AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TRS: జెండా పండుగ నాడు ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయ భూమి పూజ, 2వ తేదీ నుంచి అన్ని సంస్థాగత కమిటీల ఏర్పాటు ప్రక్రియ: కేటీఆర్

సెప్టెంబర్ 2వ తేదీ నుంచి తెలంగాణ వ్యాప్తంగా జెండా పండుగతో టీఆర్ఎస్ గ్రామ, వార్డు కమిటీల నిర్మాణం ప్రారంభమవుతుందని

TRS: జెండా పండుగ నాడు ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయ భూమి పూజ, 2వ తేదీ నుంచి అన్ని సంస్థాగత కమిటీల ఏర్పాటు ప్రక్రియ: కేటీఆర్
KTR
Venkata Narayana
|

Updated on: Aug 27, 2021 | 3:01 PM

Share

KTR Pressmeet: సెప్టెంబర్ 2వ తేదీ నుంచి తెలంగాణ వ్యాప్తంగా జెండా పండుగతో టీఆర్ఎస్ గ్రామ, వార్డు కమిటీల నిర్మాణం ప్రారంభమవుతుందని ఆపార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెల్లడించారు. ఇదే రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర సమితి కార్యాలయ నిర్మాణ భూమి పూజా కార్యక్రమంలో పాల్గొంటారని కేటీఆర్ చెప్పారు. ఆ రోజు నుంచి గ్రామ, పట్టణ కమిటీల నిర్మాణం పది రోజుల వ్యవధిలో పూర్తి చేయాల్సి ఉంటుందని తెలిపారు.

తర్వాత వారంరోజుల లోపల టీఆర్ఎస్ పార్టీ మండల, పట్టణ కార్యవర్గాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని కేటీఆర్ చెప్పారు. తర్వాత జిల్లా కార్యవర్గంతోపాటు, కొత్తగా రాష్ట్ర కార్యవర్గం ఏర్పాటు జరుగుతుందని ఆయన చెప్పారు. సెప్టెంబర్ నెలాఖరులోగా ఈ మొత్తం సంస్థాగత నిర్మాణ ప్రక్రియ పూర్తి చేస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు.

ఇక హైదరాబాద్ లో ఒక ప్రత్యేక విధానాన్ని అవలంభిస్తున్నామని చెప్పిన కేటీఆర్.. డివిజన్ కమిటీలతోపాటు జంటనగరాల్లో ఉన్న 14 వందల పైచిలుకు బస్తీలలో బస్తీ కమిటీలు వేస్తామన్నారు. అంతేకాక, జిల్లా కమిటీలు కూడా హైదరాబాద్ లో వేస్తామని చెప్పారు.

ఏ కమిటీలో అయినా సరే సభ్యులుగా ఉండాలంటే వాళ్లంతా పార్టీ క్రియాశీల సభ్యులై ఉండాలని కేటీఆర్ తెలిపారు. 50శాతం మహిళలు, వెనుకబడ్డ వర్గాలకు అవకాశం కల్పిస్తామని కేటీఆర్ చెప్పారు. అటు, సోషల్ మీడియా కమిటీలు కూడా ఏర్పాటు చేస్తామని కేటీఆర్ వివరించారు. సెప్టెంబర్ 2వ తేదీన ప్రతీ గ్రామం, వార్డులో టీఆర్ఎస్ జెండాలు ఎగరవేసేలా చర్యలు తీసుకుంటామని కేటీఆర్ చెప్పారు.

పనిలోపనిగా కాంగ్రెస్, బీజేపీ పార్టీలపై కేటీఆర్ విమర్శలు గుప్పించారు. తెలంగాణ ప్రజలు చాలా తెలివైన వాళ్లని.. అది బీజేపీ నేతలు గమనించాల్సిన అవసరం ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. నమ్మి ప్రజలు ఓటేస్తే ఏడేళ్లుగా ప్రజల్ని లైన్లలో నిల్చోబెడుతోన్న వ్యవస్థ కేంద్రంలోని బీజేపీదని కేటీఆర్ ఎద్దేవా చేశారు.

చంద్రబాబు ఆడిస్తున్న తోలుబొమ్మ రేవంత్ రెడ్డి అంటూ టీపీసీసీ అధ్యక్షుడిని ఎద్దేవా చేశారు కేటీఆర్. తాజాగా జరిగిన టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలకు సంబంధించి రూపొందించిన కార్యాచరణ ప్రణాళికను పార్టీ శ్రేణులకు తెలియజెప్పేందుకు కేటీఆర్ ఇవాళ హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో మీడియా సమావేశం నిర్వహించి పై వివరాలు వెల్లడించారు.

Read also: Lockers: బ్యాంక్‌ లాకర్ల విషయంలో రూల్స్‌ను పూర్తిగా మార్చేసిన ఆర్‌బీఐ.. ఇప్పడు మరింత ఈజీ