Hyderabad: ఓయూలో లెక్చరర్ పోస్టులు.. బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీలో ప్రవేశాలు..

Hyderabad: ఉస్మానియా యూనివ‌ర్సిటీ ఆర్ట్స్ కాలేజీలోని పబ్లిక్ అడ్మినిస్ట్రేష‌న్ విభాగం‌లో పార్ట్‌టైమ్ లెక్చరర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

Hyderabad: ఓయూలో లెక్చరర్ పోస్టులు.. బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీలో ప్రవేశాలు..
Osmania University
Follow us
Shiva Prajapati

|

Updated on: Aug 27, 2021 | 9:49 PM

Hyderabad: ఉస్మానియా యూనివ‌ర్సిటీ ఆర్ట్స్ కాలేజీలోని పబ్లిక్ అడ్మినిస్ట్రేష‌న్ విభాగం‌లో పార్ట్‌టైమ్ లెక్చరర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ మేరకు ఓయూ పాలకవర్గం నోటిఫికేషన్ విడుదల చేసింది. పబ్లిక్ అడ్మినిస్ట్రేష‌న్ విభాగం‌లో రెండు పోస్టులు ఖాళీగా ఉన్నాయ‌ని, అర్హులైన అభ్యర్థులు సెప్టెంబ‌ర్ 10వ తేదీ సాయంత్రం 5 గంట‌ల లోపు ఆర్ట్స్ క‌ళాశాల‌లోని ప‌బ్లిక్ అడ్మినిస్ట్రేష‌న్ డిపార్ట్‌మెంట్‌లో ద‌ర‌ఖాస్తుల‌ను స‌మ‌ర్పించాల‌న్నారు. ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఎంఏతో పాటు పీహెచ్‌డీ చేసి ఉండాలని అధికారులు స్పస్టం చేశారు. అలాగే నెట్, సెట్ తప్పనిసరిగా ఉత్తీర్ణత సాధించాలని పేర్కొన్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేయనున్నట్లు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.

డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ప్రవేశాలు.. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ, పీజీ ప్రవేశాల గడువును పెంచారు. డిగ్రీ(బీఏ, బీకామ్, బీఎస్సీ)తో పాటు.. పీజీ(బీఎల్ఐఎస్‌సీ, డిప్లోమా) కోర్సుల్లో చేరడానికి గడువును సెప్టెంబర్ 3వ తేదీ వరకు పొడిగించినట్లు అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ ప్రవేశాలకు సంబంధించిన పూర్తి సమాచారం కోసం అభ్యర్థులు యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు.

ఓపెన్‌ ఎస్‌ఎస్‌ఎస్సీ, ఇంటర్‌కు దరఖాస్తుల ఆహ్వానం.. తెలంగాణ ఓపెన్‌ స్కూల్‌ సొసైటీ ఆధ్వర్యంలో ఎస్‌ఎస్‌ఎస్సీ, ఇంటర్మీడియట్‌ అడ్మిషన్లు పొందేందుకు నోటిపికేషన్‌ విడుదల అయ్యింది. 2020-21 సంవత్సరానికి గాను అడ్మిషన్స్ స్వీకరిస్తున్నట్లు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. 14 సంవత్సరాల వయస్సు నిండిన వారు ఎలాంటి విద్యార్హత లేకుండా నేరుగా పదో తరగతి అడ్మిషన్‌ తీసుకోవచ్చునని అన్నారు. నవంబర్‌ 10వ తేదీ వరకు అడ్మిషన్స్ స్వీకరించడం జరుగుతుందని పేర్కొన్నారు. అదే విధంగా పదో తరగతి ఉత్తీర్ణత సాదించిన వారు ఇంటర్మీడియట్‌లో అడ్మిషన్‌ పొందవచ్చునని తెలిపారు. మరిన్ని వివరాలకు 9441477877, 7013551740 నంబర్లలను సంప్రదించాలని సూచించారు.

Also read:

Pakistan : అత్యాచారాలు జరిగేది దానివల్లే.. పాక్ ప్రధాని విచిత్ర విశ్లేషణ.. సోషల్ మీడియాలో మాత్రం..

Andhra Pradesh: అంతా ఆ బియ్యం వల్లే అంటున్న జనాలు.. అదేం లేదంటున్న అధికారులు.. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే..

Telangana: యాక్షన్ బట్టి రియాక్షన్.. రేవంత్ vs మల్లారెడ్డి ఎపిసోడ్‌పై కేటీఆర్ హాట్ కామెంట్స్..

ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?