Mi TV 5X: అడాప్టివ్ బ్రైట్‌నెస్.. ప్యాచ్‌వాల్ 4తో విడుదలైన ఎంఐ టీవీ 5ఎక్స్.. ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?
Mi TV 5X: ఎంఐ టీవీ 5X ను గురువారం జరిగిన షియోమి స్మార్టర్ లివింగ్ 2022 ఈవెంట్‌లో ఎంఐ బ్యాండ్ 6 తో పాటు లాంచ్ చేశారు.
Mi TV 5X: ఎంఐ టీవీ 5X ను గురువారం జరిగిన షియోమి స్మార్టర్ లివింగ్ 2022 ఈవెంట్‌లో ఎంఐ బ్యాండ్ 6 తో పాటు లాంచ్ చేశారు. కొత్త టీవీల శ్రేణి ఎంఐ టీవీ 4X శ్రేణికి అప్‌గ్రేడ్ చేసి విడుదల చేశారు. ఇది గత సంవత్సరం విడుదల చేశారు. ఎంఐ టీవీ 5X డాల్బీ అట్మోస్ సౌండ్ ఎఫెక్ట్‌తో 40W స్పీకర్లతో విడుదలైంది. ఇది ఇంటిలోని కాంతికి అనుగుణంగా టెలివిజన్ ప్రకాశాన్ని సర్దుబాటు చేసే అడాప్టివ్ బ్రైట్‌నెస్‌ని అనుసంధానం చేస్తుంది. ఎంఐ టీవీ 5X ప్యాచ్‌వాల్ 4 ఇంటర్‌ఫేస్‌తో నడుస్తుంది. అలాగే గూగుల్ అసిస్టెంట్‌ని సులభంగా యాక్సెస్ చేసే అవకాశం కూడా ఇందులో ఉంది. షియోమి ఇప్పటివరకు 6 మిలియన్ స్మార్ట్ టీవీలను విక్రయించిందని, వాటిలో మూడింట ఒక వంతు 4K స్మార్ట్ టీవీ శ్రేణికి చెందినవి అని పేర్కొంది.
భారతదేశంలో Mi TV 5X ధర.. భారతదేశంలో కొత్త ఎంఐ టీవీ 5X ధర రూ. 43-అంగుళాల మోడల్ రూ. 31,999, 50-అంగుళాల మోడల్ రూ. 41,999, అలాగే రూ. 55-అంగుళాల మోడల్ రూ. 47,999గా నిర్ణయించారు. ఎంఐ టీవీ 5X సిరీస్ Mi.com, Flipkart.com, Mi హోమ్, Mi స్టూడియోతోపాటు క్రోమాలో సెప్టెంబర్ 7 మధ్యాహ్నం 12 గంటలకు అందుబాటులో ఉండనున్నాయి. లాంచ్ ఆఫర్లలలో భాగంగా రూ. HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డులు, EasyEMI కన్వర్షన్‌లతో 3,000 స్పాట్ డిస్కౌంట్ అందించనుంది. అలాగే తొమ్మిది నెలల వరకు నో-కాస్ట్ EMI ఆఫర్‌లు కూడా ఉన్నాయి.
Mi TV 5X స్పెసిఫికేషన్స్.. ఫీచర్లు ఎంఐ టీవీ 5X అడాప్టివ్ బ్రైట్‌నెస్ ఫీచర్‌తో విడుదలైంది. ఈ ఫీచర్ మీ ఇంటి వాతావరణంలోని వెలుతురుకు అనుగుణంగా టీవీ రంగులు మార్చుకోగలదు. కొత్త ఎంఐ టీవీ 5X 96.6 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియో, ప్రీమియం మెటాలిక్ బెజెల్స్, ఒక బిలియన్ కలర్ వ్యూ, 4K రిజల్యూషన్ డిస్‌ప్లేతో అలరించనుంది. టెలివిజన్‌లో డాల్బీ అట్మోస్ మద్దతుతో 40W స్టీరియో స్పీకర్‌లు (43-అంగుళాల మోడల్‌లో 30W)అమర్చారు. ఇది 43-అంగుళాలు, 50-అంగుళాలు, 55-అంగుళాలతో లభించనుంది.
మెరుగైన గూగుల్ అసిస్టెంట్ సేవల కోసం ఎంఐ టీవీ 5X ఫార్-ఫీల్డ్ మైక్‌లను కలిగి ఉందని షియోమి తెలిపింది. టీవీలో మూడు HDMI 2.1 పోర్ట్‌లు, రెండు USB పోర్ట్‌లను కలిగి ఉంది. మెరుగైన గేమింగ్ అనుభవం కోసం అంతర్నిర్మిత ఆటో లో లాటెన్సీ మోడ్‌ని కలిగి ఉంది. ఇందులో 2GB ర్యామ్, 16GB స్టోరేజ్ ఉంది. ఇది 64-బిట్ క్వాడ్-కోర్ A55 CPU, మాలి G52 MP2 GPU ద్వారా నడవనుంది. 30 OTT యాప్‌ల నుంచి 75 కి పైగా ఉచిత లైవ్ ఛానెల్‌లు అందుబాటులో ఉంటాయి. 15 నుండి భాషల నుంచి కంటెంట్‌ను యాక్సెస్ చేయవచ్చు.
Train Brake System: రైలుకి బ్రేకులు ఎలా పడుతాయో ఎప్పుడైనా ఆలోచించారా..! తెలిస్తే ఆశ్చర్యపోతారు..