Andhra Pradesh: అంతా ఆ బియ్యం వల్లే అంటున్న జనాలు.. అదేం లేదంటున్న అధికారులు.. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే..
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా కుప్పంలో ప్లాస్టిక్ బియ్యం కలకలం రేపింది. ఎన్టీఆర్ కాలనీలో ప్లాస్టిక్ బియ్యం సరఫరా చేశారని స్థానికులు ఆరోపించారు.
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా కుప్పంలో ప్లాస్టిక్ బియ్యం కలకలం రేపింది. ఎన్టీఆర్ కాలనీలో ప్లాస్టిక్ బియ్యం సరఫరా చేశారని స్థానికులు ఆరోపించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మద్యాహ్న భోజనాన్ని ప్లాస్టిక్ బియ్యంతో వండి వడ్డించారని ఆరోపించారు. ప్లాస్టిక్ బియ్యం తినడం కారణంగానే.. తమ పిల్లలు కడుపు నొప్పితో బాధ పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కారణంగానే.. పిల్లలకు వాంతులు, విరేచనాలు అవుతున్నాయంటున్నారు.
తమ ఆరోపణలను నిరూపించేందుకు.. ప్లాస్టిక్ బియ్యం నీళ్లల్లో తేలుతున్నాయని, నిప్పు పెడితే కర్పూరంలా కాలుతున్నాయని డెమో చేసి చూపుతున్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా తమ పిల్లలు అనారోగ్యానికి గురవుతున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు.. ప్రభుత్వ రేషన్ దుకాణాల్లో ఈనెల సరఫరా చేస్తున్న బియ్యంలో ప్లాస్టిక్ బియ్యం కలిసిందని కుప్పం వాసులు ఆరోపిస్తున్నారు. ఈ బియ్యం తినడం వల్లే అనారోగ్యానికి గురవుతున్నామని చెబుతున్నారు
ఇదిలాఉంటే.. ప్లాస్టిక్ బియ్యం ఆరోపణలపై జిల్లా అధికారయంత్రాంగం స్పందించింది. ప్లాస్టిక్ బియ్యం సరఫరా అయ్యే అవకాశమే లేదని స్పష్టం చేశారు జిల్లా ఆహార భద్రత అధికారులు. ఇది కేవలం అపోహ మాత్రమే అని కొట్టిపారేశారు. బలవర్థకమైన బియ్యాన్ని ప్రభుత్వం సరఫరా చేస్తోందన్నారు. నీళ్లలో బియ్యం తేలితే.. ఆ బియ్యం ప్లాస్టిక్ అనుకోవడం అపోహ మాత్రమే అని క్లారిటీ ఇచ్చారు. మైక్రో మినరల్స్ కలిపి బియ్యం సరఫరా జరుగుతోందని, దీనిపై ప్రజల్లో అవగాహన కల్పిస్తామని చిత్తూరు జిల్లా ఆహార భద్రతా అధికారులు తెలిపారు.
Also read:
Telangana: యాక్షన్ బట్టి రియాక్షన్.. రేవంత్ vs మల్లారెడ్డి ఎపిసోడ్‌పై కేటీఆర్ హాట్ కామెంట్స్..
Ap Corona Cases: ఏపీలో స్వల్పంగా తగ్గిన కరోనా పాజిటివ్ కేసులు.. ఆ జిల్లాలో మాత్రం ఇప్పటికీ..
Crime News: కట్నపు జ్వాలలో సమిధై పోయిన నవ వధువు.. పూర్తి వివరాలు తెలిస్తే గుండె రగిలిపోవడం ఖాయం..