AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Act Fibernet: యాక్ట్‌ ఇంటర్నెట్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌.. హైదరాబాద్‌ వ్యాప్తంగా ఉచితంగా ఇంటర్నెట్‌..!

Act Fibernet: ఇంటర్నెట్‌ అనేది ప్రతి ఒక్కరు ఫోన్‌లో ఉండి తీరాల్సిందే. నెట్‌కోసం ఎంత రీచార్జ్‌ అయినా సరే నెట్‌లేనిదే ఉండటం లేదు. హైదరాబాద్‌ నగర ప్రాంతంలో..

Act Fibernet: యాక్ట్‌ ఇంటర్నెట్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌.. హైదరాబాద్‌ వ్యాప్తంగా ఉచితంగా ఇంటర్నెట్‌..!
Act Fibernet
Subhash Goud
|

Updated on: Aug 27, 2021 | 3:32 PM

Share

Act Fibernet: ఇంటర్నెట్‌ అనేది ప్రతి ఒక్కరు ఫోన్‌లో ఉండి తీరాల్సిందే. నెట్‌కోసం ఎంత రీచార్జ్‌ అయినా సరే నెట్‌లేనిదే ఉండటం లేదు. హైదరాబాద్‌ నగర ప్రాంతంలో ఎక్కడికి వెళ్లినా ఉచితంగా వైఫై సదుపాయం అందిస్తోంది  ప్రముఖ ఇంటర్నెట్ సర్వీస్‌ ప్రొవైడర్‌ యాక్ట్‌. తన యూజర్లకు గుడ్‌న్యూస్‌ అందించింది. ఇంటి దగ్గరే కాకుండా బయటకు వెళ్లినా సరే ఇంటర్నెట్‌ సేవలు ఉచితంగా అపరిమితంగా పొందేలా సేవలను అందిస్తోంది. దీని కోసం నగరం నలుమూలల ఫ్రీ వైఫై జోన్లు ఏర్పాటు చేసింది.

ప్రభుత్వం, జీహెచ్‌ఎంసీ, యాక్ట్‌ సంస్థల సంయుక్త ప్రాజెక్టు

తెలంగాణ ప్రభుత్వం, జీహెచ్‌ఎంసీ, యాక్ట్‌ సంస్థలు సంయుక్తంగా హై-ఫై ప్రాజెక్టును చేపట్టాయి. అందులో భాగంగా ఆగస్టు మొదటి వారంలో నగర వ్యాప్తంగా మూడు వేలకు పైగా ఫ్రీ వైఫై జోన్లను రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. ఈ వైఫై సెంటర్ల దగ్గర 25 ఎంబీపీఎస్‌ స్పీడ్‌తో 45 నిమిషాల పాటు ఎవరైనా ఇంటర్నెట్‌ని ఉచితంగా వాడుకునే సౌకర్యం ఉంది. హై-ఫైలో భాగంగా గరిష్టంగా వన్‌ జీబీ డేటాను వినియోగించుకునే వీలుంది.

యాక్ట్‌ స్మార్ట్‌ ఫైబర్‌ టెక్నాలజీ సాయంతో..

తాజాగా యాక్ట్‌ స్మార్ట్‌ పైబర్‌ టెక్నాలజీ సాయంతో తన వినియోదారులకు ఇంటి బయట కూడా ఇంటర్నెట్‌ సౌకర్యాన్ని ఉచితంగా అందిస్తోంది యాక్ట్‌ సంస్థ. ఇళ్లు లేదా ఆఫీస్‌ దగ్గర ఇంటర్నెట్‌ కనెక్షన్‌ ఏ ప్లాన్‌లో ఉందో అదే ప్లాన్‌తో హై-ఫైలో ఏర్పాటు చేసిన ఫ్రీ వైఫై జోన్ల దగ్గర కూడా నెట్‌ను వాడుకునే వెసులుబాటును కల్పించింది. అంటే ఫ్రీ వైఫై సెంటర్ల దగ్గర సాధారణ యూజర్లకు 25 ఎంబీపీఎస్‌ స్పీడ్‌తో కేవలం 45 నిమిషాల పాటే నెట్‌ సౌకర్యం అందితే, యాక్ట్‌ యూజర్లకు వారి ఇంటి దగ్గర ప్లాన్‌ ప్రకారం ఎక్కువ స్పీడ్‌తో ఎంత సేపైనా అన్‌లిమిటెడ్‌గా నెట్‌ను వాడుకునే వీలుంటుంది. అదే విధంగా హైదరాబాద్‌ మెట్రో పరిధిలో ఉన్న 47 స్టేషన్లలో కూడా ఈ నెట్‌ సౌక్యర్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది.

వరంగల్‌లో కూడా..

ఇక హైదరాబాద్‌ తర్వాత రెండో పెద్ద నగరమైన వరంగల్‌లోనూ ఈ ఉచిత వైఫై సదుపాయాన్ని ప్రారంభించినట్లు యాక్ట్‌ సంస్థ వెల్లడించింది. వరంగల్‌, హన్మకొండ, కాజీపేటల పరిధిలో మొత్తం 18 ఉచిత వైఫై సెంటర్లు అందుబాటులోకి తీసుకువచ్చింది. కళాశాలలు, లైబ్రరీలు, పోలీస్‌ స్టేషన్లు, ఆస్పత్రులు, షాపింగ్‌మాల్స్‌ తదితర చోట్ల వీటిని ఏర్పాటు చేశారు.

ఉచిత వైఫై కావాలంటే ఇలా చేయండి..

► ఉచిత ఇంటర్నెట్ సదుపాయం పొందాలంటే హై ఫై నెట్‌ జోన్‌ పరిధిలోకి వెళ్లాలి ► ఆ తర్వాత వై-ఫై సెట్టింగ్స్‌లో ACT Free HY-Fi ని ఎంచుకోవాలి. ► వెంటనే యూజర్‌ లాగిన్‌ పాప్‌అప్‌ అవుతుంది. అక్కడ రిజిస్ట్రర్‌ మొబైల్‌ నెంబర్‌ ఎంటర్‌ చేయాలి. ► మీ మొబైల్‌ నెంబర్‌కు నాలుగు అంకెలా ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్‌ చేయాలి ►సాధారణ వినియోగదారుల కాల పరిమితి ముగిసిన తర్వాత రూ. 25, రూ. 50తో టాప్‌ఆప్‌ పొందవచ్చు. యాక్ట్‌ వినియోగదారులకైతే ఇంటి దగ్గర ప్లాన్‌నే ఇక్కడ కంటిన్యూ చేయవచ్చు.

ఇవీ కూడా చదవండి

Black Holes: అంతరిక్షంలో తొలిసారి.. మూడు భారీ బ్లాక్‌హోల్స్‌ విలీనం.. వింతను ఆవిష్కరించిన భారత శాస్త్రవేత్తలు!

Aadhaar Card: ఆధార్ కార్డులో పేరుతో పాటు ఇతర వివరాలు మార్చుకోవాలా..? ఈ డాక్యుమెంట్లలో ఏదైనా సమర్పించవచ్చు..!