AP Jobs: ఏపీ ప్రభుత్వ విభాగంలో ఉద్యోగాలు.. 13 జిల్లాల్లో 70 ఉద్యోగ పోస్టులకు నోటిఫికేషన్.. పూర్తి వివరాలు!
AP Jobs: ఏపీ ప్రభుత్వానికి చెందిన నేషనల్ హెల్త్ మిషన్ డైరెక్టర్ కార్యాలయం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 13 జిల్లాలోని 14 టెలీ మెడిసిన్ హబ్స్‌లో కాంటాక్ట్ ప్రాతిపదికన 70 పోస్టుల..
AP Jobs: ఏపీ ప్రభుత్వానికి చెందిన నేషనల్ హెల్త్ మిషన్ డైరెక్టర్ కార్యాలయం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 13 జిల్లాలోని 14 టెలీ మెడిసిన్ హబ్స్‌లో కాంటాక్ట్ ప్రాతిపదికన 70 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఈ-మెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. సెప్టెంబర్ 6 దరఖాస్తులకు చివరితేది. అభ్యర్థులు పూర్తి వివరాలకు https://hmfw.ap.gov.in/ వెబ్‌సైట్ చూడొచ్చు.
మొత్తం ఖాళీలు: 70 పీడియాట్రీషియన్ – 14 గైనకాలజిస్ట్ – 14 మెడికల్ ఆఫీసర్లు – 28 జనరల్ ఫిజీషియన్ – 14
విద్యార్హత: పోస్టులను బట్టి ఎంబీబీఎస్, సంబంధిత స్పెషలైజేషన్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ/ డిప్లొమా ఉత్తీర్ణత ఉండాలి. అలాగే ఎపీఎంసీలో రిజిస్టరై ఉండాలి. వయసు: పోస్టులను బట్టి 18 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: స్పెషలిస్ట్ పోస్టులకు నెలకు రూ. లక్ష, మెడికల్ ఆఫీసర్ పోస్టులకు నెలకు రూ.53 వేలు చెల్లిస్తారు.
ఎంపిక ప్రక్రియ: అర్హత పరీక్షలో సాధించిన మెరిట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఈ-మెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఈ-మెయిల్: spmuaprect@gmail.com దరఖాస్తులకు చివరితేది: సెప్టెంబర్ 6, 2021 వెబ్‌సైట్: