రోజు పోలీసుల సహాయంతో వెంచర్ నిర్వాహకులు.. వెంచర్ వద్దకు వెళ్లడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. ఈ దాడిలో ఆరుగురికి గాయాలయ్యాయి. ఓ జేసీబీ సహా నాలుగు ద్విచక్ర వాహనాలు ధ్వంసం అయ్యాయి. ఘర్షణ నివారించేందుకు పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Also read:
Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవిని ఫిదా చేసిన వీరాభిమాని.. అతను కోరడమే ఆలస్యం..
Afghanistan Crisis: కాబుల్ విమానాశ్రయంలో పెలుళ్లు.. 110 కి చేరిన మృతుల సంఖ్య..