AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Train Brake System: రైలుకి బ్రేకులు ఎలా పడుతాయో ఎప్పుడైనా ఆలోచించారా..! తెలిస్తే ఆశ్చర్యపోతారు..

Train Brake System: సైకిల్‌, బైక్‌, కార్లకు బ్రేకులు ఎలా వేస్తారో అందరికి తెలుసు. అయితే వేలాది మందితో ప్రయాణిస్తున్న

Train Brake System: రైలుకి బ్రేకులు ఎలా పడుతాయో ఎప్పుడైనా ఆలోచించారా..! తెలిస్తే ఆశ్చర్యపోతారు..
Indian Railway
uppula Raju
|

Updated on: Aug 27, 2021 | 11:48 AM

Share

Train Brake System: సైకిల్‌, బైక్‌, కార్లకు బ్రేకులు ఎలా వేస్తారో అందరికి తెలుసు. అయితే వేలాది మందితో ప్రయాణిస్తున్న రైళ్లకి బ్రేకులు ఎలా వేస్తారో ఎప్పుడైనా ఆలోచించారా.. సాధారణంగా రైలు ఇంజన్‌కి చాలా బోగీలు జతచేసి ఉంటాయి మరి అన్ని బోగీలకు ఒకేసారి బ్రేకులు పడుతాయా.. అంటే పడుతాయి. అసలు రైల్‌ బ్రేక్‌ సిస్టమ్‌ ఎలా పనిచేస్తుందో ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వాస్తవానికి రైలు బ్రేకులు ఎల్లప్పుడూ ఆన్‌లో ఉంటాయి. రైలు కదులుతున్నప్పుడు మాత్రం బ్రేక్ తీసివేస్తారు. సాధారణంగా లోకో పైలట్లు రైలు నడుపుతున్నప్పుడు గాలి ఒత్తిడి ద్వారా చక్రాల నుంచి బ్రేక్‌లను తీసివేస్తారు. అయితే రైలు ఆపవలసి వచ్చినప్పుడు వాటికి గాలి ఇవ్వడం మానేస్తారు దీంతో ఆటో మేటిక్‌గా బ్రేకులు పడుతాయి. ఈ కారణంగా రైలు ఆగినప్పుడల్లా పెద్ద పెద్ద శబ్దాలు వెలువడుతాయి.

జనరల్ కోచ్‌ల టైర్లలో బ్రేకులు చాలా త్వరగా పడుతాయి. ఎందుకంటే రద్దీ కారణంగా బ్రేక్, చక్రాల మధ్య దూరం తగ్గుతుంది. దీని కారణంగా బ్రేక్ ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అందుకే రైలు ఆగినప్పుడల్లా రబ్బరు కాలిపోయిన వాసన వస్తుంది. అలాగే రైలు నడుస్తున్నప్పుడు లోకో పైలట్ అప్రమత్తంగా ఉండాలి. లేదంటే ట్రైన్‌ రన్నింగ్‌లో బ్రేకులు పడే అవకాశాలు ఉంటాయి. వాస్తవానికి రైలు నడుపుతున్నప్పుడు లోకో పైలట్లు ఏం చేసినా ఇంజిన్‌కి తెలుస్తుంటుంది. డ్రైవర్ హార్న్ ఊదడం, బ్రేకులు వేయడం, వేగం పెంచడం వంటి ఏవైనా పనులు చేస్తే, డ్రైవర్ యాక్టివ్‌గా ఉన్నాడని సందేశం ఇంజిన్‌కు చేరుతుంది.

లోకో పైలట్ ఇంజిన్‌లో ఉన్న డెడ్ మ్యాన్స్ లివర్‌ను క్రమానుగతంగా నొక్కాల్సి ఉంటుంది. డెడ్ మ్యాన్స్ లివర్ అనేది ఒక ప్రత్యేక పరికరం ఇది డ్రైవర్ చురుకుగా ఉందని ఇంజిన్‌కు సంకేతాలిస్తుంది. డ్రైవర్ ప్రతి 2-3 నిమిషాలకు ఈ పరికరాన్ని నొక్కకపోతే ఇంజిన్ స్వయంచాలకంగా రైలు వేగాన్ని తగ్గిస్తుంది అంతేకాదు కొద్ది దూరం తర్వాత ఆగిపోతుంది. ఈ రెండు టెక్నాలజీలు గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ అంటే GPS కి కనెక్ట్ చేస్తారు. రైలు కదులుతూ గ్రీన్ సిగ్నల్ దాటినప్పుడు దాని మొత్తం సమాచారం రైల్వే సర్వర్‌లో అప్‌లోడ్ చేయబడుతుంది. రైలు ఎక్కడి నుంచి బయలుదేరింది, ఏ సిగ్నల్ రాబోతోంది ఈ సమాచారం మొత్తం లోకో పైలట్‌కు తెలుసు. ఏదైనా పొరపాటు కారణంగా రైలు రెడ్ సిగ్నల్ జంప్ చేస్తే దాని సమాచారం సర్వర్‌కు వెళ్తుంది. ఈ సర్వర్ GPS అనుసంధానం అయి ఉంటుంది. దీంతో ఆటోమేటిక్‌గా బ్రేక్‌లు పడిపోతాయి. దీంతో రైలు అక్కడే ఆగిపోతుంది.

Rashi Khanna: షూటింగ్‌ విరామంలో రాశీ ఖన్నా ఏం చేస్తుందో చూశారా.? దాని గురించే ఆలోచన..

Zainab Abbas: సిరాజ్ బౌలింగ్‌కు ఫిదా అయిన పాకిస్తాన్ యాంకర్ జైనాబ్​ అబ్బాస్​.. ఏం జరుగుతోంది..?

Xiaomi smarter living 2021: షియోమీ సరికొత్త గ్యాడ్జెట్స్..అధునాతన టెక్నాలజీ..ఈ స్మార్ట్ గాడ్జెట్స్ ఫీచర్లు ఇవే!