AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Education Summit: గుడ్ న్యూస్: రేపటి నుంచే టీవీ9-KAB ఎడ్యుకేషన్‌ సమ్మిట్‌

హైదరాబాద్‌లోని నిజాం కాలేజ్ గ్రౌండ్స్‌లో శనివారం నుంచి టీవీ9-KAB ఎడ్యుకేషన్‌ సమ్మిట్‌ షురూ కాబోతోంది. మూడు రోజుల పాటు

Education Summit: గుడ్ న్యూస్: రేపటి నుంచే టీవీ9-KAB ఎడ్యుకేషన్‌ సమ్మిట్‌
Tv9 Cab
Venkata Narayana
|

Updated on: Aug 27, 2021 | 6:18 PM

Share

Tv9-KAB – Education summit – Hyderabad: హైదరాబాద్‌లోని నిజాం కాలేజ్ గ్రౌండ్స్‌లో రేపటి (శనివారం) నుంచి టీవీ9-KAB ఎడ్యుకేషన్‌ సమ్మిట్‌ షురూ కాబోతోంది. మూడు రోజుల పాటు కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ఈ సమ్మిట్ జరుగుతుంది. టీవీ9-KAB సంయుక్తంగా ప్రతి ఏడాది విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు దిశానిర్దేశం చేసేందుకు ఎడ్యుకేషన్‌ సమ్మిట్‌ నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లోని నిజాం కాలేజ్ గ్రౌండ్స్‌లో రేపటి నుంచి జరిగే ఈ సదస్సులొ  విద్య, ఉద్యోగ సమాచారానికి సంబంధించి విద్యార్థులు, తల్లిదండ్రులకున్న డౌట్లన్నీ అల్‌క్లియర్‌ ఎట్ వన్‌ ప్లేస్ ఈ సమ్మిట్ ప్రత్యేకత.

ఈ ఏడాది కరోనా పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని.. ఎవరికీ, ఎలాంటి ఇబ్బంది రాకుండా సదస్సు నిర్వహణ ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు ఉదయం 9 గంటలకు తెలంగాణ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరుగుతుంది. టీవీ9, KAB సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ సమ్మిట్‌లో 100 పైగా విద్యా సంస్థలు స్టాల్స్‌ ఏర్పాటు చేస్తున్నాయి. KL యూనివర్సిటీ ప్రధాన స్వాన్సరర్‌గా వ్యవహరిస్తోంది. మూడు రోజులు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు జరుగుతుంది.

హయ్యర్ ఎడ్యుకేషన్‌కి ఎలాంటి కోర్సులు చేయాలి..? ఏ రంగానికి ఉజ్వల భవిష్యత్ ఉంటుంది..? టార్గెట్‌ను రీచ్ అవ్వాలంటే ఏం చేయాలి.. ప్రిపరేషన్ ఎలా ఉండాలి..? ఇలా సందేహం ఏదైనా ఎక్స్‌పర్ట్స్‌ సమాధానం ఇస్తారు. ప్రవేశం ఉచితం. కౌన్సెలింగ్ కూడా ఫ్రీ. కాగా, రెండేళ్లుగా కరోనా పరిస్థితుల కారణంగా విద్యారంగం అస్తవ్యస్తమైంది. చదువులు అంతంతమాత్రంగా సాగాయి. కరోనా ఎన్నాళ్లుంటుందో.. ఎప్పుడు ఎండ్‌కార్డ్ పడుతుందో తెలీని పరిస్థితులు దాపురించాయి.

కరోనా ప్రభావం కొనసాగుతోన్నప్పటికీ చదువుల్ని నిర్లక్ష్యం చేయకూడదు. దీంతో.. విద్యార్థుల్లో, తల్లిదండ్రుల్లో ఎంతో కన్ఫ్యూజన్, మరెన్నో అనుమానాలు. ఈ నేపథ్యంలో అన్నింటినీ క్లియర్‌చేసి భవిష్యత్‌ మార్గనిర్దేశనం చేసేందుకు టీవీ9-KAB ఎడ్యుకేషన్ సమ్మిట్ ఏర్పాటు చేశారు. గత 14 ఏళ్లుగా ప్రతి ఏటా ఈ సమ్మిట్ జరుగుతూ గ్రాండ్ సక్సెస్‌ అవుతోంది. అదే జోష్‌తో ఈసారి టీవీ9-KAB సమ్మిట్‌కు ఏర్పాట్లు గ్రాండ్‌గా పూర్తయ్యాయి. ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోండి.

Read also: TRS: జెండా పండుగ నాడు ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయ భూమి పూజ, 2వ తేదీ నుంచి అన్ని సంస్థాగత కమిటీల ఏర్పాటు ప్రక్రియ: కేటీఆర్

Follow Us
అయ్యో దేవుడా.. టెన్త్ పరీక్ష రాసి ఇంటికెళ్లిన విద్యార్థి.. మరుసటి
అయ్యో దేవుడా.. టెన్త్ పరీక్ష రాసి ఇంటికెళ్లిన విద్యార్థి.. మరుసటి
గ్యాస్ బుకింగ్ పేరుతో మెసేజ్‌లు వచ్చాయా..జాగ్రత్త.. క్లిక్ చేశారో
గ్యాస్ బుకింగ్ పేరుతో మెసేజ్‌లు వచ్చాయా..జాగ్రత్త.. క్లిక్ చేశారో
నిద్ర పట్టడం లేదా.. మీ మెదడులో ఏం జరుగుతుందో తెలుసా?
నిద్ర పట్టడం లేదా.. మీ మెదడులో ఏం జరుగుతుందో తెలుసా?
పునరుజ్జీవంపై రాజకీయ యుద్ధం! మూసీ రివర్‌ ఫ్రంట్ ప్రాజెక్ట్‌తో..
పునరుజ్జీవంపై రాజకీయ యుద్ధం! మూసీ రివర్‌ ఫ్రంట్ ప్రాజెక్ట్‌తో..
మీ అమ్మాయి జుట్టు ఒత్తుగా బలంగా పెరగాలా.. ఇదొక్కటి చాలు
మీ అమ్మాయి జుట్టు ఒత్తుగా బలంగా పెరగాలా.. ఇదొక్కటి చాలు
పవన్ కల్యాణ్‌ డిప్యూటీ సీఎం పదవిపై TV9 క్రాస్‌ఫైర్‌లో..
పవన్ కల్యాణ్‌ డిప్యూటీ సీఎం పదవిపై TV9 క్రాస్‌ఫైర్‌లో..
ఏపీ రాజకీయాల్లో ఆయనే నా ఫేవరెట్ పొలిటీషియన్- టీవీ9తో అంబటి
ఏపీ రాజకీయాల్లో ఆయనే నా ఫేవరెట్ పొలిటీషియన్- టీవీ9తో అంబటి
మావోయిస్ట్ వ్యూహాల్లో భారీ మార్పు? దేవుజీ ఇంటర్వ్యూలో వాస్తవాలు
మావోయిస్ట్ వ్యూహాల్లో భారీ మార్పు? దేవుజీ ఇంటర్వ్యూలో వాస్తవాలు
ఉగాది రోజున నాన్‌వెజ్ తినొచ్చా? తింటే ఏం జరుగుతుంది?
ఉగాది రోజున నాన్‌వెజ్ తినొచ్చా? తింటే ఏం జరుగుతుంది?
ఒంట్లో కొవ్వు కరిగించి.. మీ బాడీని ఏసీలా మార్చేసే మ్యాజిక్ జ్యూస్
ఒంట్లో కొవ్వు కరిగించి.. మీ బాడీని ఏసీలా మార్చేసే మ్యాజిక్ జ్యూస్