Weather Alert: ఏపీలోని ఆ జిల్లాల్లో రేపు భారీ వర్షాలు.. తెలంగాణలో కూడా మరో 2 రోజులు…
రాగల 24 గంటల్లో ఉత్తర, దక్షిణ కోస్తాలతో పాటు రాయలసీమలో కొన్నిచోట్ల మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇక తెలంగాణలోనూ మరో రెండు రోజులు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
రాగల 24 గంటల్లో ఉత్తర, దక్షిణ కోస్తాలతో పాటు రాయలసీమలో కొన్నిచోట్ల మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. విశాఖ, ప్రకాశం, తూర్పుగోదావరి, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో కొన్నిచోట్ల శనివారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. వాయువ్య బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం ఆవరించి ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. ప్రస్తుతమిది సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఆవరించి ఉన్నట్టు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే సూచనలు ఉన్నట్టు వాతావరణ కేంద్రం వెల్లడించింది. మరోవైపు పశ్చిమగాలుల కారణంగా రాష్ట్రంలో చాలా చోట్ల ఉరుములతో కూడిన జల్లులు కురిసే సూచనలు ఉన్నట్టు తెలిపింది. ఉత్తర కోస్తాంధ్ర , దక్షిణ కోస్తా జిల్లాల్లో కొన్ని చోట్ల, రాయలసీమలో చాలాచోట్ల వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది. ప్రత్యేకించి నెల్లూరు, ప్రకాశం, తూర్పు, పశ్చిమగోదావరి, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో ఒకటి, రెండుచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు.
తెలంగాణలో కూడా
రాగల రెండు రోజులు తెలంగాణలో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలోకి పశ్చిమ, నైరుతి నుంచి కిందిస్థాయి గాలులు వీస్తున్నాయని తెలిపింది. నేడు(గురువారం), రేపు(శుక్రవారం) తేటికపాటి నుంచి మోస్తరు వానలు పడుతాయని, శనివారం పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. రెండు రోజుల్లో పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వానలు కురుస్తాయని చెప్పింది. కాగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే భారీ వర్షాలు కురవడంతో రైతన్నలు విత్తనాలు వేస్తున్నారు. పొలాలన్ని రైతులతో, రైతు కూలీలతో సందడిగా మారాయి.
Also Read: గబ్బిలాల మలమూత్రాలతో ‘ఆ’ పవర్ పెరుగుతుందని ప్రచారం.. తెలంగాణలోని ఆ ప్రాంతానికి నాటు వైద్యుల క్యూ