Ap Corona Cases: ఏపీలో స్వల్పంగా తగ్గిన కరోనా పాజిటివ్ కేసులు.. ఆ జిల్లాలో మాత్రం ఇప్పటికీ..
Ap Corona Updates: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. కరోనా కట్టడికి లాక్‌డౌన్, వ్యాక్సినేషన్ ప్రక్రియ అమలు చేయడం వల్ల కరోనా..
Ap Corona Updates: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. కరోనా కట్టడికి లాక్‌డౌన్, వ్యాక్సినేషన్ ప్రక్రియ అమలు చేయడం వల్ల కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. తాజాగా రోజూ వారీగా నమోదవుతున్న పాజిటివ్ కేసుల సంఖ్య నిన్నటితో పోలిస్తే కొంత తగ్గాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 68,865 సాంపిల్స్ సేకరించి పరీక్షించగా.. వీరిలో 1,515 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. గురువారం నాడు 1,539 కేసులు నమోదు అయ్యాయి. అంటే నిన్నటి కంటే ఇవాళ 24 కేసులు తగ్గాయి. తాజాగా నమోదైన కేసుల్లో అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 223 కేసులు నమోదు అయ్యాయి. దాంతో ఆ జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. కరోనాను కట్టడి చేసేందుకు అవసరమైన చర్యలను మరింత పటిష్టంగా అమలు చేస్తున్నారు.
ఇక రికవరీల సంఖ్య నిన్నటి కంటే ఇవాళ కొంచె తగ్గాయి. గురువారం నాడు 1,140 మంది రికవరీ అవగా.. ఇవాళ 903 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కరోనా ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 10 మంది చనిపోగా.. వీరిలో చిత్తూరు జిల్లాకు చెందిన వారు ముగ్గురు, కృష్ణా జిల్లాకు చెందిన వారు ముగ్గురు, తూర్పుగోదావరి, కర్నూలు, నెల్లూరు, శ్రీకాకుళం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 15,050 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
మొత్తంగా ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు వివరాలు ఇలా ఉన్నాయి. ఏపీలో ఇప్పటి వరకు 20,09,245 మంది కరోనా బారిన పడ్డారు. వీరిలో 19,80,407 మంది కోలుకున్నారు. తాజాగా మరణాలతో కలిపి ఇప్పటి వరకు రాష్ట్రంలో 13,788 ప్రాణాలు కోల్పోయారు.
అయితే, ఏపీలో కరోనా కేసులు ఇలా ఉంటే.. దేశ వ్యాప్తంగా మరోసారి కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజూవారీగా నమోదవుతున్న పాజిటివ్ కేసుల సంఖ్య ఊహించని రీతిలో మళ్లీ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. అత్యవసరం అయితే తప్ప ప్రజలెవరూ అనవసరంగా ఇళ్ల నుంచి బయటకు రావొద్దని వార్నింగ్ ఇస్తున్నారు. ఒకవేళ వెళ్లినా.. తప్పకుండా మాస్క్ ధరించాలని, భౌతిక దూరం పాటించాలని సూచించారు. కరోనా నివారణకు ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇకపోతే.. కరోనా కట్టడికై వ్యాక్సినేషన్ ప్రక్రియను ఏపీ సర్కార్ ముమ్మరం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 7.5 మిలియన్ల మందికి వ్యాక్సినేషన్ పూర్తి చేసింది. రోజూవారీగా వేసే వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత ఉధృతం చేసింది. అధికారులు అందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నారు. వ్యాక్సీన్ వేయించుకునేలా ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు.
#COVIDUpdates: 27/08/2021, 10:00 AM రాష్ట్రం లోని నమోదైన మొత్తం 20,06,350 పాజిటివ్ కేసు లకు గాను *19,77,512 మంది డిశ్చార్జ్ కాగా *13,788 మంది మరణించారు * ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 15,050#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/cUDAEPg92t
— ArogyaAndhra (@ArogyaAndhra) August 27, 2021
Also read:
Crime News: కట్నపు జ్వాలలో సమిధై పోయిన నవ వధువు.. పూర్తి వివరాలు తెలిస్తే గుండె రగిలిపోవడం ఖాయం..
Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవిని ఫిదా చేసిన వీరాభిమాని.. అతను కోరడమే ఆలస్యం..