Pakistan : అత్యాచారాలు జరిగేది దానివల్లే.. పాక్ ప్రధాని విచిత్ర విశ్లేషణ.. సోషల్ మీడియాలో మాత్రం..

Pakistan Prime Minister: పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మళ్లీ నోరు జారారు. మహిళలపై జరుగుతున్న అత్యాచారలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

Pakistan : అత్యాచారాలు జరిగేది దానివల్లే.. పాక్ ప్రధాని విచిత్ర విశ్లేషణ.. సోషల్ మీడియాలో మాత్రం..
Pak Pm Imran
Follow us
Shiva Prajapati

|

Updated on: Aug 27, 2021 | 9:31 PM

Pakistan Prime Minister: పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మళ్లీ నోరు జారారు. మహిళలపై జరుగుతున్న అత్యాచారలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బాధితులనే నిందితులుగా అర్థం వచ్చేలా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. లైంగిక వేధింపులకు, మొబైల్ ఫోన్‌ల వినియోగానికి ముడిపెడుతూ అర్థంలేని విశ్లేషణ చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పాకిస్తాన్ వ్యాప్తంగా తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మరి ఇంతకీ ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలేంటో ఇప్పుడు చూద్దాం.

తాజాగా లాహోర్‌లో పంజాబ్ ఎడ్యూకేషన్ కన్వెన్షన్‌లో ప్రసంగించిన పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్.. లైంగిక వేధింపులకు కారణం మొబైల్ ఫోన్‌ల దుర్వినియోగమే అని తేల్చారు. లాహోర్‌లోని మినార్-ఇ-పాకిస్తాన్‌లో ఒక టిక్‌టాక్ యూజర్‌‌పై ఓ సమూహం లైంగిక వేధింపులకు గురిచేసిన కొన్ని రోజుల తరువాత ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం అక్కడ సంచలనంగా మారింది. ‘‘మొబైల్ ఫోన్ల దుర్వినియోగం కారణంగానే లైంగిక నేరాలు పెరుగుతున్నాయి. మానవ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ప్రస్తుతం పిల్లలు సైతం సెల్‌ఫోన్లను వినియోగిస్తున్నారు. ఈ సమస్యను పరిష్కరించడానికి ఒక విధానం అవసరం. విద్యలో టెక్నాలజీ అవసరం.. అదే సమయంలో యువత మహ్మద్ ప్రవక్త చెప్పిన విషయాలై మరింత అవగాహన పెంచుకోవాలి. దాని కారణంగా వ్యక్తుల వ్యక్తిత్వ వికాసం అభివృద్ధి చెందుతుంది. ఇలాంటి సమస్యలు ఉత్పన్నమవకుండా ఉంటాయి.’’ అని పేర్కొన్నారు.

అయితే, ఈ వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం అయ్యాయి. ప్రధాని స్థాయిలో ఉండి మహిళలను కించపరిచేలా మాట్లాడుతారా? అంటూ పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇమ్రాన్ వ్యాఖ్యలకు మద్ధతు ప్రకటించే వారు కూడా ఉన్నారు. చాలా మంది ఇమ్రాన్ వ్యాఖ్యల్లో తప్పేముంది అని ప్రశ్నిస్తున్నారు. ఆయన చెప్పింది సరైనదే అని అంటున్నారు. టెక్నాలజీని సరిగ్గా ఉపయోగించుకుంటే ఇలాంటి అనార్థాలు ఉండవన్నారు.

విమర్శలు, మద్దతులు.. ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యలకు సోషల్ మీడియాలో విమర్శలు, మద్దతు రెండూ లభిస్తున్నాయి. ‘ఇమ్రాన్ వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయి. సెక్స్ నేరాలకు కఠినమైన చట్టం, చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ నేరాలకు పాల్పడే వారికి విధించే శిక్షలు చాలా కఠినంగా ఉండాలి. ఎవరైనా ఇలాంటి నేరాలకు పాల్పడాలంటే ఒకటికి వందసార్లు ఆలోచించేలా ఈ శిక్షలు ఉండాలి.’ అని ఓ నెటిజన్ కామెంట్ చేశారు. అసలు దాడి చేసేవారిని శిక్షించాలని ప్రధాని ఇమ్రాన్ ఎప్పుడైనా ఆలోచించారా? అని మరొకరు ప్రశ్నించారు. ఇదిలాఉంటే.. ఇమ్రాన్‌కు కొందరు బాసటగా నిలిచారు. పీఎం చెప్పినదాంట్లో తప్పేం ఉందని ప్రశ్నించారు. మొబైల్ దుర్వినియోగం వల్ల జరిగే దుష్పరిణామాలను మాత్రమే ఆయన చెప్పారని అన్నారు. ఈ సమస్య దాదాపు ప్రతీ దేశంలో ఉందని, ఓ భారతీయ యూజర్ ఇమ్రాన్‌కు మద్దకు ప్రకటించాడు.

ఇలాంటి వ్యాఖ్యలు ఇమ్రాన్‌కు కొత్తేం కాదు.. పాక్ ప్రధాని ఇమ్రాన్‌కు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇదే తొలిసారి కాదు. బాధితులను రక్షించడానికి బదులుగా నిందించేలా కామెంట్స్ చేయడం ఆయనకు పరిపాటి. గత జూన్ నెలలో అత్యాచారం జరగడానికి మహిళలు ధరించే దుస్తులే కారణం అని కామెంట్స్ చేశారు. పురుషులు రోబోలు కాదని, మహిళలు ధరించే దుస్తులు వారిని ప్రభావానికి గురి చేస్తాయని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు అప్పట్లో పెను దుమారం రేపాయి. మహిళ సంఘాల నేతలు ఆయన వ్యాఖ్యలను ఖండించాయి. దాంతో.. నెల రోజుల తరువాత తన వ్యా్ఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు ఇమ్రాన్ ఖాన్ ప్రకటించారు. ఇక అంతకు ముందు.. అత్యాచారానికి పాల్పడిన వారే బాధితులు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్‌లో లైంగిక వేధింపులు పెరగడానికి, విడాకుల రేటు పెరగడానికి ప్రధాన కారణం బాలీవుడ్, హాలీవుడ్ సినిమాలే కారణం అని మరో సందర్భంలో అన్నారు. అసభ్యకరమైన సమాజంలో ఇలాంటి నేరాలు సహజమేనని కూడా కామెంట్స్ చేశాడు. అయితే, ఇమ్రాన్ చేసిన వరుస కామెంట్స్‌పై ఆయన మాజీ భార్య, బ్రిటీష్ స్క్రీన్ రైటర్ జెమీమా గోల్డ్ స్మిత్ తీవ్రంగా స్పందించారు. ఆయన వ్యాఖ్యలను ఖండించారు. బాధ్యత గల పురుషులు ఇలాంటి చెత్త కామెంట్స్ చేయరని ఘాటుగా స్పందించారు.

Also read:

Andhra Pradesh: అంతా ఆ బియ్యం వల్లే అంటున్న జనాలు.. అదేం లేదంటున్న అధికారులు.. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే..

Telangana: యాక్షన్ బట్టి రియాక్షన్.. రేవంత్ vs మల్లారెడ్డి ఎపిసోడ్‌పై కేటీఆర్ హాట్ కామెంట్స్..

Ap Corona Cases: ఏపీలో స్వల్పంగా తగ్గిన కరోనా పాజిటివ్ కేసులు.. ఆ జిల్లాలో మాత్రం ఇప్పటికీ..