AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Black Holes: అంతరిక్షంలో తొలిసారి.. మూడు భారీ బ్లాక్‌హోల్స్‌ విలీనం.. వింతను ఆవిష్కరించిన భారత శాస్త్రవేత్తలు!

Black Holes: అంతరిక్ష పరిశోధనలలో ఇప్పటి వరకు ఖగోళ వింతకు స్థానం దక్కింది. మూడు పాలపుంతల్లోని మూడు భారీ కృష్ణ బిలాలు(బ్లాక్‌హోల్స్‌) ఒకదానితో ఒకటి కలిసిపోయాయి..

Black Holes: అంతరిక్షంలో తొలిసారి.. మూడు భారీ బ్లాక్‌హోల్స్‌ విలీనం.. వింతను ఆవిష్కరించిన భారత శాస్త్రవేత్తలు!
Black Holes
Subhash Goud
|

Updated on: Aug 27, 2021 | 2:42 PM

Share

Black Holes: అంతరిక్ష పరిశోధనలలో ఇప్పటి వరకు ఖగోళ వింతకు స్థానం దక్కింది. మూడు పాలపుంతల్లోని మూడు భారీ కృష్ణ బిలాలు(బ్లాక్‌హోల్స్‌) ఒకదానితో ఒకటి కలిసిపోయాయి. ఇంకో విషయం ఏంటంటే.. భారత్‌కు చెందిన ముగ్గురు ఖగోళ పరిశోధకులు ఈ వింతను ఆవిష్కరించడం. పాలపుంతలో తాజాగా ఈ మూడు బ్లాక్‌ హోల్స్‌ను గుర్తించారు. ముందుగా జంట బిలాల గమనాన్ని పరిశీలించిన శాస్త్రవేత్తలు.. మూడో దానితో వాటి విలీనానికి సంబంధించిన పరిశోధనను ‘ఆస్రోనమీ’ జర్నల్‌లో పబ్లిష్‌ చేశారు. ‘మూడో పాలపుంత(గెలాక్సీ) ఉందనే విషయాన్ని గుర్తించామని అన్నారు. ఎన్‌జీసీ7733ఎన్‌.. అనేది ఎన్‌జీసీ7734 గ్రూప్‌లో ఒక భాగం. ఉత్తర భాగం కిందగా ఇవి ఒకదానిని ఒకటి ఆవరించి ఉన్నాయి’ అని పేర్కొన్నారు.

గెలాక్సీ జంట.. ఎన్‌జీసీ7733ఎన్‌-ఎన్‌జీసీ7734లోని పాలపుంతలు ఒకదానితో ఒకటి కలిసిపోయాయి. సాధారణంగా కృష్ణబిలాల కలయిక తీవ్రమైన ఒత్తిడి, శక్తిని కలుగజేస్తుంది. అయితే వాటి విలీనం ఒకదానితో ఒకటి కాకుండా.. పక్కనే ఉన్న మూడో భారీ బ్లాక్‌హోల్‌లోకి విలీనం కావడం ద్వారా ఆ ఎనర్జీ అంతగా ప్రభావం చూపలేకపోయిందని పేర్కొన్నారు.  ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఆస్ట్రోఫిజిక్స్‌కు చెందిన జ్యోతి యాదవ్‌, మౌసుమి దాస్‌, సుధాన్షు బార్వే.. ఆస్ట్రోసాట్‌ అబ్జర్వేటరీ ద్వారా అల్ట్రా వయొలెట్‌ ఇమేజింగ్‌ టెలిస్కోప్‌ సాయంతో వీటిని వీకక్షించగలిగారు. ఈ అధ్యయనం కోసం సౌతాఫ్రికా ఐఆర్‌ఎస్‌ఎఫ్‌, చిలీ వీఎల్‌టీ, యూరోపియన్‌ యూనియన్‌కు చెందిన ఎంయూఎస్‌ఈ టెక్నాలజీల సాయం తీసుకున్నారు. అంతేకాదు కృష్ణ బిలాల విలీనానికి సంబంధించిన ప్రకాశవంతమైన యూవీ-హెచ్‌ ఆల్ఫా ఇమేజ్‌లను సైతం విడుదల చేశారు.

Curiosity Rover: మార్స్ పై క్యూరియాసిటీ తొమ్మిదేళ్ల విజయవంత ప్రయాణం..అరుణ గ్రహ తాజా చిత్రాలివే!

youtube videos: పది లక్షల వీడియోలను తొలగించిన యూట్యూబ్‌.. వీటిలో దానికి సంబంధించినవే ఎక్కువ.