AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: గబ్బిలాల మలమూత్రాలతో ‘ఆ’ పవర్ పెరుగుతుందని ప్రచారం.. తెలంగాణలోని ఆ ప్రాంతానికి నాటు వైద్యుల క్యూ

 లైంగిక అంశాల గురించి ఇప్పుడు ఇంటర్నెట్‌లో విపరీతమైన సెర్చింగ్ జరుగుతుంది. సెక్స్ కూడా ఒక ఎడ్యుకేషన్ అని మెజార్టీ ప్రజలు అవగాహనకు వచ్చారు. లైంగిక సమస్యలు...

Telangana: గబ్బిలాల మలమూత్రాలతో  'ఆ' పవర్ పెరుగుతుందని ప్రచారం.. తెలంగాణలోని ఆ ప్రాంతానికి నాటు వైద్యుల క్యూ
Bats For Romance
Ram Naramaneni
|

Updated on: Aug 27, 2021 | 1:44 PM

Share

లైంగిక అంశాల గురించి ఇప్పుడు ఇంటర్నెట్‌లో విపరీతమైన సెర్చింగ్ జరుగుతుంది. సెక్స్ కూడా ఒక ఎడ్యుకేషన్ అని మెజార్టీ ప్రజలు అవగాహనకు వచ్చారు. లైంగిక సమస్యలు సొల్యూషన్స్ కోసం ఎన్నో హాస్పిటల్స్, క్లీనిక్స్ ఉన్నాయి. అధునాతన వైద్యం అందుబాటులో వుంది. ఐనా కానీ…సెక్స్‌ అపోహాలతో లోలోపల మదన పడుతున్న కొందరు నాటు వైద్యాన్ని ఆశ్రయిస్తున్నారు. ‘సరసమైన ధరలకే సరసరస గుళికలు మీ సొంతం..’ అని కొందరు అమాయకులను ట్రాప్ చేస్తున్నారు. ‘వన మూలికలతో లైంగిక సామర్ధ్యం  రెట్టింపవుతుంది..లేదంటే డబ్బు వాపస్‌’ అంటూ మరికొందరు గారడీ మాటలతో బురిడీ కొట్టిస్తున్నారు. గబ్బిలాల మలమూత్రాలే లైంగిక సామర్ధ్యం పెంచుకోవడానికి బెస్ట్ మెడిసిన్ అంటూ నాటు వైద్యులు కొత్త దందా షురూ చేశారు. గబ్బిలం అనే మాట వినగానే ఎవరికైనా భయం వేస్తోంది. అదో రకమైన వికారమైన ఫీలింగ్‌ కలుగుతుంది. కరోనా కాలంలో గబ్బిలానికి మాములు క్రేజ్ రాలేదు. పాము, తేలు, చీమ, దోమ..కాదేది ఫాస్ట్‌ఫుడ్‌కు అనర్హం అంటూ చైనా వాళ్లు గబ్బిలాలను కూడా తినేయడం.. ఆపై వూహాన్‌ ల్యాబ్‌లో కరోనా వైరస్‌ పుట్టుకకు గబ్బిలమే కారణమనే టాక్‌ రావడం అందరికీ తెలిసిన విషయమే. కానీ ఉమ్మడి కరీంనగర్‌లో కత మరోలా వుంది. చైనాలో జనభా పెరుగుదలకు సీక్రెట్‌ ఏంటో పసిగట్టినట్టు.. నాటు వైద్యులు పనిగట్టుకొని ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని రాముని పల్లె బాట పడుతున్నారు. ఎందుకంటే ఇక్కడ గబ్బిలాలు సంచారం ఎక్కువగా ఉంటుంది. వారి ఫోకస్ గబ్బిలాల కంటే ఎక్కువ వాటి రెట్ట మీదే ఉంది.

గబ్బిలం రెట్టతో తయారు చేసిన మందును ఎవరి తలపైన రాస్తే.. ఎంతటి వాళ్లయినా సరే రాసినోళ్లకు సరెండరయిపోతారన్న మాట. గబ్బిలం గుళికలో అట్టాంటి పవర్‌ ఉందని ఈ బ్యాచ్ ప్రచారాన్ని షురూ చేసింది. లైంగిక సామర్ధ్యం పెరగాలనుకునేవాళ్లకు శృంగార ఔషధంగా , కీళ్ల నొప్పులు, పక్షవాతం తగ్గాలనుకునే వాళ్లకు గబ్బిలాల ద్వాారా సేకరించిన మందుకు మించిన మెడిసిన్ లేదని జోరుగా ప్రచారం చేశారు. నిజమేనని నమ్మి కొందరు.. ట్రై చేస్తే స్వర్గం చూడొచ్చు కదా అని మరికొందరు నాటు వైద్యులను ఆశ్రయించడంతో గబ్బిలం మందుకు మస్తు గిరాకీ పెరిగిందట. డిమాండ్‌ తగ్గ సప్లయ్‌ కావాలి కదా. అందుకే నాటు వైద్యులు, వాళ్ల అనుచరులు ఊరూరు జల్లెడ పడుతూ గబ్బిలాల్ని వేటాడుతున్నారు. అవి ఎందుకు అని ఎవరైనా అడిగితే  మేం తింటాం అని చెప్పారట. అసలు కతేందని ఆరా తీస్తే ఆయుర్వేదం అంటూ కవర్‌ చేశారట. వాటంతట అవి ఇలా స్వేచ్ఛగా సంచరిస్తుంటే ..మరుగు మందు, లైంగిక సామర్ధ్యం పెంచే మందు పేరిట గబ్బిలాల్ని వలవేసి వేటాడుతున్నారు. అలాంటోళ్లను స్థానికులు అదుపులోకి తీసుకున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి నాటు వైద్యుల ముఠాలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.  ఇలాంటి చిట్కాలు, మూఢనమ్మకాలు వల్ల ఫలితాల కంటే ప్రమాదాలే ఎక్కువే. సమస్యలుంటే డాక్టర్లను, ఆస్పత్రులను సంప్రదించాలి కానీ.. ఇలాంటి మూఢ మందుల కోసం చొంగ కారిస్తే లైఫ్‌ రిస్క్‌లో పడ్డం ఖాయం. జర భద్రం బికేర్‌ఫుల్‌.

Also Read: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ఎంపీ నుస్రత్ జహాన్.. ఆమె మాజీ భర్త రియాక్షన్ ఇదే…

 కొద్దిగా గ్యాప్ వచ్చినాది అప్పా.. మళ్లీ రచ్చ షురూ.. రంజుగా తాడిపత్రి రాజకీయం